సన్నగా... నాజూకుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కలలు కంటూ వుంటుంది. దానికోసం పడరాని పాట్లన్నీ పడుతుంటుంది. డైటింగ్ అంటుంది, జిమ్ అంటుంది, ఎక్సర్ సైజ్ అంటుంది. కానీ ఏ మాత్రం ఫలితం ఉండదు. పోషకాహారం అన్నది రోజు రోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే మనం తినే ఆహార పదార్థాలలో చిన్ని చని్న మార్పుల ద్వారా సన్నగా, ట్రిమ్ గా తయారవ్వచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి తీసుకొనే డిన్నర్ వరకూ ఆహారంలో కొవ్వు తగ్గించుకుంటే సన్నబడడం పెద్ద కష్టమేమీ కాదు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ఆరోగ్య కరమైన శరీరంతో జీవించగలుగుతారు. దాంతో మీ శరీరం ఫిట్ గా, చక్కటి ఆకృతిని కలిగి ఉంటారు. సన్నబడ్డానికి డైయట్ అంటూ రెండు పూటలా నోరు కట్టేయకుండా మూడుపూటలా తగిన మోతాదులో తీసుకొంటే ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. అందుకోసం కొన్నిహెల్తీ న్యూట్రిషియన్ ఫుడ్ ను మధ్యాహ్న భోజనంలో చేర్చుకోవాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు మీ కోసం...
No comments:
Post a Comment