http://apvarthalu.com/

Saturday, September 1, 2012

బంగారం ధర రోజురోజుకు సరికొత్త రికార్డు

బంగారం రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దూసుకుపోవటంతో పాటు దేశీయంగా స్టాకిస్టులు భారీగా కొనుగోళ్లకు దిగటంతో శనివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు 550 రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31,725 రూపాయలను తాకాయి. ఢిల్లీ బాటలోనే ముంబైలో కూడా 10 గ్రాముల బంగారం ధరలు 520 రూపాయలు పెరిగి 31,400 రూపాయలకు చేరుకోగా కోల్‌కతా, చెన్నైల్లో 540 రూపాయలు వృద్ధి చెంది వరుసగా 31,715 రూపాయలు, 31,575 రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా సాగింది. ఢిల్లీలో కిలో వెండి 2,250 రూపాయలు పెరిగి 59,500 రూపాయల వద్ద స్థిరపడగా ముంబైలో 2,000 రూపాయలు వృద్ధి చెంది 59,200 రూపాయల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగటంతో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయని ట్రేడర్లు తెలిపారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ ఆర్ధిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలకు చేరుకోగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు స్పెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలపటం ధరలు పెరగటానికి దోహదపడింది.

No comments: