http://apvarthalu.com/

Friday, September 7, 2012

'శ్రీదేవి' ప్రత్యామ్నాయంగా తమన్నా!

80లలో జితేంద్ర యాంగ్రీ యంగ్ మ్యాన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అతడి సూపర్ హిట్ సినిమా 'హిమ్మత్ వాలా' ఈ సినిమా అప్పట్లో బీభత్సమైన మాస్ హిట్. ఇదే సినిమా టైమ్ లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో వెలుగొందుతున్న హీరోయిన్ 'శ్రీదేవి'. హిమ్మత్ వాలా సాహసాలకు తోడు,read more

వైఎస్‌ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ

పాదయాత్ర అనుభవాలతో కూడిన వైఎస్‌ పాదయాత్ర డైరీని వైఎస్‌ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు చేతుల మీదుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతీలాల్‌ వోరా ఆవిష్కరించారు. కొన్ని అంశాలతో కూడిన డైరీని read more

Thursday, September 6, 2012

‘ సుడిగాడు ‘చూసిన రజనీకాంత్‌

అల్లరి నరేష్‌ నటించిన సుడిగాడు సాధించిన ఘన విజయం తమిళనాడుకు పాకింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సుడిగాడుని చూసేలా చేసింది.సుడిగాడును చూసేం దుకు చెన్నైలో ఏర్పాట్లు చేయాలని చిత్ర దర్శక నిర్మాతలను ఆయన కోరటంread more

Wednesday, September 5, 2012

కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ !


 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ రానుందా.. అంటే అవుననిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించేందుకు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ఓ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవ త్సరాల, 4 నెలలు పూర్తి అయింది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్ళాలంటే తమకంటూ ప్రత్యేక ఛా నెల్‌ ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఛానెల్స్‌ ద్వారా పార్టీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం సాధ్యం కా దు గనుక, రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసు కుందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో మంత్రు లు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తమ నియోజ కవర్గాల పరిధిలో చేస్తున్న కార్యక్రమాలను ఈ ఛానెల్‌ ద్వారా ప్రజలకు వివరిం చవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల మూసివేసిన ఓ ఛానెల్‌లో భాగస్వామి అయి, తద్వారా ఛానెల్‌ను పేరుమార్చకుండా యధావి ధిగా నిర్వహించాలని బొత్స ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రంగంలో అనుభవం ఉన్న బొత్సకు ఈ ఛానెల్‌ నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఇదిలాఉంటే గతంలో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడి ద్వారా సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్‌ను ప్రారం భించినప్పటికీ, వైఎస్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఓ ప్రత్యేక ఛానెల్‌ అంటూ లేకపోయింది. సీపీఎం తమ పార్టీ తరపున మరో రెండు నెలల్లో ఛానెల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇదిలాఉంటే సీపీఐ కూడా తమకూ ఓ ప్రత్యేక ఛానెల్‌ ఉండాలని యోచిస్తుంది.

ఇదే బాటలో పయనించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీగా ఉండి, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉండికూడా ఏ రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక ఛానెల్‌ లేకపోవడం కాంగ్రెస్‌కు కొంత వెలితిగా ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేరళలో పీసీసీకి ప్రత్యేక ఛానెల్‌ ఉందని, మన రాష్ట్రంలోకూడా ఉండాలని పార్టీ వర్గాలు కోరుతు న్నాయి. మంగళవారం హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరో కొద్దినెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభు త్వం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఈ తరు ణంలో ఛానెల్‌ను ప్రారంభిస్తే స్థాని క సంస్థల ఎన్ని కలకు ముందే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మ రింత పటి ష్ఠంగా తీసుకెళ్ళవచ్చని పార్టీ వర్గాలు అంటు న్నాయి.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు... సబ్సీడీమీద విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రూ.లక్ష వరకు వడ్డీ లేకుండా రుణాలు అందజేయడం వంటి పథకాలను సంక్షిప్త కార్యక్రమాల ద్వారా ప్రసారం చేయాలని పార్టీ యోచిస్తుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా రెండు జతల యూనిఫారాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, వీటితోపాటు కంప్యూటర్‌ విద్య, ముస్లిం విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే, పార్టీ గ్రామస్థాయిలో పటిష్ఠం అవుతుందని పార్టీవర్గాలు అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సహకార, మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స జిల్లాల్లో విరివిగా పర్యటిస్తుంటారు. ఆయా సందర్భాల్లో ఆక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పొల్లుపోకుండా ప్రజలకు చూపిస్తే, ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యా నిస్తున్నాయి.

Tuesday, September 4, 2012

అక్టోబర్‌ 11న ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’

 పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.  చిత్ర విశేషాల్ని నిర్మాత డి.వి.వి.దానయ్యను వెల్లడించారు. ‘పవన్‌కళ్యాణ్‌ గారు పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఆయన అభినయం హైలైట్‌గా ఉంటుంది. పూరి జగన్నాథ్‌గారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, సూపర్‌సాంగ్స్‌తో, థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రూపొందుతోంది. ఈ నెల 31తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో బ్యాలెన్స్‌ రెండు పాటలు చిత్రీకరించడంతో, ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది.

Monday, September 3, 2012

'శ్రీమన్నారాయణ' సక్సెస్‌మీట్‌

నందమూరి బాలకృష్ణ సినిమాఅంటే అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంబినేషన్‌లో విషయంకూడా అందులో ఉంటుంది. ఇటీవలే విడుదలైన 'శ్రీమన్నారాయణ' సినిమా గురించి ఆయన తన మనసులోని మాటను ఆవిష్కరించారు. ఈప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచి విచిత్రమైన కాంబినేషన్‌ అనుకున్నారు. అదే విషయాన్ని బాలకృష్ణ చెప్పారు. ''రవి చావలి నన్ను కలవడానికి పడిన శ్రమను గుర్తించాను. ఓ సందర్భంలో కలిశారు. కథ చెప్పారు. ఆయన చెప్పిన విధానం, ఆయనపై నమ్మకం కల్గింది. దీనికితోడు ఘటికాచలం డైలాగ్స్‌ ఎలా ఉంటాయనే అనుకున్నారు. ఈయన బాలకృష్ణ సినిమాకు రాయగలుగుతాడా? లేదా? అని చాలామందిలో కలిగింది. ఆయన ఈ సినిమాలో గంభీరమైన డైలాగ్స్‌ రాశరు. కొత్త కాంబినేషన్‌. కానీ టాలెంట్‌ ఎక్కడ ఉంటే వారిని ప్రోత్సహించాలని శ్రీమన్నారాయణ సినిమా చేశాను'' అంటూ బాలకృష్ణ వెల్లడించారు. ఆదివారం రాత్రి శ్రీమన్నారాయణ సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ కలిసి కష్టపడిపనిచేశారు. హీరోయిన్లు బాగా నటించారు.. అంటూ... 'చలాకీ చూపుల్తో ఛూ మంత్రం వేశావే...' అంటూ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చిన చక్రి సింహా తర్వాత ఈ చిత్రానికి పని చేశాడని అన్నారు

Saturday, September 1, 2012

బంగారం ధర రోజురోజుకు సరికొత్త రికార్డు

బంగారం రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దూసుకుపోవటంతో పాటు దేశీయంగా స్టాకిస్టులు భారీగా కొనుగోళ్లకు దిగటంతో శనివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరలు 550 రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 31,725 రూపాయలను తాకాయి. ఢిల్లీ బాటలోనే ముంబైలో కూడా 10 గ్రాముల బంగారం ధరలు 520 రూపాయలు పెరిగి 31,400 రూపాయలకు చేరుకోగా కోల్‌కతా, చెన్నైల్లో 540 రూపాయలు వృద్ధి చెంది వరుసగా 31,715 రూపాయలు, 31,575 రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా సాగింది. ఢిల్లీలో కిలో వెండి 2,250 రూపాయలు పెరిగి 59,500 రూపాయల వద్ద స్థిరపడగా ముంబైలో 2,000 రూపాయలు వృద్ధి చెంది 59,200 రూపాయల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగటంతో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయని ట్రేడర్లు తెలిపారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ ఆర్ధిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలకు చేరుకోగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు స్పెయిన్ ప్రభుత్వం ఆమోదం తెలపటం ధరలు పెరగటానికి దోహదపడింది.