http://apvarthalu.com/

Thursday, January 31, 2013

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం...టి.కాంగ్రెస్ ఎంపీలు

 తెలంగాణకు మద్దతుగా టి.కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాంగ్రెస్ మాజీ ఎంపీ కే.కేశవరావు నివాసంలో టి.కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నామా లేఖలను ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చామని కేకే తెలిపారు. ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను కేకే ఖండించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. రాజీనామాలపై ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. చాకో ప్రకటన సంతోషకరమే కానీ రాజీనామాలను ఎంపీలు ఉపసంహరించుకోరని ఆయన తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని కేకే తెలిపారు. తమ వెనుక కేవీపీ ఉన్నారనడం పిచ్చిమాటలే అని కేకే కొట్టిపారేశారు.
గతంలో స్పీకర్‌కు రాజీనామాలు అందజేస్తే తిరస్కరించినందువల్లే సోనియాకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజీనామాలపై మధుయాష్కి తమతో విభేదించారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. రాజీనామాలు ఆమోదింకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

No comments: