http://apvarthalu.com/

Wednesday, December 12, 2012

యువరాజ్‌ ఓ ప్రత్యేకమైన పుట్టిన రోజు 12-12-12

క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ఈరోజు ఓ ప్రత్యేకమైనది. ఆయన పుట్టిన రోజు డిసెంబరు 12 కావడం, మూడు పన్నెండులు రావడం, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో ఈరోజు యువీకి ప్రత్యేకమైన పుట్టిన రోజుగానే చెప్పవచ్చు. ఈరోజుతో యువీకి 31 ఏళ్లు నిండుతాయి. క్యాన్సర్‌ నంచి కోలుకున్న తరువాత ఆయన జరపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆయన కుటుంబసభ్యులే కాదు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వ్యక్తిగా యువరాజ్‌ ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన పెంచడానికి తన పుట్టిన రోజును కేటాయిస్తున్నాడు. యూ వుయ్‌ కెన్‌ పేరుతో తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. స్నేహితులు తనకు మద్దతు ఇవావ్లని యువరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Saturday, December 8, 2012

టాలీవుడ్ పై డ్రగ్స్ మత్తు!

ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం.. నేడు మాదకవూదవ్యాలకు అడ్డాగా మారింది. రోజు ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలతో సతమవుతున్న సినిమా పరిశ్రమ డ్రగ్స్ కలకలంతో తలెత్తుకోలేకపోతోంది. యువత శక్తిని నిర్వీరం చేస్తున్న మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమను వదల్లేదు. గ్లామర్ రంగంలో ఉన్న యువత సులభంగా డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు, యువ హీరోలు, హీరోయిన్లు, శ్రీమంతుల బిడ్డలు ఈ విష కౌగిలిలో చిక్కి పతనమైపోతున్నారు. ఖరీదైన హోటళ్లు, పబ్ లు, రిస్టార్టులు కేంద్రాలుగా డ్రగ్స్ చెలామణి అవుతున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని మాయా వలలు విసురుతున్నారు. పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న యువతను మత్తుకు ఈజీగా గులాములవుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడిన వారు బానిసలు మారుతున్నారు. red more

సాక్షికి మేత..సంబరాల్లో జగన్ పార్టీ

చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజా బలం లేక చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని విలీనం కావడం ఖాయం అని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఎఫ్ డీ ఐలకు సంబంధించి ఓటింగ్ లో పాల్గొనాల్సిన టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.red more

తెలంగాణపై బాబు, జగన్ ఇరుక్కుపోయారా...

తెలంగాణపై ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అఖిలపక్ష సమావేశాన్ని డిసెంబర్ 28న ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఏం చెబుతుందన్నది పక్కన పెడితే, ఇప్పుడు అతిపెద్ద సమస్య టీడీపీ, వైఎస్సార్ సీపీలకే. అఖిలపక్ష సమావేశాన్ని పెడితే, తమ పార్టీ తరపున ఒక్కరినే పంపి స్పష్టమైన అభిప్రాయం చెబుతామంటూ పాదయాత్రకు ముందే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాద్యత ఆయనపై ఉంది. మాట తప్పుదామంటే, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లో సాగుతున్న ఆయనయాత్ర డిసెంబర్ 28 నాటికి ఇంకా తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అఖిలపక్షంలో నిర్ణయం ప్రకటిస్తే, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అటు చంద్రబాబు రూట్లోనే పాదయాత్ర చేసుకొస్తున్న షర్మిల కూడా ఆ సమయానికి తెలంగాణలోనే ఉండొచ్చుred more

Monday, December 3, 2012

1000 కి.మీ పూర్తి చేసుకొన్న…వస్తున్నా…మీకోసం


సోమవారం ఉదయం జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ పంటక్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు పెంటాఖుర్దులో 1000 కి.మీ మైలు రాయిని దాటారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై మొదటి సంతకం, బెల్లు షాపుల రద్దుపై రెండో సంతకం ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ జిల్లాలో నిజాంసాగర్, మంజీరా ఉన్నా మంచినీళ్లకు తీవ్ర కొరత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ‘మంచినీళ్లు నిల్, మద్యం ఫుల్’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర మంచినీటి పథకాలు పెట్టి అన్ని గ్రామాలు, తండాలకు ఎన్టీఆర్ సృజల అనే కార్యక్రమంతో మంచినీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇవ్వదలిచామని ఆయన తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నా న్యాయం జరగలేదన్నారు.red more

Saturday, December 1, 2012

నిజంగా ప్రేమించడం అంటే ఏంటో!


ప్రియమైన సాటి ప్రేమికులందరికీ ప్రేమపూర్వక సుస్వాగతం... ఈ రోజుల్లో చాల మంది ప్రేమికులు తాము ప్రేమిస్తున్నామనే భావనలో ఉంటున్నారేకానీ నిజంగా ప్రేమించడం లేదు దాని చాల కారణాలు ఉన్నాయి..
వారికి నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలియకపోవడం, ఎలా ప్రేమించాలో తెలియకపోవడం, ప్రేమిస్తే ఎం చేయాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం. ప్రేమలో ఎదుటి వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తారో తెలియకపోవడం
ఇలా చాల కారణాలు ఉండొచ్చు...అలా అని వారి ప్రేమ స్వచ్చమైనది కాదు అని నేను అనను.. కానీ ప్రేమంటే పూర్తిగా తెలియకపోవడం వల్లనే వారి మద్య గొడవలు, అలకలు, విడిపోవడాలు జరుగుతున్నాయి.. ప్రేమలో ఎంత ఆనందం ఉంటుందో దానిలో తేడాలు వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ నరకం కనిపిస్తుంది..ఆలాంటి బాధని ఏ ప్రేమికులు అనుభవించకూడదు అన్న చిన్ని సంకల్పంతో ఒక చిన్ని ప్రయత్నాన్ని ఆరంబించబోతున్నాను..
ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి నేను సరిపోను కానీ నాకు తెలిసిన కాస్త ప్రేమ జ్ఞానాన్ని మీకు అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం అంతే...
నా ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఒక్క జంటలో మార్పు వచ్చిన సరే నా ఏ ప్రయత్నం సఫలం అయినట్టే.. అందరికి మహోన్నతమైన ప్రేమదొరకాలని ఆకాంక్షిస్తూ...........ప్రేమతో మీ..

జగన్‌ గెలిచినా కష్టాలు: జెసి దివాకర్ రెడ్డి


 కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలతో శనివారం అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో వారిని మీడియా చూసి జెసి కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు చేరిందా? లేక వైయస్సార్ కాంగ్రెసులో జెసి కాంగ్రెసు చేరిందా? అని ప్రశ్నించారు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు జెసి పేరులోనే జగన్ కాంగ్రెసు ఉందని చెప్పారు.
ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.

Wednesday, November 28, 2012

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా తన ప్రస్తానం ప్రారంభించిన త్రివిక్రమ్ తన పదునైన రచనా నైపుణ్యంతో అనతి కాలంలోనే పాపులర్ డైలాగ్ రైటర్‌గా ఎదిగారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కేవలం 5 మాత్రమే. అయినా అతని సినిమాలంటే జనాల్లో మహా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.red more

చెయ్యెత్తితే బస్పు ఆగదు..బొత్స నిర్వాకం !


వెనకటికి ఓ కథ ఉంది. ఆ కథలో కుక్క, గాడిద ఉంటాయి. ఓ రోజు కుక్క చేయాల్సిన పని అత్యుత్సాహంతో గాడిద చేస్తుంది. దాని పర్యావసానం గాడిద నడ్డి విరుగుతుంది. కాకాలు పట్టి, అడుగులకు మడుగులొత్తి రాజకీయాల్లో చేరి అమాత్యులైనవారు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో తాజాగా ఆర్టీసీ లో తీసుకుంటున్న నిర్ణయాలు తేల్చిచెబుతున్నాయి. మందు దందా చేసే వారు మంత్రులయితే ఎలా ఉంటుందో తాజాగా బొత్స నిర్ణయం అలాగే ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఇటీవలె ఛార్జీలు పెంచారు. అయినా ఆర్టీసి రూ.4200 కోట్లు అప్పులు ఉంది. నెలకు రూ.100 కోట్లు వడ్డీ చెల్లిస్తుంది. అయినా కార్మికుల జీతాల కోసం ప్రతి నెలా రుణాలు తేవాల్సి వస్తోందట. అందుకే ఈ నష్టాల భర్తీకి మరోసారి ప్రయాణీకుల మీద భారం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రయాణికుడి నుండి అర్ధ రూపాయి నుండి రూపాయి దాకా సర్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సంతకం కూడా చేసేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.  ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది అది ఏంటంటే ఆర్టీసీలో ఫ్లాట్ ఫాం టికెట్ ప్రవేశ పెడతారట. అంటే రైల్వేస్టేషన్లలో మాదిరిగా అన్నమాట. బస్టాండుకు వచ్చిన ప్రతి ప్రయాణికుడి ఈ డబ్బులు వసూలు చేసి ఆయా బస్ స్టేషన్ల నిర్వహణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారట.red more

పార్టీ - పార్టీ నడుమ కోదండరామ్


నారీ నారీ నడుమ మురారి అన్నట్లు రెండు తెలంగాణ పార్టీల మధ్య తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిల మధ్య విభేదాలు కోదండరామ్‌కు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. రెండు తెలంగాణ పార్టీల మధ్య వైరాన్ని నివారించేందుకు తెలంగాణ రాజకీయ జెఎసి నడుం బిగించింది.
మంగళవారం సమావేశమైన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆవశ్యకతను గుర్తించింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తెలంగాణవాదానికి నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీన తలపెట్టిన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి జెఎసి రెండు పార్టీలను కూడా ఆహ్వానించింది.red more

Tuesday, November 27, 2012

మన రాష్ట్రంలో దేవుడు తలలు పగులగొట్టుకోమన్నాడా?

మొహరం సందర్భంగా షియా భక్తులు తలలు పగులకొట్టుకోవడం, గుండెలపై బాదుకోవడం...
కర్నూలుజిల్లా దేవరగట్టులో భక్తులు దేవుడ్ని దక్కించుకోవడానికి కర్రల సమరం. పగిలే తలలు..
గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ వేయించుకోవడం, ముళ్ళ కిరీటాలు ధరించడం...
కాళీమాతకు తన నాలుక కోసి అర్పించిన భక్తుడు...
దేవుడ్ని చూడాలనే తపనతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు....red more

Sunday, November 25, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోం:కిరణ్ కుమార్ రెడ్డి

 వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.red more

Saturday, November 24, 2012

జగన్ పార్టీలోకి చూద్దాం:కావూరి సాంబశివ రావు


పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.
నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.

Friday, November 23, 2012

‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

శాసనసభకే పోటీ చేస్తా…బాలకృష్ణ

2014 సాధారణ ఎన్నికల్లో పోటీ అంశంపై  హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని బాలయ్య తోసిపుచ్చారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. పార్టీలు మారేవారంతా అవకాశవాదులని, కొందరు స్వార్థం కోసమే వలసలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వలసల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్శించారు.red more

Tuesday, November 20, 2012

రాష్ట్రంలో సానుభూతి భయం

జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక… ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం చూపించగలిగి ఉన్నా… ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే… ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప… ఆయనను జైల్లో ఉంచడం అనేది… వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది. వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు …red more

Monday, November 19, 2012

రాష్ట్రంలో వణికిస్తున్న చలి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. శీతాకాలానికి వాయుగుండం తోడు కావడంతో చలి విజృంభిస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండంతో చలి గాలులు అధికమయ్యాయి. ఏటా నవంబర్ మూడో వారం చలికాలం సీజన్ ప్రారంభమవుతుండగా, ఈ ఏడాది మొదటి వారం నుంచే చలి ప్రతాపం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో 14, 16, 18 డి గ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో RED MORE

Saturday, November 17, 2012

ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్లి...సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

స్వశక్తితోనే సాధికారిత సాధ్యం అని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగసాన్‌సూకీ అన్నారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా పాపసానిపల్లిలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనీతీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూకీ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల చాలా పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. తమ దేశంలో కూడా పథకాలు అమలు చేస్తామని సూకీ పేర్కొన్నారు.
ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాయిలకు సలహా ఇచ్చారు. మడకశిరలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను సిఎం అయిన తరువాత లక్షా 20వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఉద్యోగాల భర్తీలో సిఫారసులకు తావులేదని, ప్రతిభకే పట్టం అన్నారు. తాను, రఘువీరా రెడ్డి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆయన త్వరగా మంత్రి అయ్యారని తెలిపారు. తనకు మంత్రి పదవి రాలేదని, ఇక ఎప్పటికీ మంత్రిని కాలేనని ఆయన అన్నారు. 

పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం

నగరంలోని పాతబస్తీలో ప్రశాంతం వాతావరణం నెలకొంది. పోలీసులు రాకపోకలను అనుమతించారు. దుకాణాలు తెరుచుకున్నాయి. శాలిబండ, చార్మినార్ వద్ద బారికేడ్లను తొలగించారు. చార్మినార్‌కు సందర్శకుల రాక మొదలైంది. రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కొనసాగుతోంది. పాతబస్తీ పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పాత బస్తీ ప్రశాంతంగా ఉన్నప్పటికీ రేపటి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ...దిగ్విజయ్ సింగ్‌

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి బాధ్యతలు దిగ్విజయ్ సింగ్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్‌కు శనివారంనాడు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పూలగుచ్ఛం ఇవ్వడాన్నిబట్టి ఢిల్లీ రాజకీయ పరిశీలకులలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చండి అని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌ను కోరారు. కాబోయే ఇన్‌ఛార్జి దిగ్విజయ్ అని తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పెక్కుమంది నాయకులు దిగ్విజయ్ ఇంటికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తనను కలుస్తున్నవారినుంచి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.

Thursday, November 15, 2012

చంద్రబాబే ప్రభుత్వానికి అండ...షర్మిల

మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజల మనసుల్లో కొలువైవున్న ఆయనను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయిందని దుయ్యబట్టారు.‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడబూరు చేరుకున్న షర్మిల అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. బాబు తన హయాంలో గ్రామాలను స్మశానాలుగా మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ఇంకొక అవకాశం ఇమ్మంటున్నారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించొచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Wednesday, November 14, 2012

సీమాంధ్ర పార్టీలను తరిమికొట్టాలి... టీఆర్ఎస్

తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్ర పార్టీ లను తరిమి కొ ట్టాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ శాసం రామకృష్ణ అన్నారు. మండల పరిధి దేవరఫస్లాబాద్ పంచాయతీ లొట్టికుంటతండాలో సోమవారం పార్టీ జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించకుండా దొంగతనంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా పాలకులు అడ్డు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఆస్తులను సీమాం«ద్రులు ఇష్టనుసారం తమ ప్రాంతాలకు తరలించుకుని పోతున్నా ఏమీ పట్టనట్లు పాలకులు వ్యవహరిస్తుండడం చూస్తుంటే తెలంగాణ ప్రాంతాల పట్ల వారికి గల వివక్ష అర్థమవుతోందని అన్నారు. తెలంగాణ సాధన కోసం దాదాపు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లుగా కూడా లేద న్నారు.

Tuesday, November 13, 2012

రాష్ట్రంలో రెచ్చిపోతున్న హిజ్రాలు

                                           
రాష్ట్రంలో పలు చోట్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కేవలం యాచకులుగా భావించి ప్రజలు, పోలీసులు వారిని అలా వదిలివేయడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లింగపరమైన సమస్య తప్ప వారికి ఏ లోపం ఉండదు. కొందరు లింగమార్పిడి చేసుకున్నవారు కూడా ఉంటారు. ఇటీవల కాలంలో లింగమార్పిడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వారు అన్ని రకాల పనులు చేయగలరు. చేస్తారు కూడా. ఏ పని చేయడానికైనా వారి శరీరం అనువుగానే ఉంటుంది. కానీ వారిలో ఎక్కువ మంది పనిపాట లేకుండా చప్పట్లు కొడుతూ యాచనకు అలవాటుపడిపోయారు. ఏ పని చేయకుండా కాలం గడిచిపోతుండటంతో వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, దోపిడీలకు కూడా తెగబడుతున్నారు. లింగ మార్పిడి చేసుకున్న కొందరు వ్యభిచారానికి అలవాటు పడితే, మరికొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రాంతాలలో వారు తమ వికృత చేష్టలతో యువతీయువకులను, బాలురను వేధిస్తున్నారు. ముఖ్యంగా వారు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, బైపాస్ రోడ్లలో ఎక్కవగా ఉంటారు. రైళ్లలో వారి ఆగడాలకు హద్దులు లేవు. రైల్వే పోలీసులు చూసిచూడనట్లు వదిలివేయడంతో వారు రెచ్చిపోతున్నారు. రైళ్లలో చప్పట్లు చరుస్తూ వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడతారు. వారు అడిగినంత ఇవ్వాలి. ఇవ్వకపోతే హింసే. కుర్రవాళ్లని నానారకాలుగా ఇబ్బందిపెడతారు. వారిమీదకు ఎగబడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని దోచేస్తారు. వారికి ఎదురు తిరిగి నిలబడటం కష్టం. మహిళలను కూడా వేధిస్తారు. వికృత చేష్టలతో హింసిస్తారు. కొన్ని సందర్భాలలో వారి చేష్టల వల్ల ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. బైపాస్ రోడ్లలో రాత్రి అవ్వగానే మొదలుపెట్టి, తెల్లవారుజాము వరకు అక్రమవసూళ్లు కొనసాగిస్తారు. వాహనదారులను వేధిస్తారు. డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారు. 

హైదరాబాద్‌లో 12.12.12న 'చూమంతర్'

వచ్చే నెల 12వ తేదీన 12.12 గంటలకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ మెజీషియన్స్ సదస్సు 'చూ మంతర్'కు బ్రోచర్‌ను సోమవారం నాడిక్కడ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, సదస్సు కన్వీనర్ సామల వేణు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

Sunday, November 11, 2012

హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్!

హైదరాబాద్ పాతబస్తీ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. చార్మినార్ ప్రాంగణంలోనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా ఇటు మతపరమైన, అటు రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. పాతబస్తీలోని చార్మినార్ కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయ మరమ్మతులు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీపావళి పండుగ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఆలయ షెడ్‌ను ఈ నెల 1న తొలగించి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. అది చూసిన మరో వర్గం ప్రజలు ఆలయాన్ని విస్తరిస్తున్నారని అపార్ధం చేసుకున్నారు. పనులకు అడ్డుతగిలారు. ఆ తరువాత ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ఆందోళనకు దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ తరువాత దేవాలయ నిర్వాహకురాలి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వక్తం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు లోబడి ఆదివారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పాతబస్తీ భగ్గుమంది. 

చిక్కుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా, మూలుగుతూ ముక్కుతూ నడుస్తున్న కిరణ్ ప్రభుత్వంపై పాతబస్తీ గ్యాంగ్ లీడర్ ఒవైసీ విరుచుకుపడ్డాడు. తమ పార్టీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నాడు. సరాసరి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని తన అస్త్రాన్ని సంధించాడు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. చార్మినార్ ను అనుకుని ఉన్న భాగ్య లక్ష్మీ ఆలయం విషయంలో మజ్లిస్ పార్టీ నాయకులు అతి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మజ్లిస్ పార్టీ మండిపడుతోంది. తమ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఏమిటని వారు వాదిస్తన్నారు. వివాదాన్ని ఎవరు రాజేశారు అనేది పాయింటుకాదు కానీ, ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి మీద పడుతుండటం విషయం. ఒవైసీలకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. ఢిల్లీ జుమా మసీద్ ఇమామ్ స్థాయిలో ఒవైసీలను ట్రీట్ చేస్తూ వస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఒవైసీ మద్దతు ఉపసంహరించుకుంటాను అంటే వారు ఉలిక్కిపడతారు. ముస్లింలంతా తమకు దూరం అయిపోయారని బాధపడతారు. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి కిరణ్ కు మొటిక్కాయలు తప్పకపోవచ్చు. సన్నిహితులను దూరం చేస్తున్నావని కిరణ్ పై కేంద్రం మండిపడ వచ్చు.మొత్తానికి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని  అసదుద్దీన్ ఒవైసీ అంటున్నాడు. సోమవార ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని ఆయన అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే అంశంపై  మధ్యాహ్నానికి ఒక  ప్రకటన చేస్తామని ఆయన వివరించాడు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో ఇకపై! మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ వేడి రుచి చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 9లోపు తేల్చాలని డెడ్ లైన్ కూడా విధించారు. లేకుంటే వారు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది నిజమేనన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు బానిసలవుతారని తాను అనుకోవడంలేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. చివరిసారిగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు నిర్ణయించుకున్నారు. ఆ లేఖలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, అందులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, తమ బాధని, ఆవేదనని వివరించాలని అనుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి ఇదే సమయం అని వారు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ తప్ప తమకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరంలేదని వారు తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడతారా? లేదా? అనేది తమ నేత సోనియాకు రాసే లేఖలో పేర్కొననున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామనడం రాజకీయంగా గొప్ప త్యాగంగా ఆయన వర్ణించారు. 

ఓరుగల్లు రామప్ప చరిత్ర


ఓరుగల్లు రామప్పదేవాలయ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామప్ప’. ఇందులో గణపతిదేవుని పాత్రను సుమన్ పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు చక్రి ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు.
కుమార్ మారబోయిన నిర్మాత. రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.
రామప్ప పాత్ర పోషిస్తున్న కాశీనాథ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు.

Wednesday, November 7, 2012

ఇక నుంచి తెలుగు అక్షరాలే కన్పించాలి


రాష్ట్రంలో ఇక ఎక్కడైనా తెలుగు అక్షరాలే కనిపించాలని అలా కన్పించకపోతే జరిమానా తప్పదని అధికార తెలుగు భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. రాజధానిలో ఉన్న లక్షలాది వ్యాపార దుకాణాలపై నామకరణాలు ఇంగ్లీష్‌లో ఉండడం క్షమార్హం కాదని ఆయన అన్నారు. తెలుగు మహాసభలు జరిగే సమయానికి రాష్ట్రంలో ప్రతి చోటా తెలుగు అక్షరాలు కన్పించాలని ఆశిస్తున్నామని అన్నారు. తిరుపతిలో జరగనున్న తెలుగు మహాసభలపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార దుకాణాల నామఫలకాలు తెలుగులో స్పష్టంగా కన్పించే విధంగా ఉండాలని బుద్ధ ప్రసాద్ సూచించారు. 1966లో తెలుగు భాషను చట్టంగా రూపొందిచుకున్నామని అందుచేత తెలుగును భావనా భాషగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రథమ భాషగా తెలుగు, ద్వితీయ భాషగా ఉర్దూ, తృతీయ భాషగా ఇంగ్లీషును వాడాలని ఆయన సూచించారు. శాస్త్ర సాంకేతిక అంశాలను అందిపుచ్చుకున్న నేటి తరంలో తెలుగుకు ఉపకరణాలు తీసుకురావడం జరిగిందన్నారు. వీటికి కీ బోర్డు కూడా తీసుకురావడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెలుగులో పదాలు కంపోజింగ్ చేసే సమయంలో తప్పులు దొర్లినప్పుడు వెంటనే సరైన పదాలు వచ్చే విధంగా నిఘంటువును తయారు చేశామన్నారు. త్వరలో అన్ని శాఖలకు పంపడం జరుగుతుందని ఆయన చెప్పారు. నాగార్జున యూనివర్సిటీలో తెలుగుభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే కడప యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవాల్లో ఉపకులపతి రామచంద్రారెడ్డి తెలుగులో ప్రసంగం చేయడం తొలి విజయంగా ఆయన చెప్పారు. తెలుగు మహాసభలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు మహాసభల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని ఆయ అన్నారు. తెలుగుభాషకు ఔన్నత్యాన్ని చేకూర్చేందుకు అధికార తెలుగు భాషా సంఘం తొలి సమావేశం సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేశామన్నారు.

కేసులు పెట్టాల్సింది పోలీసులపైనే


విద్యుత్ ఉద్యమంలో భాగంగా జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో కేసులు పెట్టాల్సింది తమపై కాదని, ఆ రోజు ముగ్గురు మరణానికి బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించాలని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన సిపిఐ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చేసినట్టు చెబుతున్నారని అలాంటి అవసరం ఆనాడు కమ్యూనిస్టులకు లేదని, దానికి కుట్ర చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. 9 వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా నిరాహారదీక్షలు చేశారని, ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చినపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఇపుడు ఉద్యమకారులే తుపాకీ లాక్కుని కాల్పులు జరిపారనే రీతిలో పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. నిజానికి అసెంబ్లీ వరకూ జరిగిన ర్యాలీలో సిపిఎం నేతలు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
ఆనాడు హోం మంత్రిగా జానారెడ్డి ఉన్నపుడు కేసులు అన్నింటినీ ఉపసంహరించినట్టు చెప్పారని, పోలీసు కాల్పుల్లో మరణించిన ముగ్గురి స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే దానిని ముఖ్యమంత్రే స్వయంగా ఆవిష్కరించిన విషయాన్ని సుధాకర్‌రెడ్డి గుర్తుచేశారు.

Sunday, November 4, 2012

పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలిపివేత


భారీ వర్షాల ప్రభావం రైలుమార్గాలపై తీవ్రంగా పడింది. పలు రైళ్ల రాకపోకలు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. విజయవాడ సమీపంలోని కొండపల్ల్లి- మధిర మధ్య రైల్వేట్రాక్‌పై నీరు నిలవడంతో పలు ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యం కాగా, ప్యాసింజర్ రైళ్లను శనివారం రద్దు చేశారు. గూడూరు-విజయవాడ, కాజీపేట- సికింద్రాబాద్ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12296 పాట్నా - బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, కర్నూలు, డోన్, గుత్తి, ద్రోణాచలం మీదుగా దారి మళ్లించారు.
తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్‌లను తెనాలి- గుంటూరు- నడికుడి- బీబీనగర్ మార్గంలో మళ్లించారు. 57237 కాజీపేట- విజయవాడ , 57238 విజయవాడ-కాజీపేట, 57254 విజయవాడ - భద్రాచలం, 57253 భద్రాచలం- విజయవాడ, 67269 కాజీపేట- దోర్నకల్, 67271 డోర్నకల్- విజయవాడ, 67273 విజయవాడ- గుంటూరు, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా రాజీనామా

'పదహారేళ్లపా టు ఎన్టీఆర్ పెట్టి న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నా.. ఎన్నో అవమానాలు భరించా.. ఆర్థ్ధిక ఇబ్బందులకు గురయ్యా.. నేను పోరాటం చేసేందుకు తగిన వేదిక కూడా దొరకలేదు.. ఎటూ పాలుపోలేక కొన్నిసార్లు నిస్తేజంగా ఉండిపోయాను.. వీటన్నింటితో వేగలేకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తు న్నా..' అని లక్ష్మీపార్వతి ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె శనివా రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను సమర్పిస్తున్నానని, లేఖ ప్రతిని పార్టీ ప్ర ధాన కార్యదర్శికి పంపానని, అలాగే న్యాయవాది సలహా తీసుకుని ర్రాష్ట ఎన్నికల సంఘానికి కూడా పంపనున్న ట్లు ఆమె వెల్లడించారు. 1996లో ఎన్టీఆర్‌కు అన్యాయంచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడున్న టీడీ పీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని, చంద్రబాబు టీడీపీ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌పై నేరుగా పోరాటానికే వైసీపీని స్థాపించారని, తన ఉద్దేశం కూడా అదేనని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానన్నా రు. ఎన్టీఆర్ పార్టీకి రాజీనామా చేయడం ద్వా రా మీరు కూడా ఎన్టీఆర్‌కు నమ్మకద్రో హం చేసినట్టు కాదా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానాన్ని దాటవేశారు.

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడి మృతి పట్ల జూ ఎన్టీఆర్ సంతాపం

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడి మృతి పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ ఎంపీలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, సిఎం రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి పార్టీకే కాక దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, రోషన్‌బేగ్, బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అభిషేక్, తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, కార్యవర్గ సభ్యుడు కే గంగరాజు, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసయ్య, కర్ణాటక తెలుగు సమాఖ్య కార్యదర్శి బెల్లం రమణ చౌదరి తదితరులు ఎర్రన్నాయుడుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే...

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే... మీరు (ప్రజలు) కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసినా పంట చేతికి రావడం లేదు. నిత్యావసర ధరలు పెరిగి మధ తరగతి ప్రజలు నిరుపేదలవుతున్నారు. పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 'వస్తున్నా మీ కోసం పాదయాత్ర' బుధవారం జిల్లాలోని చిన్నచింతకుంట మండలం మద్దూర్, ఏదులాపూర్, వడ్డెమాన్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళా కూలీలు, రైతులు, వడ్రంగులను కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు రావడం లేదని కొందరు.. ఇంటి బిల్లులు ఇవ్వడం లేదని మరికొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆవేదనపై స్పందించిన చంద్రబాబు, జిల్లా పేదరికాన్ని చూసే తాను సీఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నట్లు ప్రకటించానని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

Thursday, November 1, 2012

ఆలయాలలో చోరీలన్నీ మాఫియా పనేనా..!

హైదరాబాద్ సిటీ బంగారం ధర చుక్కలనంటుతుండటంతో దొంగల దృష్టి ఆలయాలపై పడిందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే.. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. దొంగసొత్తును మార్కెట్లో విక్రయిస్తే అందులో సగం మాత్రమే వస్తోందన్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో దొంగిలించిన సొత్తుకు మాత్రం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క పురాతన వస్తువు చేతిలో పడినా దొంగల పంట పండినట్టే. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, పురాతన పంచలోహ విగ్రహాల చోరీ వెనుక పెద్ద కథే దాగి ఉంది. ఈ మాఫియా చీకటి వ్యాపారంపై ప్రత్యేక కథనం.. పురాతన వస్తువులెన్నో..నగరంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆలయాలే అధికంగా ఉన్నాయి. బంగారం, వజ్రకిరీటాలు, ఆభరణాలు, ముక్కుపుడకలు, గాజులు అమ్మవారి విగ్రహాలకు అలంకరిస్తున్నారు. కొందరు భక్తులు వేలు, లక్షల రూపాయలు ఖర్చు బెట్టి ఆభరణాలను తయారు చేయించి కానుకలుగా సమర్పిస్తున్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో కమిటీ సభ్యులు కూడా అమ్మవారికి బంగారు వస్తువులు చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, క్రీస్తు పూర్వం, నిజాం నవాబుల కాలంలో వెలసిన గుళ్లలో ఎన్నో రకాల పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. పూజలకు వినియోగించే పంచలోహ పాత్రలూ ఉన్నాయి. వీటిలో అమ్మవారు, గణేశ్, రామలక్ష్మణులు, నటరాజు వంటి విగ్రహాలతో పాటు అరుదుగా కనిపించే శంఖాలు కూడా ఉంటున్నాయి. విలువ లక్షలు, కోట్లేనటఅమ్మవార్లు ధరించిన ఆభరణాలు, పురాతన విగ్రహాలతో సహా ఆలయాల్లోని ఇతర ఏ వస్తువుకైనా అతీతశక్తులు ఉంటాయని భక్తులు భావిస్తుంటారు. కానుకలుగా సమర్పించిన కొత్త వస్తువులైనా.. కొద్దిరోజులు పూజలందుకుంటే చాలు వాటికీ మహిమలు ఉంటాయని నమ్ముతుంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటికి గిరాకీ బాగా ఉంటోంది. శక్తులు ఉన్నాయన్న నమ్మకంతో వాటి విలువ లక్షలు, కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పురాతన విగ్రహాలంటూ విక్రయిస్తున్న 12 ముఠాలను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టార్గెట్ అందుకేనా.. నగరం, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలోని పురాతన ఆలయాలపై దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ ఆలయాలలోని సొత్తును కొల్లగొడుతున్నాయి. జంట కమిషనరేట్లలోని చిన్నా,చితకా అన్నీ కలిపి ఈ ఏడాది అక్టోబర్ వరకు 27 ఆలయాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెలలో జరిగిన దొంగతనాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయమే. గోల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాలలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్వాన్‌లోని ఓ ఆలయంలో పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా నేరాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలు ఈ సొత్తునంతా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్నో మాఫియా ముఠాలుదేశంలో ఎన్నో మాఫియా ముఠాలు చీకటి వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో కరుడుగట్టిన నేరస్తులు, దొంగలతో పాటు కొందరు వ్యాపారులు కూడా ఉంటున్నారని సమాచారం. ఇతర రాష్ట్రాలతో పాటు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఉన్న చాలామంది ఇదే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ఇలాంటి వారు నలురైదుగురు కలిస్తే చాలు.. ప్రధానంగా ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. అమ్మవారి అభరణాలు, పురాతన విగ్రహాలే కాకుండా నాణేలు, రెండు తలల పాములను కూడా విక్రయిస్తున్నారు. అంతెందుకు ఇటీవలికాలంలో అయిదు రూపాయల నోటుకు 50 రూపాయలు ఇచ్చి ఈ మాఫియా హల్‌చల్ చేసింది. సాధారణంగా పొలాలలో దొరికే రెండు తలల పాము, నక్షత్ర తాబేళ్లు, రంగురాళ్ల ధరను లక్షలు, కోట్లు పలికేలా చేశారు. మార్కెట్లో అమ్మవారి ఆభరణాలకు ఉన్న డిమాండ్‌తో లబ్దిపొందేందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసినా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దర్యాప్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మళ్లీ నరేంద్ర మోడిదే హవా!: పెరిగిన ముస్లింల మద్దతు !

వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలలు గుజరాత్ ఎన్నికలలో మళ్లీ భారతీయ జనతా పార్టీయే ఘన విజయం సాధించనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు మరెంతో దూరం లేనందున సర్వే సంస్థలు గుజరాత్ ప్రజలు ఎవరి ఓటు వేస్తారో తెలుసుకునేందుకు పలు దఫాలుగా సర్వేలు చేస్తున్నాయి. ప్రారంభంలో బొటాబొటి మెజార్టీతో బిజెపియే మళ్లీ గుజరాత్‌ను దక్కించుకుంటుందని చెప్పిన సర్వేలు తాజాగా అద్భుత విజయం సాధిస్తాయని చెబుతున్నాయి. కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనే పదం ఒక్కటే బిజెపి ఘన విజయానికి తోడ్పడుతుందని చెబుతున్నాయి. బిజెపిని పార్టీగా కంటే మోడిని వ్యక్తిగా గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కువగా ఆదరిస్తున్నారట. మోడికే ఓటు వేసేందుకు మెజార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారట. ఆయన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరు, అభివృద్ధి, ఉద్యోగాలు తదితరాల కారణంగా ఆయనకే మళ్లీ పట్టం కడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారట. 2007 కంటే ఇప్పుడు బిజెపికి ఓటింగ్ శాతం రెండు వరకు పెరగవచ్చునని, ఈ ఓటింగ్ శాతమే బిజెపి గతంలో కంటే ఎక్కువ స్థానాలలో గెలుపొందేందుకు అవకాశముందని చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు మద్దతు కూడా మోడీకి క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 2007లో 14 శాతం మంది ముస్లింలు మోడీకి మద్దతు పలకగా ఇప్పుడు అది 23 శాతానికి పెరిగింది. అయితే మోడీకి కేశూభాయ్ పటేల్ షాకిచ్చే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉన్నప్పటికి కేశూభాయ్ కారణంగా బిజెపి ఓట్లు కొద్దిగా చీలి నష్టపరుస్తుందని చెబుతున్నారు. మరో విషయమేమంటే గుజరాత్ ఎన్నికలే 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా లేదా అని తేల్చనున్నాయి.

'దేనికైనారెడీ' సినిమాపై బ్రాహ్మణుల ఆందోళన

'దేనికైనారెడీ' సినిమాపై జరుగుతున్న వివాదం చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. సినిమాల్లో తమ వర్గాన్ని హేళనచేసే దృశ్యాల గురించి ఇంతవరకూ పట్టించుకోని బ్రాహ్మణులు ఇకపై వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తమ వర్గం వారిని సమీకరించుకుంటున్నట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా మొదటి టార్గెట్ ఇది. గతంలో 'అదుర్స్' సిన్మాలో బ్రాహ్మణుల్ని కించపరిచినంతగా ఇందులో 5 శాతం కూడా లేదని కొందరు మిత్రులు చెప్పారు. వాస్తవానికి సినిమాల్లో బ్రాహ్మణుల్ని హేళనచేయడం సాధారణమై పోయింది. ఒక కమ్యూనిటీని ఎగతాళి చేయకుండా సిన్మాలు తీయడం మనోళ్ళకి చేతకాదా అని నా అనుమానం.  నా చిన్నపుడు అనేకసార్లు చూసిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేసే కామెడీ చాలా నచ్చేది. కానీ ఇప్పుడు గనక చూస్తే వైశ్య కమ్యూనిటీని కించపరిచేవిధంగా వుందనిపిస్తుంది. సినిమాను సినిమాగానే చూడాలని కొందరంటున్నారు... కానీ సినిమా కూడా ఒక మీడియానే...అది కూడా ప్రజలముందే ప్రదర్శితమవుతోంది కదా? బ్రాహ్మణ సంఘాలు నిరసనలకు దిగడం మంచి పరిణామమే.ఇలా వర్గాలుగా విడిపోకుండా అందరూ సంఘటితమై పోరాడితేనే ఏదైనా సాధించగలరు. ఏదిఏమైనా ఒక కమ్యూనిటీని కించపరిచేవిధంగా ఎవరు ప్రవర్తించినా కులమతాల కతీతంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని నా కోరిక... If I am not wrong.

Wednesday, October 31, 2012

తమిళనాడును వణికిస్తున్న నీలం తుపాను

నీలం తుపాను తమిళనాడును వణికిస్తోంది. నీలం మరింత బలపడి పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నైకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు, కడలూరు మధ్య చెన్నైసమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటింది, తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి, అలలు రెండు మీటర్లకు పైగా ఎగిసిపడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత తీరం వెంబడివున్న లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్‌ చేసింది. కాగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మహాబలిపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ, సైన్యం సిద్దంగా ఉంది. 

Tuesday, October 30, 2012

500 కిలోమీటర్ల దాటిన చంద్రబాబు పాదయాత్ర

వస్తున్నా... మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 28వ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరులో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని ఆయన విమర్శించారు. ఇది పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్ర మంగళవారం 500 కిలోమీటర్ల మైలురాయి దాటింది.

తుపాన్‌గా మారిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుపాన్‌గా మారింది. దీనిని 'నీలం'గా చెన్నై వాతావరణ కేంద్రం ఖారారు చేసింది. తుపాన్ చెన్నైయ్‌కు ఆగ్నేయంగా500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సముద్రంలో అలల ఉధృతి పెరింగింది. గంటకు సుమారు 45 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో తమిళనాడులో, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు - నాగపట్నం మధ్య బుధవారం రాత్రి లోగా తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్‌ నవంబరు 2 నాటికి అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వచ్చే 48 గంటలు సముద్రం కల్లోలంగా ఉంటుందని, మరోవైపు చెన్నై పోర్టులో అధికారులు ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నాగపట్నం, తూతుకూడి, కారేకల్ పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీగా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత తీరం దిశగా వచ్చేసరికి గాలుల తీవ్రత పెరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తీరప్రాంత జిల్లాల్లో అలజడి మొదలైంది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో ఇప్పటికే మూడో నెంబరు ప్రమాదహెచ్చరిక ఎగరేయగా, తమిళనాడులోని పలు తీర ప్రాంతాల్లో నాలుగోనెంబరు హెచ్చరిక ఎగరేశారు. తుఫానుగా మారే వాయుగుండం నెల్లూరు- నాగపట్నం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫానుషెల్టర్ కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు వీస్తున్నాయి.

నవంబర్ 1ని బహిష్కరించండి

నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి, విద్రోహదినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకటో తేదీన తెలంగాణ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులను సూచించారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో నిరసన తెలపాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

Saturday, October 27, 2012

చంద్రబాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

 గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

మహిళలతో షర్మిల రచ్చబండ

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Saturday, October 13, 2012

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె

 విద్యుత్ కోతలతో పెట్రోలు బంకుల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ రాజీవ్ అమరం పేర్కొన్నారు. చమురు కంపెనీలు కమీషన్ పెంచేందుకు ముందుకు రాకపోవడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు శనివారం విలేకరులకు తెలిపారు. సమ్మె రోజుల్లో ఒక్క షిఫ్ట్‌లో మాత్రమే పెట్రోలు బంకుల్లో విక్రయాలుంటాయని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అవుట్‌లెట్‌లు పనిచేస్తాయని తెలిపారు. హైవేలోని అవుట్‌లెట్లలో రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకే అమ్మకాలు ఉంటాయన్నారు.

రాయలసీమ ప్రజలారా మేల్కొనండి...బైరెడ్డి


పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు కలిసి రాయలసీమ హ క్కుల కోసం పోరాటం చేసి ప్రత్యేక సీమ సాధిద్దామని ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలుజిల్లా నుంచి కడప జిల్లాలో బైరెడ్డి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామ సరిహద్దులో మహిళా కూలీలు బైరెడ్డిని కలిసి జై రాయలసీమ అంటూ నినాదాలు చేస్తూ పూలమాల వేసి స్వాగతించారు. గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ అని, ఐక్యత ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రాయలసీమ ఎన్నో సహజ వనరులకు నిలయమైన ప్రాంతం అన్నారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒడంబడిక నీరుగారిపోయిందన్నారు. కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టులను పోగొట్టుకున్నామన్నారు. పాదయాత్ర అనంతరం నవంబరు 10వ తేదీ అనంతపురంలో జరిగే బహిరంగసభలో రాయలసీమ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఆనందంగా ఉంది...మహేశ్‌బాబు

ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉందని హీరో మహేశ్‌బాబు పేర్కొన్నారు. 14 రీల్స్‌ టీమ్‌ మొత్తానికి, దర్శకుడు శ్రీను వైట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2011 సంవత్సరానికిగానూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మహేశ్‌బాబు ఎంపికయ్యారు. దూకుడు చిత్రానికిగానూ ఆయనకీ అవార్డు దక్కింది. 14 రీల్స్‌ పతాకంపై నిర్మించిన దూకుడు సినిమాను శ్రీను వైట్ల తెరకెక్కించారు.

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం


2011 సంవత్సరానికి గాను తెలుగు సినిమా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం, రెండో ఉత్తమ చిత్రంగా రాజన్న, మూడో ఉత్తమ చిత్రంగా విరోధి ఎంపిక అయ్యాయి. ఉత్తమ నటుడుగా మహేష్‌బాబు, ఉత్తమ నటిగా నయన తార, ఉత్తమ దర్శకుడుగా శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రం : శ్రీరామరాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న
ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : 100 పర్‌సెంట్ లవ్
ఉత్తమ సమగ్రత చిత్రం : జై భోలో తెలంగాణ
ఉత్తమ పాపులర్ చిత్రం : దూకుడు
ఉత్తమ తొలి బాలల చిత్రం : శిఖరం
ఉత్తమ ద్వితీయ బాలల చిత్రం : గంటల బడి
ఉత్తమ తొలిడాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం : మన బాధ్యత
ఉత్తమ నటుడు : మహేష్‌బాబు (దూకుడు)
ఉత్తమ నటి : నయనతార (శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు : శంకర్ (జైబోలో తెలంగాణ)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాశ్ రాజ్(దూకుడు)
ఉత్తమ సహాయ నటి : సుజాతారెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ (రాజన్న)
ఉత్తమ హాస్యనటుడు : ఎమ్.ఎస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ హాస్య నటి : రత్నసాగర్ (కారాలు-మిర్యాలు)
ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ బాల నటుడు : మాస్టర్ నిఖిల్ (100 పర్సెంట్ లవ్)
ఉత్తమ బాల నటి : బేబీ ఆన్వీ (రాజన్న)
ఉత్తమ స్కీన్‌ప్లే రచయిత : శ్రీనూవైట్ల (దూకుడు)
ఉత్తమ డైలాగ్ రైటర్ : నీలకంఠ (విరోధి)
ఉత్తమ లిరిక్ రైటర్ : మథుపల్లి సురేంధర్ ( రాతి బొమ్మలోన కొలువైన శివుడు - పోరు తెలంగాణ)
ఉత్తమ సినిమాటోగ్రఫి : పీఆర్‌కే రాజు (శ్రీరామరాజ్యం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజ (శ్రీరామరాజ్యం)
ఉత్తమ ప్లేబాక్ గాయకుడు : గద్దర్ (పొడుస్తున్న పొద్దుమీద - జై బోలో తెలంగాణ)
ఉత్తమ ప్లేబాక్ గాయని : మాళవిక ( అమ్మా అవని - రాజన్న)
ఉత్తమ ఎడిటర్ : ఎంఆర్ వర్మ ( దూకుడు )
ఉత్తమ ఆర్ట్ డిజైనర్ : రవీందర్
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శ్రీను (జగదానందతారక - శ్రీరామరాజ్యం)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ - దేవి కృష్ (బద్రీనాథ్)
ఉత్తమ కాస్టూమ్ డైరెక్టర్ - నిఖిల్ దాన్, భాషా (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - రాంబాబు ( శ్రీరామరాజ్యం)
ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - ఆర్‌సీఎమ్ రాజు ( పోరు తెలంగాణ)
ఉత్తమ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ - సునీత ( శ్రీరామరాజ్యం)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ మేల్ - నాగార్జున (రాజన్న)
స్పెషల్ జ్యూరీ అవార్ట్ ఫీమేల్ -చార్మి ( మంధర)
స్పెషల్ జూరీ అవార్ట్ - రమేష్ (ఋషి)

Friday, October 12, 2012

ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉంది...అనిల్ కుంబ్లే

 ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సరికొత్త సవాల్‌ను తాను సమర్థవంతంగా నిభాయించగలనన్న నమ్మకం ఉందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన క్లైవ్ లాయిడ్ బాటలోనే ముందుకు సాగుతానన్నారు. క్రికెట్‌లో మరింతగా పాదర్శకతను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు సంత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్న కుంబ్లే ఐసీసీ ఈ ఏడాది నిర్వహించే రెండో సభకు వచ్చే నెల హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుంబ్లేను ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌తో పాటు పలువురు అభినందించారు.

ఏపీ విభజన సాధ్యం కాదు...గులాం నబీ ఆజాద్‌

 తెలంగాణ అంశాన్ని తేల్చడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీలను విభజించినట్లుగా ఏపీ విభజన సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ అంశంపై రెండేళ్లుగా వివిధస్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆజాద్ తెలిపారు. కేసీఆర్‌తోనూ సంప్రదింపులు జరిపామని ఆజాద్‌ ధృవీకరించారు. అయితే తెలంగాణపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందని.. ఆ తర్వాతే కేంద్ర ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆజాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆజాద్ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

Thursday, October 11, 2012

ఏ హొదాతో పాదయాత్రకు వెళతారు: శోభ


దోచుకోవడానికి రాష్ట్రంలో ఇంకా ఏమి మిగిలందని షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళధ్యక్షురాలు శోభాహైమవతి ప్రశ్నించారు.2003 లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు,భూములు,సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే వాటిని దోచేశారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు కలిసి రూ.లక్ష కోట్లు ప్రజా సొత్తును భోన్చేశారన్నారు.షర్మిల ఏ హొదాతో పాదయాత్ర చేపడతారని,ఏ హొదాలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. పిల్ల కాంగ్రెస్ లో షర్మిల పదవి ఏంటని ప్రశ్నించారు.

జగన్ లైఫ్‌పై సినిమా

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందట. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 1990లలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రాన్ని రీమేక్ చేయాలని విష్ణు భావిస్తున్నారు. చిత్రాన్ని రీమేక్ చేస్తున్నప్పటికీ వైయస్ జగన్ ఆధారంగా చిత్రం ఉండేలా చూస్తున్నారట. జగన్ తన అరెస్టుకు ముందు మోహన్ బాబు ఇంటికి భార్య భారతితో సహా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఆయన మద్దతును జగన్ కోరారు. అయితే జగన్ ఇంటికి రావడంలో రాజకీయ ప్రాధాన్యత లేదని, తన తనయుడికి కవలలు పుట్టినందువల్లే చూసేందుకు వచ్చారని మోహన్ బాబు చెప్పారు. కానీ రాజకీయ ప్రాధాన్యత ఆ భేటీలో ఉందనేది పలువురి వాదన. ఆ తర్వాత జైలులో కూడా ఓసారి తనయుడితో వెళ్లి కలిశారు.