టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో
శుక్రవారం నాటికి 116వరోజుకు చేరుకుంది. కాగా కృష్ణా జిల్లాలో ఐదో రోజు
కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నందిగామ శివారులోని అంబారిపేట నుంచి బాబు
పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,
అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను
తెలుసుకోవడానికి యాత్రను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదని ఆయన
పేర్కొన్నారు. కాలు నొప్పి బాగానే ఉందని, నడుము నొప్పికూడా వస్తుందని,
అయినా యాత్ర కొనసాగించాలని ఉందని అన్నారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబు యాత్రకు మహిళలు, నేతలు, కార్యకర్తలు,
చిన్నారులు స్వాగతం పలుకుతున్నారు. కాలి నొప్పితో బాధపడుతూనే తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఆయన ఎడమకాలు చిటికెన వేలుకి వాపు వచ్చింది. అయినా కుంటుతునే నెమ్మదిగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబును కలిసిన టీడీపీ నేతలు జనవరి 26తో యాత్రను
ముగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర
ముగించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన బాబు యాత్ర ముగించేది లేదని
స్పష్టం చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
No comments:
Post a Comment