http://apvarthalu.com/

Thursday, January 24, 2013

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు:బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎక్కువగా నష్టపోయిన వాళ్లం రాయలసీమ వాళ్లం’ అని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసలు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే మీకేమి నొప్పి’ అని ఆయన ఆంధ్రా పెట్టుబడిదారులను ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇవాళ కాకుంటే రేపొస్తది. రెండో గంటకు కాకపోతే మూడో గంటకు వస్తది’ అని అన్నారు. సమైక్య వాదం అన్నవాళ్లు మైదానం పెద్దగా ఉంటే మేపు ఎక్కువగా దొరుకుతదని కోరుకునే వాళ్లే. మాకంటే చిన్న రాష్ట్రం హర్యానా అభివృద్ధి చెందలేదా’ అని నిలదీశారు.

No comments: