పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశానని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలిచి, మాట్లాడితే రాజీనామాపై పునరాలోచిస్తానని కాంగ్రెసు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. ప్రస్తుతానికి రాజీనామాకే కట్టుబడి ఉన్నాఆయన అన్నారు.
నూజివీడులో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కిస్తూ, పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరించటం బాధాకరమన్నారు.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారా అని అడిగితే, 'ఈ విషయం పత్రికల్లోనే వస్తోంది. చూద్దాం. ఆలోచిద్దాం' అంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి మనస్ఫూర్తిగా ఇష్టంలేకున్నా, పార్టీ సీనియర్‌ల పట్ల చూపుతున్న వివక్ష, వారికి జరుగుతున్న అన్యాయం వల్ల విసిగి వేసారి రాజీనామా చేసినట్లు చెప్పారు.
No comments:
Post a Comment