నాగార్జున, రాఘవేందర్రావు కాంబినేషన్లో రూపొందిన మరో భక్తి రస చిత్రం శిరిడి సాయి. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రసాద్ ల్యాబ్ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్.... చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానన్నారు. శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు... ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లకు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్‌రెడ్డి సాయి తత్వాన్ని అందరికీ తెలియ చేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు’ అని వ్యాఖ్యానించారు. శిరిడి సాయి చిత్ర యూనిట్ వెైజాగ్ నుంచి విజయ యాత్ర నేడు ప్రారంభించనున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్ రెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొంటారు.
Tuesday, September 11, 2012
నాగార్జున నటన అద్భుతం...చిరంజీవి

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment