http://apvarthalu.com/

Wednesday, November 28, 2012

చెయ్యెత్తితే బస్పు ఆగదు..బొత్స నిర్వాకం !


వెనకటికి ఓ కథ ఉంది. ఆ కథలో కుక్క, గాడిద ఉంటాయి. ఓ రోజు కుక్క చేయాల్సిన పని అత్యుత్సాహంతో గాడిద చేస్తుంది. దాని పర్యావసానం గాడిద నడ్డి విరుగుతుంది. కాకాలు పట్టి, అడుగులకు మడుగులొత్తి రాజకీయాల్లో చేరి అమాత్యులైనవారు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో తాజాగా ఆర్టీసీ లో తీసుకుంటున్న నిర్ణయాలు తేల్చిచెబుతున్నాయి. మందు దందా చేసే వారు మంత్రులయితే ఎలా ఉంటుందో తాజాగా బొత్స నిర్ణయం అలాగే ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఇటీవలె ఛార్జీలు పెంచారు. అయినా ఆర్టీసి రూ.4200 కోట్లు అప్పులు ఉంది. నెలకు రూ.100 కోట్లు వడ్డీ చెల్లిస్తుంది. అయినా కార్మికుల జీతాల కోసం ప్రతి నెలా రుణాలు తేవాల్సి వస్తోందట. అందుకే ఈ నష్టాల భర్తీకి మరోసారి ప్రయాణీకుల మీద భారం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రయాణికుడి నుండి అర్ధ రూపాయి నుండి రూపాయి దాకా సర్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సంతకం కూడా చేసేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.  ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది అది ఏంటంటే ఆర్టీసీలో ఫ్లాట్ ఫాం టికెట్ ప్రవేశ పెడతారట. అంటే రైల్వేస్టేషన్లలో మాదిరిగా అన్నమాట. బస్టాండుకు వచ్చిన ప్రతి ప్రయాణికుడి ఈ డబ్బులు వసూలు చేసి ఆయా బస్ స్టేషన్ల నిర్వహణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారట.red more

No comments: