http://apvarthalu.com/

Sunday, August 21, 2016

మెగాస్టార్ 150వ చిత్రం పేరు ‘ఖైదీ నెంబర్ 150’


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

No comments: