http://apvarthalu.com/

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడి మృతి పట్ల జూ ఎన్టీఆర్ సంతాపం

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడి మృతి పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ ఎంపీలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, సిఎం రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి పార్టీకే కాక దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, రోషన్‌బేగ్, బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అభిషేక్, తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, కార్యవర్గ సభ్యుడు కే గంగరాజు, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసయ్య, కర్ణాటక తెలుగు సమాఖ్య కార్యదర్శి బెల్లం రమణ చౌదరి తదితరులు ఎర్రన్నాయుడుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

No comments: