నందమూరి బాలకృష్ణ సినిమాఅంటే అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంబినేషన్‌లో విషయంకూడా అందులో ఉంటుంది. ఇటీవలే విడుదలైన 'శ్రీమన్నారాయణ' సినిమా గురించి ఆయన తన మనసులోని మాటను ఆవిష్కరించారు. ఈప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ నుంచి విచిత్రమైన కాంబినేషన్ అనుకున్నారు. అదే విషయాన్ని బాలకృష్ణ చెప్పారు. ''రవి చావలి నన్ను కలవడానికి పడిన శ్రమను గుర్తించాను. ఓ సందర్భంలో కలిశారు. కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం, ఆయనపై నమ్మకం కల్గింది. దీనికితోడు ఘటికాచలం డైలాగ్స్ ఎలా ఉంటాయనే అనుకున్నారు. ఈయన బాలకృష్ణ సినిమాకు రాయగలుగుతాడా? లేదా? అని చాలామందిలో కలిగింది. ఆయన ఈ సినిమాలో గంభీరమైన డైలాగ్స్ రాశరు. కొత్త కాంబినేషన్. కానీ టాలెంట్ ఎక్కడ ఉంటే వారిని ప్రోత్సహించాలని శ్రీమన్నారాయణ సినిమా చేశాను'' అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఆదివారం రాత్రి శ్రీమన్నారాయణ సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ కలిసి కష్టపడిపనిచేశారు. హీరోయిన్లు బాగా నటించారు.. అంటూ... 'చలాకీ చూపుల్తో ఛూ మంత్రం వేశావే...' అంటూ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన చక్రి సింహా తర్వాత ఈ చిత్రానికి పని చేశాడని అన్నారు
No comments:
Post a Comment