http://apvarthalu.com/

Wednesday, September 5, 2012

కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ !


 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ రానుందా.. అంటే అవుననిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించేందుకు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ఓ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవ త్సరాల, 4 నెలలు పూర్తి అయింది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్ళాలంటే తమకంటూ ప్రత్యేక ఛా నెల్‌ ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఛానెల్స్‌ ద్వారా పార్టీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం సాధ్యం కా దు గనుక, రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసు కుందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో మంత్రు లు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తమ నియోజ కవర్గాల పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను ఈ ఛానెల్‌ ద్వారా ప్రజలకు వివరిం చవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన ఓ ఛానెల్‌లో భాగస్వామి అయి, తద్వారా ఛానెల్‌ను పేరుమార్చకుండా యధావి ధిగా నిర్వహించాలని బొత్స ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్న బొత్సకు ఈ ఛానెల్‌ నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలాఉంటే గతంలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడి ద్వారా సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్‌ను ప్రారం భించినప్పటికీ, వైఎస్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ప్రత్యేక ఛానెల్‌ అంటూ లేకపోయింది. సీపీఎం తమ పార్టీ తరపున మరో రెండు నెలల్లో ఛానెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదిలాఉంటే సీపీఐ కూడా తమకూ ఓ ప్రత్యేక ఛానెల్‌ ఉండాలని యోచిస్తుంది.

ఇదే బాటలో పయనించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా ఉండి, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉండికూడా ఏ రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక ఛానెల్‌ లేకపోవడం కాంగ్రెస్‌కు కొంత వెలితిగా ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేరళలో పీసీసీకి ప్రత్యేక ఛానెల్‌ ఉందని, మన రాష్ట్రంలోకూడా ఉండాలని పార్టీ వర్గాలు కోరుతు న్నాయి. మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో కొద్దినెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభు త్వం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఈ తరు ణంలో ఛానెల్‌ను ప్రారంభిస్తే స్థాని క సంస్థల ఎన్ని కలకు ముందే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మ రింత పటి ష్ఠంగా తీసుకెళ్ళవచ్చని పార్టీ వర్గాలు అంటు న్నాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు... సబ్సీడీమీద విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రూ.లక్ష వరకు వడ్డీ లేకుండా రుణాలు అందజేయడం వంటి పథకాలను సంక్షిప్త కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయాలని పార్టీ యోచిస్తుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా రెండు జతల యూనిఫారాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, వీటితోపాటు కంప్యూటర్‌ విద్య, ముస్లిం విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే, పార్టీ గ్రామస్థాయిలో పటిష్ఠం అవుతుందని పార్టీవర్గాలు అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సహకార, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స జిల్లాల్లో విరివిగా పర్యటిస్తుంటారు. ఆయా సందర్భాల్లో ఆక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పొల్లుపోకుండా ప్రజలకు చూపిస్తే, ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యా నిస్తున్నాయి.

No comments: