http://apvarthalu.com/
ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ రానున్న సందర్భంలో ఈ నెల 7న ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునిచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారని పీడీఎస్‌యూ విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన రాకను నిరసిస్తున్నామని తెలిపారు. ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునివ్వడంతో వీసీ సత్యనారాయణ స్పందించారు. స్నాతకోత్సవం ఓయూ ప్రతిష్టకు సంబంధించిన విషయమని, ఎవరూ నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని కోరారు. స్నాతకోత్సవానికి వచ్చే అధికారుల భద్రతకు సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడామని వీసీ తెలిపారు.

No comments:
Post a Comment