http://apvarthalu.com/

Saturday, December 1, 2012

జగన్‌ గెలిచినా కష్టాలు: జెసి దివాకర్ రెడ్డి


 కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలతో శనివారం అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో వారిని మీడియా చూసి జెసి కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు చేరిందా? లేక వైయస్సార్ కాంగ్రెసులో జెసి కాంగ్రెసు చేరిందా? అని ప్రశ్నించారు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు జెసి పేరులోనే జగన్ కాంగ్రెసు ఉందని చెప్పారు.
ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.

No comments: