మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీకి నాయక్ చిత్రం దర్శకుడు వివి వినాయక్ ఆదివారం క్షమాపణలు చెప్పారు. గండి బాబ్జీతో తనకు ఇది వరకు ఎలాంటి పరిచయం లేదని, అతనిని కించపర్చాలని చిత్రంలో ఆయన పేరు పెట్టలేదని, ఆయనతో టచ్ కూడా లేదని, ప్రతి నాయకుడి పాత్రధారికి కాకతాళీయంగానే ఆ పేరు పెట్టామని, ఇందుకు ఆయన బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్‌లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.
No comments:
Post a Comment