ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీమాంధ్ర నేతల భేటీ గురువారం సాయంత్రం
వాయిదా పడింది. సమైక్యవాదాన్ని వినిపించడానికి కాంగ్రెసు అధిష్టానం
పెద్దలతో వరుసగా భేటీ అవుతున్న సీమాంధ్ర నాయకులు గురువారం సాయంత్రం రాహుల్
గాంధీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే రాహుల్ గురువారంనాడు సోనియాతో కలిసి
పార్టీ సీనియర్ నాయకులతో తెలంగాణ అంశంపై చర్చలలో పాల్గొనవలసి ఉండడంతో ఈ
భేటీ వాయిదా పడింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని సీమాంధ్ర నేతలు కీలకంగా
భావించారు. దీంతో రాహుల్‌తో సమావేశానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే ఇప్పుడే బాధ్యతలు స్వీకరించడంతో చాలా విషయాలపై దృష్టి పెట్టవలసి
ఉండడంతో రాహుల్ వారికి ఇంకా అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. కాగా,
సీనియర్ నేతలపై తెలంగాణపై సోనియా గాంధీ గురువారం సాయంత్రం కీలక సమావేశం
నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక శాఖ
మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్
పటేల్, ఆంటోనీ పాల్గొన్నారు.
No comments:
Post a Comment