'దేనికైనారెడీ' సినిమాపై జరుగుతున్న వివాదం చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. సినిమాల్లో తమ వర్గాన్ని హేళనచేసే దృశ్యాల గురించి ఇంతవరకూ పట్టించుకోని బ్రాహ్మణులు ఇకపై వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తమ వర్గం వారిని సమీకరించుకుంటున్నట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా మొదటి టార్గెట్ ఇది. గతంలో 'అదుర్స్' సిన్మాలో బ్రాహ్మణుల్ని కించపరిచినంతగా ఇందులో 5 శాతం కూడా లేదని కొందరు మిత్రులు చెప్పారు. వాస్తవానికి సినిమాల్లో బ్రాహ్మణుల్ని హేళనచేయడం సాధారణమై పోయింది. ఒక కమ్యూనిటీని ఎగతాళి చేయకుండా సిన్మాలు తీయడం మనోళ్ళకి చేతకాదా అని నా అనుమానం. నా చిన్నపుడు అనేకసార్లు చూసిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేసే కామెడీ చాలా నచ్చేది. కానీ ఇప్పుడు గనక చూస్తే వైశ్య కమ్యూనిటీని కించపరిచేవిధంగా వుందనిపిస్తుంది. సినిమాను సినిమాగానే చూడాలని కొందరంటున్నారు... కానీ సినిమా కూడా ఒక మీడియానే...అది కూడా ప్రజలముందే ప్రదర్శితమవుతోంది కదా? బ్రాహ్మణ సంఘాలు నిరసనలకు దిగడం మంచి పరిణామమే.ఇలా వర్గాలుగా విడిపోకుండా అందరూ సంఘటితమై పోరాడితేనే ఏదైనా సాధించగలరు. ఏదిఏమైనా ఒక కమ్యూనిటీని కించపరిచేవిధంగా ఎవరు ప్రవర్తించినా కులమతాల కతీతంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని నా కోరిక... If I am not wrong.
No comments:
Post a Comment