http://apvarthalu.com/

Labels

Showing posts with label వార్తలు. Show all posts
Showing posts with label వార్తలు. Show all posts

Monday, August 19, 2013

T-NEWS ఆటవిక న్యాయం!

టి-న్యూస్…నెం.1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. సరే ఇది వారు పెట్టుకున్న ట్యాగ్, దీంతో ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు. అయితే, టి-న్యూస్ ఇటీవల తన హద్దులు దాటేసింది. ఈ విషయం తెలుసుకునే ముందు తెలంగాణ ఉద్యమం-మీడియా పాత్ర గురించి మాట్లాడుకోవాలి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు అంతర్గత కారణాలు ఏమైనా బహిర్గత కారణం మాత్రం ఒకటే…తెలంగాణ సాధన. దాని బలం, బలహీనత దాని అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన టీఆర్ఎస్ స్థాపించారు. ఆయన అదృష్టం ఏమో గాని ఆయన పార్టీతో పాటే ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ ఛానళ్ల హవా కూడా మొదలైంది. మంచి వక్త కావడం, మాటలతో గారడీ చేయడంతో ఏం మాట్లాడితే సెన్సేషన్ అవుతుందో గుర్తించిన కేసీఆర్ అదే మాట్లాడసాగాడు. అప్పటికింకా టి-న్యూస్ లేదు. ప్రధాన ఛానళ్లు కూడా కొన్నే. ఆ తర్వాత వెంటవెంటనే అన్నీ పుట్టుకువచ్చాయి. ఛానళ్లు ఎన్ని వచ్చినా కేసీఆర్ లాంటి వక్త వాటికి దొరకలేదు. అప్పడపుడే పుట్టుకువస్తున్న ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానళ్లు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు ప్రవర్తించాయి. ఎక్కడేం కనిపించినా పదేపదే చూపించడం.read more

Saturday, August 17, 2013

పని చేస్తేనే జీతం!

ఆంధ్ర ప్రదేశ్ విభజనఫై కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం జీవో 177ని ప్రయోగించింది. దీని ప్రకారం నో వర్క్‌ నో పే అమల్లోకి వస్తుందని తెలిపింది. read more

కేసీఆర్ కు కోటి ఆఫర్ !

ప్రత్యేక తెలంగాణ గురించి మాట్లాడకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేసీఆర్ సహకరిస్తే రూ.కోటి రూపాయలు ఇస్తానని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు, యువజన కాంగ్రెస్ నాయకులు టీజీ భరత్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన రూ.కోటి చెక్కును రాసి చూయించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు కూర్చున్న ఆర్యవైశ్య ప్రతినిధులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.read more

దమ్మున్న ఛానల్…దమ్ములేని పేపర్!

ధమ్మున్న ఛానల్… సౌండు పెంచి మరీ చెబుతాడు రాధాకృష్ణ. ఆయన్ను చూస్తే జర్నలస్టు అంటే ఇలా ఉండాలని కొందరు అనుకుంటూ ఉంటారు పాపం. కానీ, ఆయన రాజకీయ నాయకులకు ఏం తీసిపోరు. ఆయన మరో కేసీఆర్. సీడబ్ల్యూసీ ప్రకటన రాకముందే ముందే కూసిన తెలంగాణ కోయిల అది. మొదటి మూడో రోజులు నిరసన జరిగే వరకు జై తెలంగాణ అంటూ… సీమాంధ్ర నాయకులను పిలిచి చెప్పండి మీరు ఏ రాజధాని కోరుకుంటారు…read more

Thursday, August 15, 2013

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ: శ్రీహరి

2014 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేయనున్నానని రియల్ స్టార్ శ్రీహరీ గురువారం నాడు ఈ విషయం చెప్పారు. red more

జగన్… త్వరలో విడుదల!

ఈ వాక్యం చాలు… వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు, సమైక్యాంధ్ర కోరుకుంటున్న వారిలో ఉత్తేజం రావడానికి. జగన్ కు బెయిలు అనే మాట నాన్నా పులి అన్న కథలా అయిపోయింది. ప్రతిసారి ఆయనకు బెయిలు వస్తుందని ఆయన పార్టీ వర్గాలు ఆశించడం, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూడటం… ఆ తర్వాత రిమాండ్ పొడిగించడం రివాజుగా మారింది. ఇటీవల కూడా జగన్ కు ఆగస్టు 26 దాకా రిమాండ్ పొడిగించారు. అయితే, ఇక జగన్ విడుదల ఎంతో దూరంలో లేదని వార్తలు వస్తున్నాయి. దీనికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు.red more

Sunday, August 11, 2013

నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగించారు. ఆయన ప్రసంగం తెలుగువారిని ఆకట్టుకుంది. సోదర, సోదరీమణులారా నమస్కారం. భారత దేశ ప్రగతికి తెలుగు వారు చేసిన కృషి ప్రశంసనీయం. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల నుండి మీరు బయట పడాలని కోరుతున్నాను. తెలుగువారు ఇంకా బలపడాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్ధిస్తున్నాను. కాంగ్రెస్ కు, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానను అని మోడీ చెప్పడం అందరినీ ఆకర్షించింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘నవభారత యువభేరీ’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.red more

నరేంద్రమోడీని కలిసిన తెలుగు సినీ ప్రముఖులు!

హైదరబాద్‌లో నిర్వహిస్తున్న నవభారత యువభేరీలో పాల్గొనేందుకు రాజధానికి వచ్చిన బీజేపీ సీనియర్ నేత,గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు వివిధ రంగాల ప్రముఖులు భారీగా తరలివచ్చారు.పార్క్ హయత్ హొటల్ లో ఆయన బిజీబిజీగా ఉన్నారు.red more