http://apvarthalu.com/

Saturday, February 2, 2013

కిరణ్‌ను దించేందుకు బొత్స టార్గెట్

kiran-kumar-reddy-apvarthalu-comముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని గద్దె దించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుట్ర పన్నారని కాంగ్రెస్ పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం బొత్స కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. పార్టీ నుంచి 9 మంది శానససభ్యులను బహిష్కరించినట్లు బొత్స చేసిన ప్రకటనపై జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సృష్టించేలా బొత్స వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంఖ్యా బలం లేకుండా పరిపాలన ఎలా కొనసాగిస్తారని జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎం కుర్చీ కోసమే తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బొత్స బహిష్కరించారని, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారని ఆయన నిలదీశారు.red more

No comments: