దేశంలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ కళ్యాణమండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సహకార దినోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. జీడీసీసీబీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో ఎక్కువ మందికి సహకార రంగంతో ప్రమేయం ఉందన్నారు. ఈ రంగం పటిష్టంగా ఉంటే పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకార వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
No comments:
Post a Comment