http://apvarthalu.com/

Sunday, November 25, 2012

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోం:కిరణ్ కుమార్ రెడ్డి

 వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పిల్ల్రలకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.red more

No comments: