కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రివర్గంలోకి రావడాన్ని తాను
స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు తన ఆహ్వానం
ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వంలో చేరాలని ఇప్పటికే పలుమార్లు ఆయన్ను కోరానని
శనివారమిక్కడి రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో అన్నారు. ప్రభుత్వంలోనూ,
పార్టీలోనూ పెద్దపాత్ర పోషించేం దుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్
పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం
సంతరించుకున్నాయి. రాహుల్ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీలో ప్రధాన
కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి.
ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ వం టి నేతలు పార్టీ ప్రధాన
కార్యదర్శులుగా కొనసాగుతూనే.. కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతిని కాంగ్రెస్
వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్‌ను ప్రధాని
అభ్యర్థిగా తెరపైకి తేవాలని వారు కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్ష పదవి లేదా
కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆశిస్తున్నారు.
No comments:
Post a Comment