http://apvarthalu.com/

Wednesday, November 7, 2012

కేసులు పెట్టాల్సింది పోలీసులపైనే


విద్యుత్ ఉద్యమంలో భాగంగా జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో కేసులు పెట్టాల్సింది తమపై కాదని, ఆ రోజు ముగ్గురు మరణానికి బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించాలని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన సిపిఐ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర చేసినట్టు చెబుతున్నారని అలాంటి అవసరం ఆనాడు కమ్యూనిస్టులకు లేదని, దానికి కుట్ర చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. 9 వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా నిరాహారదీక్షలు చేశారని, ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చినపుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఇపుడు ఉద్యమకారులే తుపాకీ లాక్కుని కాల్పులు జరిపారనే రీతిలో పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. నిజానికి అసెంబ్లీ వరకూ జరిగిన ర్యాలీలో సిపిఎం నేతలు ఇతరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
ఆనాడు హోం మంత్రిగా జానారెడ్డి ఉన్నపుడు కేసులు అన్నింటినీ ఉపసంహరించినట్టు చెప్పారని, పోలీసు కాల్పుల్లో మరణించిన ముగ్గురి స్మారక చిహ్నాన్ని నిర్మిస్తే దానిని ముఖ్యమంత్రే స్వయంగా ఆవిష్కరించిన విషయాన్ని సుధాకర్‌రెడ్డి గుర్తుచేశారు.

No comments: