http://apvarthalu.com/

Thursday, January 31, 2013

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం...టి.కాంగ్రెస్ ఎంపీలు

 తెలంగాణకు మద్దతుగా టి.కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాంగ్రెస్ మాజీ ఎంపీ కే.కేశవరావు నివాసంలో టి.కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నామా లేఖలను ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చామని కేకే తెలిపారు. ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను కేకే ఖండించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. రాజీనామాలపై ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. చాకో ప్రకటన సంతోషకరమే కానీ రాజీనామాలను ఎంపీలు ఉపసంహరించుకోరని ఆయన తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని కేకే తెలిపారు. తమ వెనుక కేవీపీ ఉన్నారనడం పిచ్చిమాటలే అని కేకే కొట్టిపారేశారు.
గతంలో స్పీకర్‌కు రాజీనామాలు అందజేస్తే తిరస్కరించినందువల్లే సోనియాకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజీనామాలపై మధుయాష్కి తమతో విభేదించారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. రాజీనామాలు ఆమోదింకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

సమంత ఫొటోస్








Sunday, January 27, 2013

తెలంగాణకు రంగం సిద్దం..నేడో రేపో ప్రకటన ?


- ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన
- ఐదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ రాత్రికో..మరు నాడో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించనుందని విశ్వసనీయ సమాచారం. సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటించగానే ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించగానే ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పాలన కోరతారని తెలుస్తోంది.red more

Friday, January 25, 2013

కాలు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు

chandhrababu-apvarthalu-comటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో శుక్రవారం నాటికి 116వరోజుకు చేరుకుంది. కాగా కృష్ణా జిల్లాలో ఐదో రోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నందిగామ శివారులోని అంబారిపేట నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి యాత్రను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. కాలు నొప్పి బాగానే ఉందని, నడుము నొప్పికూడా వస్తుందని, అయినా యాత్ర కొనసాగించాలని ఉందని అన్నారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా పాదయాత్ర చేస్తున్నారు. బాబు యాత్రకు మహిళలు, నేతలు, కార్యకర్తలు, చిన్నారులు స్వాగతం పలుకుతున్నారు. కాలి నొప్పితో బాధపడుతూనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన ఎడమకాలు చిటికెన వేలుకి వాపు వచ్చింది. అయినా కుంటుతునే నెమ్మదిగా పాదయాత్ర చేస్తున్నారు. బాబును కలిసిన టీడీపీ నేతలు జనవరి 26తో యాత్రను ముగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర ముగించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన బాబు యాత్ర ముగించేది లేదని స్పష్టం చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.

దీక్ష సెత్ ఫోటోలు








పద్మ అవార్డులు ప్రకటన

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు దేశంలోనే అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించారు. డి రామానాయుడు – పద్మ భూషణ్, ఎస్ జానకి – పద్మ భూషణ్, మెరీకామ్ – పద్మ భూషణ్ , డా. రాధిక – పద్మశ్రీ, సురభి బాబ్జి – పద్మశ్రీ, ఎం రామకృష్ణంరాజు – పద్మశ్రీ, జి అంజయ్య – పద్మశ్రీ, జయరామన్ గౌరిశంకర్ – పద్మశ్రీ, డా. చిట్టా వెంకటసుందరం – పద్మశ్రీ, శ్రీదేవి – పద్మశ్రీ, బాపు – పద్మశ్రీ, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ, షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి.red more

Thursday, January 24, 2013

శ్రియ హాట్ ఫొటోస్





మమత మోహన్ దాస్ ,కాజల్ హాట్ ఫొటోస్












తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు:బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎక్కువగా నష్టపోయిన వాళ్లం రాయలసీమ వాళ్లం’ అని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసలు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే మీకేమి నొప్పి’ అని ఆయన ఆంధ్రా పెట్టుబడిదారులను ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇవాళ కాకుంటే రేపొస్తది. రెండో గంటకు కాకపోతే మూడో గంటకు వస్తది’ అని అన్నారు. సమైక్య వాదం అన్నవాళ్లు మైదానం పెద్దగా ఉంటే మేపు ఎక్కువగా దొరుకుతదని కోరుకునే వాళ్లే. మాకంటే చిన్న రాష్ట్రం హర్యానా అభివృద్ధి చెందలేదా’ అని నిలదీశారు.

త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాని

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల, కార్యకర్తల ఆకాంక్షలు, వారి కోరిక మేరకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానినైన తాను ఆయన కుటుంబంపై జరుగుతున్న వేధింపులకు కలత చెందానని అన్నారు. గురువారం నాని చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను తెలిపారు. జగన్‌తో ములాఖత్ అనంతరం జైలు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి జగన్‌ను జైల్లో పెట్టడం బాధాకరమని, తమపై జరుగుతున్న వేధింపులను చాటి చెప్పడానికి ఏనాడూ బయటకు రాని వైఎస్ సతీమణి, ఆయన కుమార్తె రోడ్లెక్కడం తనకు ఆవేదన కలిగించిందని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా జగన్ వైపు నిలబడక పోవడం ఏ మాత్రం ధర్మం కాదని నియోజకవర్గ ప్రజలు తనకు చెప్పారని దాని దరిమిలా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

రాహుల్‌తో సీమాంధ్ర నేతల భేటీ వాయిదా

ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీమాంధ్ర నేతల భేటీ గురువారం సాయంత్రం వాయిదా పడింది. సమైక్యవాదాన్ని వినిపించడానికి కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్న సీమాంధ్ర నాయకులు గురువారం సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే రాహుల్ గురువారంనాడు సోనియాతో కలిసి పార్టీ సీనియర్ నాయకులతో తెలంగాణ అంశంపై చర్చలలో పాల్గొనవలసి ఉండడంతో ఈ భేటీ వాయిదా పడింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని సీమాంధ్ర నేతలు కీలకంగా భావించారు. దీంతో రాహుల్‌తో సమావేశానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పుడే బాధ్యతలు స్వీకరించడంతో చాలా విషయాలపై దృష్టి పెట్టవలసి ఉండడంతో రాహుల్ వారికి ఇంకా అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. కాగా, సీనియర్ నేతలపై తెలంగాణపై సోనియా గాంధీ గురువారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ పాల్గొన్నారు.

Wednesday, January 23, 2013

ఆజాద్ అమ్ముడుపోయారు:ఓయూ జేఏసీ

సీమాంధ్ర పెట్టుబడిదారులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ అమ్ముడుపోయారని ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ నెల 27లోపు తెలంగాణను ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ మంత్రుల జిల్లాల్లో నో ఎంట్రీ బోర్డులు పెడుతామని తెలిపారు. ఆజాద్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఖరి బయటపడిందన్నారు.

లక్ష్మీ ప్రసన్న హాట్ ఫోటోస్








ధోని ఫ్యామిలీ ఫోటోస్









తెలంగాణపై మరికొంత సమయం కావాలి: ఆజాద్

తెలంగాణ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్ లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం జరుగుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తాను చెప్పలేనని అన్నారు. నెల రోజులంటే 30 రోజులు కాదని, కొంత సమయం పడుతుందన్నారు. సున్నితమైన, తీవ్రమైన సమస్య.. మరికొన్ని సంప్రదింపులు జరపాల్సి ఉందని తెలిపారు.red more

Tuesday, January 22, 2013

ఢిల్లీలో సీమాంధ్ర-తెలంగాణ నేతల పోటాపోటీ భేటీ

దేశ రాజధాని ఢిల్లీ విభజన రాజకీయాలతో వేడెక్కింది. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా అధిష్టానం పెద్దలను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారు.మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఎంపీ కేవీపీ, మంత్రులు శైలజానాథ్, టీజీ వెంకటేష్, ఏరాసు, కాసు, గాదె, ఏపీ ఎన్జీవో నేతలు భేటీ అయిన వారిలో ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రధానికి నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో నేతలు భేటీ అయి తమ వాదనను వినిపించారు.ఇదే సమయంలో అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయి తెలంగాణ వాదాన్ని వినిపించారు. మరికొందరు అధిష్టానం పెద్దలను ఇరు ప్రాంతాల నేతలు కలవనున్నారు.

వేడెక్కిన 'తెలంగాణ'

తెలంగాణ అంశం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తున్నారని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ లోపల తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రాంతీయ విద్వేషాలతో పరిస్థితి ఉద్రికత్తతకు దారితీసే ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు ఖరారైనట్లేనని, ఇక ఇతర అంశాలే మాట్లాడవలసి ఉందని కొందరు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ - నదీ జలాల పంపిణీ - హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత - ఆంధ్రలో రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక పాకేజీ ....... అని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమస్యేలేదు - రాష్ట్రం విభజిస్తే రాజీనామా హెచ్చరికలు - తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ - హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం..... ఇలా విభిన్న కథనాలు వినవస్తున్నాయి. దీనికి తోడు ఢిల్లీలో ఏదో జరిగిపోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ వచ్చేస్తుందని ఆ ప్రాంత నేతలు గతంలో ఎన్నడూలేనంత గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసే ప్రయత్నాలన్నీ తమకు అనుకూలంగా జరుగుతున్నట్లు వారు భావిస్తున్నారు. ఇంకేముంది తెలంగాణ ఇచ్చేస్తున్నారని, దానిని ఎలాగైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లారు. వారికి పోటీగా తెలంగాణ నేతలు కూడా మరోమారు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక రాజీనామా హెచ్చరికలు సరేసరి. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రాష్ట్రం విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేశారు.red more

అనుష్క ఫోటోలు