చెన్నై శివారు కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి మహేష్,సమంత పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.వెంకటేష్, మహేష్‌బాబు, సమంత, అంజలి కాంబినేషన్‌లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. చలి పులి పంజా విసిరే సమయంలో సందడి చేసేందుకు వెంకటేష్, మహేష్‌బాబు సన్నద్ధమవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...''పదహారణాల తెలుగుదనాన్ని ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రమిది. ఇటీవలే చెన్నైలో పెళ్లి పాటతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ భారీ సెట్ నిర్మించాం. అక్కడ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల్ని త్వరలో చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో అయిదు పాటలున్నాయి. ఇప్పటికే మూడింటిని చిత్రీకరించాం. నవంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.
No comments:
Post a Comment