http://apvarthalu.com/

Sunday, January 27, 2013

తెలంగాణకు రంగం సిద్దం..నేడో రేపో ప్రకటన ?


- ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన
- ఐదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ రాత్రికో..మరు నాడో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించనుందని విశ్వసనీయ సమాచారం. సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటించగానే ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించగానే ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పాలన కోరతారని తెలుస్తోంది.red more

No comments: