ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా గురువారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు ఓయూ విద్యార్థి జేఏసీ ర్యాలీ ప్రారంభించారు. అయితే భారీగా పోలీసులు బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకుని బయటకు రాకుండా ఎన్‌సీసీ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి తెలంగాణ విద్యార్థుల ఆందోళనతో గురువారం అట్టుడికింది. సచివాలయ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. తాము జలదృశ్యం వరకు వెళ్లి ఇటీవల మరణించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
No comments:
Post a Comment