http://apvarthalu.com/

Tuesday, January 22, 2013

వేడెక్కిన 'తెలంగాణ'

తెలంగాణ అంశం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తున్నారని భారీఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ లోపల తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ప్రాంతీయ విద్వేషాలతో పరిస్థితి ఉద్రికత్తతకు దారితీసే ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు ఖరారైనట్లేనని, ఇక ఇతర అంశాలే మాట్లాడవలసి ఉందని కొందరు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ - నదీ జలాల పంపిణీ - హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత - ఆంధ్రలో రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక పాకేజీ ....... అని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమస్యేలేదు - రాష్ట్రం విభజిస్తే రాజీనామా హెచ్చరికలు - తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ - హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం..... ఇలా విభిన్న కథనాలు వినవస్తున్నాయి. దీనికి తోడు ఢిల్లీలో ఏదో జరిగిపోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణ వచ్చేస్తుందని ఆ ప్రాంత నేతలు గతంలో ఎన్నడూలేనంత గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చేసే ప్రయత్నాలన్నీ తమకు అనుకూలంగా జరుగుతున్నట్లు వారు భావిస్తున్నారు. ఇంకేముంది తెలంగాణ ఇచ్చేస్తున్నారని, దానిని ఎలాగైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లారు. వారికి పోటీగా తెలంగాణ నేతలు కూడా మరోమారు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక రాజీనామా హెచ్చరికలు సరేసరి. తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, రాష్ట్రం విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేశారు.red more

No comments: