http://apvarthalu.com/

Friday, November 2, 2012

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే...

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే... మీరు (ప్రజలు) కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసినా పంట చేతికి రావడం లేదు. నిత్యావసర ధరలు పెరిగి మధ తరగతి ప్రజలు నిరుపేదలవుతున్నారు. పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 'వస్తున్నా మీ కోసం పాదయాత్ర' బుధవారం జిల్లాలోని చిన్నచింతకుంట మండలం మద్దూర్, ఏదులాపూర్, వడ్డెమాన్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళా కూలీలు, రైతులు, వడ్రంగులను కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు రావడం లేదని కొందరు.. ఇంటి బిల్లులు ఇవ్వడం లేదని మరికొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆవేదనపై స్పందించిన చంద్రబాబు, జిల్లా పేదరికాన్ని చూసే తాను సీఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నట్లు ప్రకటించానని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

No comments: