http://apvarthalu.com/

Thursday, October 11, 2012

జగన్ సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం సాయంత్రం స్పష్టం చేశారు. 'మరో ప్రస్థానం' పేరుతో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని విజయమ్మ వెల్లడించారు. సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా యాత్ర సాగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు. మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో, ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా వైఎస్ స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు. 

Wednesday, October 10, 2012

జగన్ పార్టీలోకి మోహన్ బాబు !


కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన చర్యలను చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కొద్ది నెలలుగా ఆయన తాను తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెబుతూ వచ్చారు. ఆయన పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడగానే తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తన గురువు దాసరి నారాయణ రావుకు ప్రాధాన్యత కల్పించడం, చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన నేపథ్యంలో మోహన్ బాబు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసులో చేరే అవకాశాలు లేవని తొలి నుండి అందరూ భావించిన విషయమే.
తన విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చాలాకాలం తర్వాత ఆహ్వానించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. టిడిపిలో చేరేందుకు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు చంద్రబాబుకు తనకు మధ్య చిన్న మనస్పర్థలు మాత్రమేనని, ఆయన పాలన బావుందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా అవినీతిలేని పార్టీలో చేరతానని, జర్నలిస్టులు ఏదో సూచించాలని కోరారు. అప్పటికే జగన్ పార్టీకి అవినీతి మచ్చ పడ్డ నేపథ్యంలో మోహన్ బాబు ఖచ్చితంగా టిడిపిలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా మోహన్ బాబు ఇంటికి జగన్ రావడం, ఆ తర్వాత ఓసారి జైలులో కూడా తన తనయుడు విష్ణుతో కలిసి మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను కలవడం మరోసారి చర్చకు దారితీశాయి. అప్పుడు జగన్‌కు అనుకూలంగా మాట్లాడారు. రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ బయటకు వస్తాడని, ఏ తప్పు చేయలేదని చెప్పారు. దీంతో మోహన్ బాబు టిడిపిపై యూ టర్న్ తీసుకున్నట్లుగా అర్థమైపోయింది. తాజాగా మోహన్ బాబు తనయుడు విష్ణు హీరోగా వస్తున్న ఓ చిత్రం జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Monday, October 8, 2012

16 ఏళ్ల రాగానే పెళ్లి చేయండి!


 ఇటీవల హర్యానాలో రేప్ కేసుల సంఖ్య పెరగడంతో దానికి అక్కడి కాప్ పంచాయత్ పెద్దలు వింత పరిష్కారం చూపారు. యువతీయువకుల పెళ్లి వయస్సు తగ్గించి, వారికి 16 ఏళ్లకే పెళ్లి చేయాలని అప్పుడే అత్యాచార కేసులు తగ్గుముఖం పడతాయంటూ కొత్తభాష్యం చెప్పారు. అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక కొద్దిరోజులక్రితం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెలరోజుల్లో ఇలాంటివి 12 సంఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం జోక్యం చేసుకుని హర్యానా ప్రభుత్వానికి తలంటింది.
మరోవైపు ఈ ఘటనల వెనుక కుట్ర దాగుందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాప్ పెద్దలు తమదైన శైలిలో పరిష్కార మార్గం చెప్పారు. ‘‘16 ఏళ్లు రాగానే యువతీయువకులకు పెళ్లి చేస్తే.. వారు తప్పుదోవపట్టరు. తద్వారా రేప్ కేసులూ తగ్గుముఖం పడతాయి’’ అని ఓ కాప్ పెద్ద పేర్కొనగా.. రజస్వల కాగానే ఆడపిల్లకు పెళ్లి చేయాలని మరో పెద్దమనిషి ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు వరుస సంఘటన లపై హర్యానా ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేసింది. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని ప్రకటించింది. అయితే సర్కారు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Sunday, October 7, 2012

తిరుమలలో శ్రీవారి లడ్డూల కొరత

 తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కొరత ఏర్పడింది. దీంతో అదనపు లడ్డూ టోకన్లను టీటీడీ కుదించింది. వారం రోజులుగా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి తగట్టుగా లడ్డూ ప్రసాదాలను అందించారు. రోజువారి తయారీతో పోలిస్తే భక్తులకు పంపిణీ చేసిన లడ్డూలే అధికంగా ఉంది. దీంతో ఆలయ పోటులో నిల్వ ఉంచిన లడ్డూలను సైతం భక్తులకు అందించడంతో అయిపోయాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా తయారైన లడ్డూలు నేరుగా కౌంటర్లకు తరలించి తడిగా ఉన్న ప్రసాదాలనే భక్తులకు అందజేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐదు లక్షల లడ్డూలు నిల్వ ఉంచడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. దీంతో భక్తులకు అదనంగా జారీచేసే లడ్డూపడి టిక్కెట్లను కుదించారు. ఆదివారం ఉదయం నుంచి ఒకరికి నాలుగు లడ్డూల స్థానంలో రెండింటినే జారీ చేస్తున్నారు. దీనిపై కొందరు భక్తులు కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లడ్డూ కౌంటర్ల ప్రాంతానికి చేరుకుని భక్తులకు సమస్యను వివరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ లడ్డూ టోకన్ల కుదింపు విషయాన్ని ముందుగానే మైకుల ద్వారా, కౌంటర్ వద్ద సిబ్బందిచే భక్తులకు తెలియజేసి ఉంటే వ్యతిరేకత ఎదురయ్యేది కాదు.

Saturday, October 6, 2012

పాదయాత్ర లో చంద్రబాబు వెంట పరిటాల శ్రీరామ్

టీడీపీ నేత పరిటాల రవిని హత్య చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీ కోసం కార్యక్రమంలో భాగం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఐదో రోజు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. పేదలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు వెంట రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఉన్నారు.

Friday, October 5, 2012

జనం చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్...ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్


 'వస్తున్నా . . . మీకోసం' పాదయాత్రలో చంద్రబాబుకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అనంతపురం జిల్లా ఉరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రొద్దం మండలం రాగిమేకలపల్లి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటారని తెలిసిందన్నారు. ఆయన సుదీర్ఘ యాత్రకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిని ఓదార్చడానికి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయనను స్వాగతించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ద్వారా చంద్రబాబు యాత్రను అడ్డగించి ఇబ్బంది కలిగించేలా మంత్రి, ఎంపీ కుట్ర పన్నుతున్నారన్నారు. ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

2013లో రిటైర్మెంట్ ప్లాన్ ...సచిన్ టెండూల్కర్

 తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పాడు. నవంబర్‌లో భవిష్యత్తుపై సమీక్షించుకుంటానని ఆయన అన్నారు. ఓ టెలివిజన్ చానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు. "ఇప్పుడు నాకు 39 ఏళ్లు. ఇంకా చాలా క్రికెట్ ఆడుతానని అనుకోవడం లేదు" అని ఆయన అన్నారు. రిటైర్మైంట్ గురించి ఆలోచిస్తున్నారా అని అడిగితే అవునని, ఆ విషయం ఆలోచిస్తున్నానని జవాబిచ్చారు. ఇప్పుడు తనకు 39 ఏళ్ల వయస్సు అని, దాని గురించి ఆలోచించడం అసాధారణమేమీ కాదని, తాను తన హృదయం చెప్పిన మాటే వింటానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నట్లు చెబుతోందని, సిరీస్‌కు, సిరీస్‌కు మధ్య ఆలోచించాల్సి ఉంటుందని అన్నాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లాండుతో జరిగే నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తాను ఆడుతానని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు తాను రిటైర్ కావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్‌లో ఆడిన తర్వాత తిరిగి సమీక్షించుకుని అంచనా వేసుకుంటానని అన్నారు.

జగన్ బెయిల్ పై డెడ్‌లైన్

జగన్ కేసుపై సిబిఐకి ఛార్జీషీట్ డెడ్‌లైన్ విధించింది. 2013 మార్చి 31వ తేదిలోగా ఈ కేసును ముగించాలని సిబిఐకి సూచించింది. తరుచూ ఛార్జీషీట్లు వేయవద్దని, ఒక్క ఛార్జీషీట్‌తోనే విచారణ ముగించాలని తెలిపింది. సిబిఐ మరింత సమయం కోరడంతో కోర్టు ఈ డెడ్ లైన్ విధించింది. విచారణ గడువు ముగిసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని జగన్ కు కోర్టు సూచించింది. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌‌లు, సిబిఐ తరఫున అశోక్ బాన్, మోహన్ పరాశరణ్‌లు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

జగన్‌ సుప్రీం కోర్టులో నో బెయిల్

 అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. జగన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆఫ్తాబాలన్, రంజనా దేశాయ్ తో కూడిన డివిజన్ బెంజ్ తిరస్కరించింది. దర్యాప్తు ముగిసేలోపు మళ్లీ బెయిల్ అడగవద్దని కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో హోరా హోరీగా వాదనలు జరిగాయి. జగన్ అరెస్ట్ అక్రమమని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు లాయర్ వాదించారు. సాక్షులను ఏవిధంగాను ప్రభావితం చేయలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే జగన్ అక్రమాస్తులపై దర్యాప్తుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని, ఇప్పటికే మూడు వేల కోట్ల ఆస్తులను కనిపెట్టామని, ఇంకా వేలాది కోట్ల ఆస్తులను దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, జగన్ సహకరిస్తే దర్యాప్తు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని లాయర్లు కోర్టులో వాదించారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు జగన్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. 

Thursday, October 4, 2012

జగన్ బెయిల్ కోసం గుళ్లలో పూజలు


వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెయిల్ రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలోని స్తంభాద్రి ఆలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం కార్యకర్తలు అరసవల్లి సూర్య నారాయణ దేవాలయంలో గురువారం 1,101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అర్చన చేయించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి శ్రీవారి పాదాల వద్ద 1,116 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ త్వరలో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జగన్ క్షేమం కోరుతూ పార్టీ నేతల ఆధ్వర్యంలో సర్కస్ గ్రౌండ్ నుండి మంకమ్మ తోట వరకు పాదయాత్ర చేసి, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. హైదరాబాదులోని అంబర్ పేట నుండి జిడి కాలనీ వరకు పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రేమికులపై దాడి

విహారానికి వచ్చిన ప్రేమికులపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా టైగల్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన అజిత, మునిరాజులుగా గుర్తించారు.

రాయలసీమ అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ఇవ్వండి...మంత్రి టీజీ వెంకటేష్

రాయలసీమ అన్ని వనరులకు నిలయం అని, కాని వాస్తవానికి మాత్రం అల్లుని నోట్లో శని అన్నట్టు రాయలసీమలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయని మంత్రి టి.జి. వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవితో మంత్రి టీజీ వెంకటేష్ బృందం గురువారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మంత్రి టీజీ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అన్నివిధాల వెనుకబడి ఉందని సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వాయలార్‌ను కోరినట్లు తెలిపారు. రాయవసీమలో బంగారు గనులకు కొదవ లేదని, అలాగే వజ్రాలకు పెట్టింది పేరు అని, ఎన్నో వనరులు ఉన్నా ఫలితం మాత్రం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ బెయిల్‌పై సుప్రీంలో రేపు విచారణ

శుక్రవారం జగన్ బెయిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జగన్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇంతవరకు సీబీఐ, ఈడీలు చేసిన విచారణ వృధా అవుతుందని భావిస్తూ ఈడీ ఈరోజు అన్నీ ఆధారాలతో జగన్ అండ్ కో స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదించే వాదనలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝలిపించింది. జగన్మోహన్‌రెడ్డి ఆయన ద్వారా లబ్ది పొందిన వారి స్థిర చరాస్తులను ఈడీ గురువారం జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘనగా ఈడీ నిర్ధారిస్తూ, రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ. 14 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి ప్రభుత్వం ద్వారా (అక్రమార్గంలో) పలు విధాలుగా అంటే సెజ్‌లు, ఇరిగేషన్, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గనుల కేటాయింపులు తదితర వాటి ద్వారా లభ్ది పొందిన కంపెనీలు, జగన్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారించి, ఈ నేపథ్యంలోనే వారి ఆస్తులను అటాచ్‌మెంట్ చేసింది. హెటోరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, మూడు కోట్ల రూపాయల పిక్సిడ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. ఆరబిందో ఫార్మాకు సంబంధించి 95 ఎకరాల భూమి, రూ. 3 కోట్ల పిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఆస్తులను జప్తు చేసింది. హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలు రూ.8.60 కోట్లు లబ్ధి పొందేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఈడీ నిర్దారించింది. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమిని కేటాయించిందని పేర్కొంది. మరో సంస్థ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ 30.33 ఎకరాల భూమిని పొందడం ద్వారా రూ.4.30 కోట్లు లబ్ధి పొందిందని వివరించింది. భూముల కేటాయింపులో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అడ్డదారిలో భూకేటాయింపులు జరిపిందని తెలిపింది. తదుపరి చర్యలకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు తెలియవచ్చింది.

Wednesday, October 3, 2012

పవన్ కళ్యాణ్ సినిమా తో చేసే తీరిక లేదన్న... సమంత

కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను సమంత ఖండించింది. ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది. ‘గతంలో కమిట్ అయిన సినిమాలే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' అని స్పష్టం చేసింది. ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం కొంత కాలంగా షూటింగులకు దూరమైన సమంత ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది. సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

పార్టీలోకి రావడానికి పర్మిషన్ అవసరంలేదు...నారా లోకేష్

పార్టీలోకి రావడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం అన్నారు. తండ్రి పాదయాత్రలో పాలుపంచుకుంటున్న లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్నారు. తాను 1995 నుండే పార్టీ కోసం పని చేస్తున్నానని, 1999 నుండి క్రియాశీలకంగా ఉన్నానని, పార్టీలోకి వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి చూస్తున్నారన్నారు. రాజకీయాలలోకి రావడం గొప్ప విషయమేమీ కాదన్నారు. కుప్పం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి లోకేష్... కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. ఇకపై పార్టీ పటిష్టతపై సీరియస్‌గా దృష్టి సారిస్తానని లోకేష్ చెప్పారు. పాదయాత్రకు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.

కేసీఆర్ పై హైకోర్టు విచారణ

ప్రభుత్వం కేటాయించిన భూమిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నరని ఆయన మేనల్లుడు ఉమేష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉమేష్ రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నుండి తీసుకున్న భూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంతో ప్రైవేటు న్యూస్ ఛానల్ ను నడపడంపై ఉమేష్ రావు గతంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్ల గదుల వద్ద అమ్మాయిల అరెస్ట్!

వెస్టిండీస్ క్రికెటర్ల గదుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముగ్గురు బ్రిటన్ జాతీయ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లోని విండీస్ క్రికెటర్ల గదుల్లోకి అనధికారికంగా వెల్లడానికి ప్రయత్నించడంతో మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సిన్నమోన్ గార్డెన్ పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ట మధ్య మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకుంది.

తెలంగాణపై ఇప్పట్లో రాదు...మంత్రి టీజీ

 ప్రత్యేక తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశంలేదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికలకు ఆరె నెలల ముందు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువడనుందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానం కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని మంత్రి టీజీ తెలిపారు.

తప్పులు సరిదిద్దుకుని మంచి పాలన అందిస్తా...చంద్రబాబు

తొలిరోజు పాదయాత్రలో జననీరాజనాలు అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజైన బుధవారం కోళ్లకుంటనుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు దాదాపు 18 కి.మీ వరకు పాదయాత్ర సాగనుంది. 8 నుంచి 10 గ్రామాల్లో బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. రెండో రోజు ప్రాదయాత్రలో కూడా బాబు వెంట ఆయన కుమారుడు లోకేష్ నాయుడు ఉన్నారు. బుధావారం ఉదయం హిందూపురం నియోజకవర్గం కోళ్లకుంట నుంచి బాబు పాదయాత్రను ప్రార ంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ టీడీపీ హయాంలో ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్గుకొని మంచి పాలన అందిస్తానని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశామన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగాలనే తాను ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం జరగాలన్నారు. కానీ కాంగ్రెసు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, దానిని విదేశాలలో దాచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైనా 14 శాతం పన్ను విధించిందని విమర్శించారు.

Monday, October 1, 2012

'గుండెల్లో గోదారి' ఫొటోఫై చర్యలు తీసుకుంటాం... మంచు లక్ష్మీప్రసన్న


 మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ నటించిన డబుల్స్ అనే చిత్రాన్ని తమిళంలో ‘పుదువై మనగరమ్' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ‘గుండెల్లో గోదారి'లోని తాప్సీ ఫొటోలను వినియోగిస్తున్నారని, ఇది అభ్యంతరకరమని లక్ష్మీ చెబుతూ, ఈ విషయాన్ని తమిళనాడు నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఆ సినిమా ప్రచారం కోసం 'గుండెల్లో గోదారి'లోని తాప్సి ఫొటోలను వాడుకుంటున్నారు. ''ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము'' అన్నారు లక్ష్మీ ప్రసన్న.గుండెల్లో గోదారి ఓ సాహసోపేతమైన ప్రేమకథ. వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకొన్నాము. 1980 కాలంలో నడిచే కథ ఇది. ఇళయరాజా ఆరు బాణీలను అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 'సినిమా విడుదలైన తరవాతే ఇవ్వు' అన్నారు. ఆ మాట ఎంతో సంతోషాన్నిచ్చింది' 'అని ఆమె చెప్పారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పాటల్ని, నవంబరు మొదటి వారంలో సినిమాని విడుదల చేస్తారు.

బాబు యాత్ర ఎందుకో తెలియదు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తనకు తెలియదని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి పెనుకొండకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు పా దయాత్రపై మీ స్పందన ఏమిటంటూ విలేఖరులు అడగటంతో పైవిధంగా స్పందించారు.

చంద్రబాబుకు కలిసిరాని కాలం!


 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది మొదలు పెట్టినా బెడిసికొడుతోంది. ఆయన విధానాలన్నీ తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రత్యర్థులేకాదు సొంత పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ బలహీనపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హర్షించలేదు. ఇరు ప్రాంతాల వారు విమర్శించారు. తెలంగాణ వారు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పట్ల, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యల పట్ల సరైన రీతిలో స్పందించలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏం చేస్తే అది చేసి నవ్వుల పాలయ్యారు. ఆ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నాలు, దీక్షలు చేస్తే దీక్షలు చేశారు. ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ కాపీ కార్యక్రమాలే. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు ఇలా చేస్తున్నారేంటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార దాహంతో అర్ధంపర్ధంలేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో టిడిపి పూర్తిగా బలహీనపడింది. ఉప ఎన్నికలలో పలుచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తెలంగాణపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమని, ఈ అంశాన్ని త్వరగా తేల్చమని చంద్రబాబు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం వివాదాలకు దారి తీసింది. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలోనే చిచ్చు రగిల్చింది. ఈ లేఖతో తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు విమర్శించారు. బాబు లేఖల పేరుతో మోసం చేస్తున్నారని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన రెడ్డి మండిపడ్డారు. లేఖలో స్పష్టత ఏముందో చెప్పాలని ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. లేఖల రాజకీయంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేశారని తెలంగాణవాదులు అంటే, సొంత జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సీమ ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని టిడిపి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబును చెప్పులతో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పి, వారిని చైతన్యపరిచేందుకు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు తాము వెయ్యి కిలో మీటర్ల పొడవున రాయలసీమ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. తమ యాత్ర కర్నూలు జిల్లా కేతవరంలో మొదలై అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభతో ముగుస్తుందని ఆయన వివరించారు. చంద్రబాబు పాదయాత్రకు సహకరించేది లేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తెగేసి చెప్పారు. లేఖ రాయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బాబు విధానాల వల్ల పార్టీ బ్రష్టుపట్టిపోయిందని అమరనాథ రెడ్డి బాధపడ్డారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బాబు వ్యూహాత్మక తప్పిదాల వల్లే టీడీపీ హీనస్థితికి చేరిందన్నారు. పార్టీని ఆయన అధోగతి పాలు చేశారన్నారు. పార్టీ అధినేత అయిన తననే ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణలో చూస్తే అలా ఉంది, సీమలో చూస్తే ఇలా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు వలసబాట పట్టారు. 2009 ఎన్నికలలో టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర రెడ్డి, వేణుగోపాల చారి, నాగం జనార్ధన రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డి, కొడాలి నాని, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటర్లు టిడిపికి చుక్కలు చూపించారు. పరిస్థితి ఇలా ఉన్నా చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీమీద మమకారం చావలేదు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ ' రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు చరిత్ర తిరగరాయాలని అనుకుంటున్నాను. సమస్యలు చూసి ఓదార్చడం కాకుండా వారిలో చైతన్యం తెచ్చి పరిష్కార దిశగా కృషి చేయాలి. మళ్లీ నేను సీఎంని అవుతాను. మధ్యతరగతిలో పుట్టినప్పటికీ ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాను. మహాత్మాగాంధీ, పూలే, ఎన్టీఆర్ సైతం అలాంటి స్థితిలోనే జన్మించి అనుక్నుది సాధించారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయే అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని కృషిచేయాలి’ ' అని చెప్పారు. అంతే కాకుండా ఇటీవల బిసి డిక్లరేషన్, ఎస్ సి డిక్లరేషన్, ముస్లింలకు ఉప ప్రణాళిక....... అని చెబుతున్నారు. పదవీ వ్యామోహం ఆయనతో ఇలా మాట్లాడిస్తోంది.

Sunday, September 30, 2012

భాగ్యనగరం రణరంగమైంది

భాగ్యనగరం రణరంగమైంది. పోలీసుల తూటాలు, లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగాలు లెక్క చేయకుండా, బారీకేడ్లను తొలగించి, ముళ్లకంచెలపై నుండి దూకి తెలంగాణవాదులు చీమలదండులా సాగర హారానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సాగర్‌ను వదిలేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తాము శాంతియుతంగా కవాతు చేయడానికి సిద్ధమైనతే పోలీసులు తమపై నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని, తెలంగాణవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినప్పటికీ తెలంగాణవాదులు ఎలాంటి హింసామార్గాన్ని చేపట్టకుండా లక్షలాదిగా తరలి వచ్చారని అంటున్నారు. జనసాగరంగా మారిన సాగరహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు ఇలా ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సాగర తీరానికి చేరుకున్నారు. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ అన్నీ ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నేల ఈనిందా అన్న మాదిరిగా నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులతో నిండిపోయింది. నగరం మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మూడు గంటలకే ప్రారంభమవుతుందనుకున్న సాగరహారం అరెస్టులు, నిర్బంధాల కారణంగా రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకుముందు వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులను పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. అరెస్టులను నిరసిస్తూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిశారు. టిటిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో రెండుసార్లు అరెస్టయ్యారు. సొంత పార్టీ నేతల నుండి కిరణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కిరణ్, డిజిపి వైఖరిపై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓ అడుగు ముందుకేసి... తెలంగాణవాదులను రెచ్చగొడితే తాము పదవులను త్యజించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. మధ్యాహ్నం అనుకున్న సమయానికి ఆయా పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీలు నిర్దేషిత ప్రాంతాల నుండి ప్రారంభమయ్యాయి. పోలీసులు ర్యాలీలను ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మీడియా ఓబి వ్యాన్లకు, నెక్లెస్ రైల్వే స్టేషన్‌కు, రెండు పోలీసు జీపులకు నిప్పు అంటించారు. సాయంత్రం కవాతు వేదిక వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తదితరులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులపై తెలంగాణవాదులదే పైచేయి అయింది. ఎక్కడికి అక్కడ పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా కాలు కాలు కదిపి కదం తొక్కారు. డిజిపి దినేష్ రెడ్డి నగరంలో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. తూటాలకు వెన్నుచూపని ఓయు విద్యార్థులు! కవాతు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. ఓయు విద్యార్థులు బైక్ ర్యాలీతో కవాతు వేదిక వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకొని ముందుకు కదలనివ్వలేదు. తాము బైక్ ర్యాలీతోనే వెళ్తామని విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులు కూడా అంతే ధీటుగా పోలీసుల పైకి రాళ్ల వర్షం కురిపించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని.. అనుమతిస్తే మంచిదని లేకుంటే తాము అదే తీరుగా స్పందిస్తామని పోలీసులు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ విద్యార్థికి రబ్బరు తూటా తగిలి గాయమైంది. తూటా తగిలినా, బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ విద్యార్థులు వెనుకంజ వేయలేదు. నెక్లెస్ రెడ్డు తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతరను తలపించింది.

Saturday, September 29, 2012

హైదరాబాద్ గణనాథునికి ఘన వీడ్కోలు

 హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తజనం నామస్మరణ. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా.. భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది. రాత్రి 11 గంటల సమయానికి 4,350 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12-1 మధ్య మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది.

దేశంలో పెరిగిపోయిన అవినీతి

దేశంలో అన్ని విభాగాల్లో అవినీతి పెరిగిపోయిందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లోని రెవెన్యూ కళ్యాణమండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ సహకార దినోత్సవ సభలో మంత్రి ప్రసంగించారు. జీడీసీసీబీ ఛైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాసు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలో ఎక్కువ మందికి సహకార రంగంతో ప్రమేయం ఉందన్నారు. ఈ రంగం పటిష్టంగా ఉంటే పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సహకార వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

Thursday, September 27, 2012

వస్తున్నా మీకోసం: బాబు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు


అక్టోబర్ 2వ తారీఖు నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ ఖరారైంది. అనంతపురం జిల్లా హిందూపురం నుండి బాబు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. స్థానికంగా ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రబాబు నిర్వహించే ఈ పాదయాత్రకు వస్తున్నా మీకోసం అనే పేరును పెట్టారు. హిందూపురం నుండి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాప్తాడు, పెనుగొండ, గుత్తి మీదుగా కర్నూలులోకి ప్రవేశిస్తుంది. అనంతలో 13 రోజులు పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 117 రోజులు రోజుకు సుమారు 15 కి.మీ. నుండి 20 కి.మీ. వరకు పాదయాత్ర చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు ఆరవై నాలుగేళ్ల వయస్సులో కూడా ప్రజల కోసం ఈ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. టిడిపి తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిని ప్రజలకు తెలియజేస్తామని, బాబుకు విల్ పవర్ ఉంద్నారు.
చంద్రబాబు అంతకుముందు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి లేదా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి పాదయాత్ర చేపట్టాలని చూశారు. కొడంగల్ నుండి దాదాపు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో అది కూడా రద్దయింది. ఈరోజు అధికారికంగా హిందూపురం నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందించారు. అన్నా స్టూడియోలో రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. బాబు మార్చింగ్ పైన, బాబు వస్తున్నాడని ఇలా అర్థం వచ్చేట్టు పాటలను రాశారు.



బాబు లేఖ పెద్ద డ్రామా... గంటా

ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ పెద్ద డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్ త్రవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. విశాఖలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో 144 సెక్షన్

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

ఓయూలో టెన్షన్...టెన్షన్

 ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా గురువారం ఉదయం కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు ఓయూ విద్యార్థి జేఏసీ ర్యాలీ ప్రారంభించారు. అయితే భారీగా పోలీసులు బలగాలు అక్కడకు చేరుకుని విద్యార్థులను అడ్డుకుని బయటకు రాకుండా ఎన్‌సీసీ గేటుకు తాళం వేశారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి తెలంగాణ విద్యార్థుల ఆందోళనతో గురువారం అట్టుడికింది. సచివాలయ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు విశ్వవిద్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. తాము జలదృశ్యం వరకు వెళ్లి ఇటీవల మరణించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెబుతున్నా పోలీసులు వినలేదు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

రాహుల్‌కు మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తా...ప్రధాని

కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రివర్గంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. రాహుల్‌కు తన ఆహ్వానం ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వంలో చేరాలని ఇప్పటికే పలుమార్లు ఆయన్ను కోరానని శనివారమిక్కడి రాష్ట్రపతి భవన్‌లో మీడియాతో అన్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పెద్దపాత్ర పోషించేం దుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్ పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ వం టి నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతూనే.. కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతిని కాంగ్రెస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవాలని వారు కోరుతున్నారు. పార్టీ ఉపాధ్యక్ష పదవి లేదా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఆశిస్తున్నారు.

Wednesday, September 26, 2012

తెలంగాణ ఎక్కడ ఉందో 30న తెలుస్తుంది

 తెలంగాణ ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 30న ప్రజలు చూపిస్తారని బిజెపి ఎంపి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మోసపోతారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100రోజులలోనే తెలంగాణ ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పోలీసులకు ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు

రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇంటలిజెన్స్‌బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. జీవవైవిద్య సదస్సుకు వచ్చే వీవీఐపీలకు హైసెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. విదేశీ ప్రతినిధులకు ఒక్కొక్కరికీ బాడీగార్డులను నియామకం జరగనుంది. ఉగ్రవాదులు, ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై పోలీసులకు ఐబీ సూచనలు జారీ చేసింది.

సీఎంని గొర్రెల కాపరితో పోల్చిన లగడపాటి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపి లగడపాటి రాజగోపాల్ గొర్రెల కాపరితో పోల్చారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి 9 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని తెలిపారు. గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారన్నారు. సీఎం కిరణ్ కూడా అలాగే మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

Friday, September 21, 2012

అల్లు అర్జున్ సరసన కాజల్ లవ్ స్టోరీ


                                  
రామ్ చరణ్ తేజ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్య 2 చిత్రంలో ఈ జంట రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు ఈ జంట మద్య లవ్ స్టోరీని బాగా పండించటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ పదిహేను నిముషాలు పాటు ఉంటుందని అంటున్నారు. ఓ పాట, రెండు ఫైట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఆ లవ్ స్టోరీ చాలా స్పీట్ గా నడిపి కథకు కీలకంగా మార్చనున్నారని తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుందంటున్నారు.

Thursday, September 20, 2012

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా...శేఖర్ కమ్ముల


దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా మేకింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకున్నాడు. ఇటీవల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన శేఖర్ కమ్ముల అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని స్పష్టం చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...‘నా ఫేవరెట్ హీరో చిరంజీవి. పవన్ కళ్యాణ్ నాకు అందనంత ఎత్తులో ఉన్నారు. పవన్ అంటే నాకు ఎంతో ఇష్టం అతనితో సినిమా చేయాలని ఉంది. నాకు అవకాశం వస్తే ఎప్పటికైనా తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా' అని వెల్లడించారు.

సింహవాహనంపై మురిపించిన శ్రీనివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామి సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం స్వామివారి ఉత్సవర్లయిన మలయప్పకు విశేష సమర్పణ గావించారు. అనంతరం స్వామివారు వాహనమండపానికి వేంచేశారు. అక్కడ వజ్రవైఢూర్యాలతో అలంకార శోభితుడై, పట్టుపీతాంబరాలు ధరించి సింహవాహనాన్ని అధిరోహించారు. మృగరాజైన సింహాన్ని లోబరుచుకుని వాహనం చేసుకున్న ఆనందంతో యోగముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీ«ధులలో రెండు గంటలపాటు సాగిన స్వామివారి ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామికి, దేవేరులు శ్రీదేవి,భూదేవిలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఉత్సవర్లకు విశేష సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటకు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రాష్ట్రంలో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి


డీ జిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పెంచిన ధరలు తగ్గించాలని డిమాంద్ చేస్తూ విపక్షాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. బంద్‌కు మద్దతు తెలుపుతూ విద్యా, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న విపక్షాల నేతలు, కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులను నిలిపివేశారు.
* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.
* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.
* కృష్ణా జిల్లా : జిల్లాలోని కైకలూరులో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రభుత్వ, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.
* వరంగల్ : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్ష నేతలు ఆందోలనలకు దిగాయి. హన్మకొండ, పరకాల బస్టాండ్ దగ్గర టీడీపీ, బీజేపీ, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
* మెదక్ : జిల్లాలో వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
* ఖమ్మం : జిల్లాలోని ఆరు డిపోలో బస్సులు నిలిచిపోయాయి. వైరా రోడ్డులోని పెట్రోల్ బంక్‌పై ఆందోళకారులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
* నల్గొండ : బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు బైఠాయించి నిరసన చేశారు.

Monday, September 17, 2012

ఓయూ ఉద్రిక్తత

                              
ఉస్మానియా యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లేందుకు బయలు దేరగా ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15ను ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటుందో అదే మాదిరిగా తెలంగాణ విమోచన దినాన్ని కూడా అధికారికంగా జరపాలని, జాతీయ జెండాను ఎగురవేయాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. కాగా పోలీసుల కళ్లుగప్పి కొంత మంది ఓయూ విద్యార్థులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని, కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జై తెలంగాణ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. తెలంగాణ శాసనసభ్యులు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. 

సీతమ్మ వాకిట్లో మహేష్,సమంత పెళ్ళి


                                   
చెన్నై శివారు కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి మహేష్,సమంత పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.వెంకటేష్, మహేష్‌బాబు, సమంత, అంజలి కాంబినేషన్‌లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘దిల్' రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు. చలి పులి పంజా విసిరే సమయంలో సందడి చేసేందుకు వెంకటేష్‌, మహేష్‌బాబు సన్నద్ధమవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...''పదహారణాల తెలుగుదనాన్ని ఆవిష్కరించే కుటుంబ కథా చిత్రమిది. ఇటీవలే చెన్నైలో పెళ్లి పాటతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించాం. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో కోటి రూపాయల వ్యయంతో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఓ భారీ సెట్‌ నిర్మించాం. అక్కడ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల్ని త్వరలో చిత్రీకరిస్తాం. ఈ సినిమాలో అయిదు పాటలున్నాయి. ఇప్పటికే మూడింటిని చిత్రీకరించాం. నవంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

శాసనసభలో రగడ తెలంగాణ తీర్మానం కోసం టీఆర్ఎస్ పట్టు


                                         
శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన వెంటనే విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. వాటిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనంటూ విపక్షాల సభ్యులు పట్టుపట్టారు. దీంతో అసెంబ్లీలో రగడ నెలకొని సభ గంటపాటు వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం తిరిగి అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమయింది. విద్యుత్ సమస్యపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒకానొక దశలో సభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. దీంతో సభాపతి నాదెండ్ల మనోహర్ స«భ సజావుగా నడిపేందుకు సహకరించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు వినలేదు. దీంతో సభను మళ్ళీ అరగంటపాటు వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ సజావుగా నడిపే వాతావరణం కనిపించలేదు. విపక్షాలు తాము పట్టిన పట్టు వీడతేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
వాయిదా తీర్మానాలు : విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ, తెలంగాణపై తీర్మానం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఫీ రియంబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, తెలంగాణ విమోచనా దినం అధికారికంగా ప్రకటించాలంటూ బీజేపీ, ఫించన్ చెల్లింపులో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

Thursday, September 13, 2012

చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు

                                                 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను గురువారం ప్రకటించారు. ప్రతిఏటా తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని అన్నారు. తాను ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గంలో చలనం వచ్చిందన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయందని, దేశం బాగుపడాలంటే ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తన నివాసం నుంచి గురువారం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కామన్వెల్త్, 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం, అలాగే రాష్ట్రంలో ఓఎంసీ, స్టాంపుల కుంభకోణం ఇలాంటి అవినీతిపై తాము పోరాటం చేస్తుంటే ఎదురుదాడి చేసి నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. అటు కేంద్రంలో కూడా ఇదే పరిస్థితిలో ఉందని చంద్రబాబు విమర్శించారు.

కొందరు నేతలు రాజకీయాలను స్వార్ధం కోసం వాడుకుని కోట్ల రూపాయలు కూడబెదుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమలాగే మిగతా రాజకీయనాయకులు వారి ఆస్తులను ప్రకటించాలని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పార్టీ పెట్టి పరపతిని కోల్పోయారని అన్నారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబు అవినీతిపై పోరాటం చేస్తునే ఉన్నారని అన్నారు.

భువనేశ్వరి (చంద్రబాబు సతీమణి) నిర్వహిస్తున్న వ్యాపారాలకు ఎక్కడా ప్రభుత్వ భూమి కానీ ఇతర లబ్ది కానీ పొందలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు ఎకరాలు, రెండువేల కోట్ల రూపాయలు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని చెప్పిన వారు నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు.

ఆస్తుల వివరాలు :
తమ కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ : రూ. 35.59 కోట్లు
చంద్రబాబు పేరున ఉన్న ఆస్తి : రూ. 31.97 లక్షలు
1985 నుంచి 1992 మధ్యలో నిర్మించిన ఇల్లు, కారు చంద్రబాబు పేరుమీద ఉన్నాయి.
భువనేశ్వరి పేరుమీద ఉన్న ఆస్తుల విలువ : రూ. 24.57 కోట్లు.
కుమారుడు లోక్‌ష్ పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 6.62 కోట్లు
కోడలు బ్రహ్మణి పేరుమీద ఉన్న ఆస్తి : రూ. 2.09 కోట్లు.
అలాగే అప్పులు కూడా ఉన్నాయని భువనేశ్వరి పేరు మీద అప్పులు : రూ. 12.38 కోట్లు, లోకేష్ నాయుడు పేరు మీద : రూ. 9 లక్షలు అప్పులు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Wednesday, September 12, 2012

బొత్స,చిరు మధ్య ఉప్పు-నిప్పుగా మారిన మాటల


                                  
అధికార కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొదట్లో ఒకే గ్రూపుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స....ఎంపీ చిరంజీవి ఇపుడు ఉప్పు....నిప్పుగా మారారు. వీరి మధ్య ఇపుడు మాటకు మాట నడుస్తోందనడానికి ఈ ఇద్దరు నేతల తాజా కామెంట్సే నిదర్శనం.
గ్రూపు రాజకీయాలకు నిలయమైన అధికార కాంగ్రెస్‌లో సమీకరణాలు పార్టీ నేతలే ఆశ్చర్యపోయేలా మారుతున్నాయి. ఒకే గూటి పక్షులుగా ఉన్న పిసిసి చీఫ్‌ బొత్స... ఎంపీ చిరంజీవి మధ్య ఇపుడు మాటల తూటాలు పేలుతున్నాయి. సిఎం, పిసిసి చీఫ్‌లను మారుస్తారంటూ పార్టీలో ప్రచారం జరగుతున్న నేపధ్యంలో ... బొత్స పనితీరు బాగాలేదంటూ సోనియా వద్ద చిరంజీవి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఉప ఎన్నికల ఓటమిపై పార్టీ నేతలతో మేధోమధనం నిర్వహించాలంటూ ఎంపీ వి.హనుమంతారావు చేసిన డిమాండ్‌ను పిసిసి చీఫ్‌ బొత్స తిరస్కరిస్తే.. చిరంజీవి ఆ సమావేశానికి హాజరయ్యారు. పైగా బొత్స వైఫల్యాన్ని ఎత్తిచూపే వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి సిఎం కిరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు నడుపుతున్న బొత్స కాంగ్రెస్‌లో చిరంజీవి విలీనం అయ్యాక....ఆయనను తన గ్రూపులో కలుపుకున్నారు. గత డిసెంబర్‌లో అవిశ్వాసం సందర్భంగా కూడా చిరంజీవితో అసమ్మతి చిచ్చు రేపి .... తర్వాత దాన్ని తానే చల్లార్చినట్టు కనిపించే డ్రామాను కూడా రక్తికట్టించిన బొత్స దూకుడు ఎక్కువ కాలం చెల్లుబాటు కాలేదు. తనను అడ్డం పెట్టకుని బొత్స అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారని.... అది తనకు ఇబ్బందిగా మారుతోందని గ్రహించిన చిరంజీవి క్రమేణ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ సిండికేట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిఎంకు లేఖ రాసిన చిరంజీవి....సిండికేట్‌ను వెనకుండి నడిపిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలనడంతో ఆయనకు బొత్సకు మధ్య విభేదాలకు బీజం వేసింది. అప్పట్నుంచి చిరంజీవి సిఎం కిరణ్‌కు అనుకూలంగా మారడమే కాకుండా తన ఎమ్మెల్యేలను ఇద్దరు మంత్రులను కూడా సిఎంకు మద్దతిచ్చేలా చేశారు. ఈ పరిణమాలను బొత్స జీర్ణించుకోలేక పోయారు. చిరంజీవి తనకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా తన నాయకత్వాన్ని కూడా ప్రశ్నించడంతో ఆయనపై సెటైర్లు వేశారు. అసమ్మతి రాజకీయాల కారణంగా పిసిసి చీఫ్‌ పదవిని బొత్స త్వరలోనే కోల్పోవాల్సి వస్తుందనేది కాంగ్రెస్‌ నేతల అంచనా. హై కమాండ్‌ ఆశీస్సులుంటేనే గ్రూపు రాజకీయాలతో ప్రయోజనముంటుందని.... లేదంటే ఇబ్బందులు తప్పవంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.

Tuesday, September 11, 2012

నాగార్జున నటన అద్భుతం...చిరంజీవి

                                         
నాగార్జున, రాఘవేందర్రావు కాంబినేషన్లో రూపొందిన మరో భక్తి రస చిత్రం శిరిడి సాయి. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ప్రసాద్‌ ల్యాబ్‌ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... శిరిడి సాయి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం చాలా హృద్యంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశం చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్‌.... చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానన్నారు. శిరిడి సాయిగా నాగార్జున అద్భుతంగా నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు... ఇప్పుడు శిరిడి సాయి చిత్రాలతో నాగార్జున జన్మ ధన్యమైంది. సాయి జీవిత చరిత్రను చదివాను. ఇప్పడు శిరిడి సాయి సినిమా చూస్తుంటే కళ్లకు కట్టినట్టుగా అనిపించింది. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలను రాఘవేంద్రరావు కాకపోతే ఇంతలా రూపుదిద్దుకునేది కాదు. నిర్మాత మహేష్‌రెడ్డి సాయి తత్వాన్ని అందరికీ తెలియ చేయాలని శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించారు’ అని వ్యాఖ్యానించారు. శిరిడి సాయి చిత్ర యూనిట్‌ వెైజాగ్‌ నుంచి విజయ యాత్ర నేడు ప్రారంభించనున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్‌ రెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొంటారు.

బెంగాలీలో ఎన్టీఆర్‌

                                                       
ఎన్టీఆర్‌,సురేంద్రరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఊసరవెల్లి’. కమర్షియల్‌గా సొమ్ములు రాబట్టిన ఉసరవెల్లి చిత్రం ఇప్పుడు బెంగాలీలో రీమేక్‌ అవుతోంది. మిధున్‌ చక్రవర్తి కుమారుడు మిమో ఈ చిత్రంలో  read more

భారత్‌పై న్యూజిలాండ్ విజయం:సిరీస్ కైవసం

       New Zealand's Brendon McCullum and teammate Kane Williamson run between the wickets during their second Twenty20 cricket match against India in Chennai
చెన్నయ్‌లో మంగళవారం అత్యంత ఉత్కంఠంగా జరిగిన రెండవ టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతే భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్రెండన్ మెకల్లమ్ అద్భుత ఆటతీరుతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. తొలి రెండు వికెట్లను 2 పరుగులకే కోల్పోయిన న్యూజిలాండ్‌ను బ్రెండన్ మెకల్లమ్ విలియమ్‌సన్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును ఆదుకున్నారు.read more

Monday, September 10, 2012

కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్

నిజానికి వైఎస్ తదనంతరం పలు సందర్భాల్లో కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవడం, కాంగ్రెస్‌ను బాబు పలువిధాలుగా ఆదుకుంటూ వస్తుండటం బహిరంగ రహస్యమే. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బాబు ససేమిరా అనడం తెలిసిందే. ఆ సందర్భంలోనే ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో ఫోన్లో మాట్లాడారని, రాష్ట్ర సర్కారుకు ఢోకా ఉండదని, ముఖ్యంగా తన వల్ల ఎలాంటి సమస్యా ఉండదని భరోసా ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోదని బాబు హామీ ఇచ్చారని, ఆయన నుంచి ఈ రకమైన మద్దతు చూసి విస్మయానికి లోనైన పటేల్, ‘అవసరమైనప్పుడు మీ మద్దతు తప్పక తీసుకుంటాం’ అని చెప్పారని ఢిల్లీ వర్గాల్లో విన్పించింది. 
అందుకు తగ్గట్టే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ బలం పెరిగాక మాత్రమే బాబు అవిశ్వాసం పెట్టి మమ అన్పించారు. అంతేగాక.. ‘ఇకపై అవిశ్వాసం పెట్టబోం’ అంటూ కరాఖండిగా ప్రకటన కూడా చేశారు! 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా బాబు ఒక రాత్రి ఎస్పీజీ, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో కలిసి ప్రైవేటు వాహనంలో వెళ్లి మరీ కేంద్రంలోని ఓ కీలక మంత్రితో మంతనాలు జరిపారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎమ్మార్ కుంభకోణం నుంచి సాంత్వన చేకూర్చాల్సిందిగా ఆయన్ను బాబు కోరారని కూడా చెప్పుకున్నారు. బాబు గానీ, టీడీపీ గానీ వాటిని ఖండించలేదు కూడా. ‘బాబు వచ్చి నన్ను కలిశారు’ అంటూ కొంతకాలానికే అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం సాక్షాత్తూ లోక్‌సభలోనే ప్రకటించారు! ఇలా వైఎస్ మరణానంతరం రెండున్నరేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న బాబు.. తాజాగా ప్రధాని భేటీలో కూడా ఏదో ‘కీలకాంశం’పైనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

కత్తిలాంటి కైఫ్

                                          
ఇప్పటికే ప్రపంచమంతా నెం.1 శృంగార దేవతగా ఆరాధిస్తున్న కత్రినాకైఫ్‌కు గ్లామర్ మరింత పెంచుకోవాలన్న ఆలోచన వచ్చిందట. ధూమ్-3 చిత్రంలో కొత్త కత్రినాను చూస్తారని చెబుతోంది. ఇప్పటినుంచే అనేక విధాలుగా శరీర కొలతలు మార్చుకునే పనిలో పడిందట. అందరూ తింటున్నట్లుగా తినకుండా పండ్లు, కూరగాయలతోనే లంచ్, డిన్నర్‌లు ముగిస్తోందట. అత్యంత సెక్సీగా కనిపించేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నం ఫలించి, సరికొత్త కత్రినా కనిపిస్తోందని చూసినవాళ్లు చెబుతున్నారు. తాను చేస్తున్న కోర్సు ముగిసేలోపు తన తోటి హీరోయిన్లు కళ్లుకుట్టుకునేలా ఆమె కనిపించనుందట. ఈ విషయాన్ని కత్రినానే ప్రకటించింది. త్వరలో సరికొత్త ఫొటోగ్రాఫ్‌లతో కనిపించి ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తానంటోంది. చూద్దాం.. కొత్త కత్రినా కత్తిలా వుంటుందో లేదో!

నాగార్జున‘శిరిడీ సాయి’యాత్రలు

                                 
సాయి భక్తితత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ‘శిరిడీ సాయి’ చిత్రం సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మితమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ యాత్రలు నేటినుండి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రేక్షకులు సాయి చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటం దృష్ట్యా వారందరినీ కలుసుకోవాలని ఈ యాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలోread more

Sunday, September 9, 2012

పక్కింటోళ్ల కోసమే పెళ్లి చేసుకొంటా!


రెండు రోజుల క్రితం విడుదలైన ‘జులాయి’ యావరేజ్‌ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఇలియానా పెద్ద మైనస్‌ అనే చర్చ జనాల్లో నడుస్తోంది.ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య పెద్దగా కెమిస్ట్రీ పండలేదని టాక్‌. సినిమాలో ఒకానొక సందర్భంలో హీరోయిన్‌ను ఉద్దేశించి అలీ ఇలా అంటాడు ‘కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్‌ అంబాసిడర్‌’లా ఉన్నా వని. ఆ మాటను నిజం చేస్తూ ఇలియానా పూర్తిగా పేషెంట్‌ మాదిరిగా ఉంది.read more