http://apvarthalu.com/

Friday, November 23, 2012

‘డమరుకం’ను తెలంగాణాలో అడ్డుకుంటాం

ఢమరుకం చిత్రం పేరుకు సంబంధించిన సర్వహక్కులు తమవేనంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ ఢమరుకం పేరును ముందు తమకు కేటాయించి అనంతరం ఢమరుకం చిత్ర నిర్మాత శ్రీధర్‌డ్డికి కేటాయించడం అన్యాయమన్నారు. తెలంగాణకు చెందిన నిర్మాతలు, దర్శకులు రూపొందిస్తున్న చిత్రాల ఫలితాలు సీమాంధ్ర దర్శక, నిర్మాతలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు కళ్యాణ్‌తోపాటు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.డమరుకం సినిమా టైటిల్‌ తనదని దర్శక, నిర్మాత నవీన్‌ కల్యాణ్‌ హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాము టైటిల్ 2008లో రిజిష్టర్ చేయించాననీ, 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల సినిమా పూర్తి అవడం ఆలస్యం అయిందని నవీన్ కళ్యాన్ వివరించారు.తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని ఆవేదన వ్యక్తం చేసారు.

No comments: