టి-న్యూస్…నెం.1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. సరే ఇది వారు పెట్టుకున్న ట్యాగ్, దీంతో ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు. అయితే, టి-న్యూస్ ఇటీవల తన హద్దులు దాటేసింది. ఈ విషయం తెలుసుకునే ముందు తెలంగాణ ఉద్యమం-మీడియా పాత్ర గురించి మాట్లాడుకోవాలి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు అంతర్గత కారణాలు ఏమైనా బహిర్గత కారణం మాత్రం ఒకటే…తెలంగాణ సాధన. దాని బలం, బలహీనత దాని అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన టీఆర్ఎస్ స్థాపించారు. ఆయన అదృష్టం ఏమో గాని ఆయన పార్టీతో పాటే ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ ఛానళ్ల హవా కూడా మొదలైంది. మంచి వక్త కావడం, మాటలతో గారడీ చేయడంతో ఏం మాట్లాడితే సెన్సేషన్ అవుతుందో గుర్తించిన కేసీఆర్ అదే మాట్లాడసాగాడు. అప్పటికింకా టి-న్యూస్ లేదు. ప్రధాన ఛానళ్లు కూడా కొన్నే. ఆ తర్వాత వెంటవెంటనే అన్నీ పుట్టుకువచ్చాయి. ఛానళ్లు ఎన్ని వచ్చినా కేసీఆర్ లాంటి వక్త వాటికి దొరకలేదు. అప్పడపుడే పుట్టుకువస్తున్న ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానళ్లు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు ప్రవర్తించాయి. ఎక్కడేం కనిపించినా పదేపదే చూపించడం.read more
No comments:
Post a Comment