భారీ వర్షాల ప్రభావం రైలుమార్గాలపై తీవ్రంగా పడింది. పలు రైళ్ల రాకపోకలు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. విజయవాడ సమీపంలోని కొండపల్ల్లి- మధిర మధ్య రైల్వేట్రాక్‌పై నీరు నిలవడంతో పలు ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యం కాగా, ప్యాసింజర్ రైళ్లను శనివారం రద్దు చేశారు. గూడూరు-విజయవాడ, కాజీపేట- సికింద్రాబాద్ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12296 పాట్నా - బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, కర్నూలు, డోన్, గుత్తి, ద్రోణాచలం మీదుగా దారి మళ్లించారు.
తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్‌లను తెనాలి- గుంటూరు- నడికుడి- బీబీనగర్ మార్గంలో మళ్లించారు. 57237 కాజీపేట- విజయవాడ , 57238 విజయవాడ-కాజీపేట, 57254 విజయవాడ - భద్రాచలం, 57253 భద్రాచలం- విజయవాడ, 67269 కాజీపేట- దోర్నకల్, 67271 డోర్నకల్- విజయవాడ, 67273 విజయవాడ- గుంటూరు, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
No comments:
Post a Comment