http://apvarthalu.com/

Tuesday, February 5, 2013

'ఆథార్' గడువుపై కేంద్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కులుస్తూ బిజి బిజీగా ఉన్నప్పటికీ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వంట గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ అనుసంధానం మరో రెండు నెలల వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాలో చూశానని, ప్రజలు ఆధార్ కోసం ఇబ్బందులు పడవద్దని ఆయన కోరారు. త్వరలో హైదరాబాద్‌లో మరో రెండు వందల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు.ఫిబ్రవరి 15వ తేదీలోపు ఆధార్ కార్డును సమర్పించకపోతే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేది లేదంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేసిన ప్రభుత్వం.. ఆధార్ కార్డుల జారీకి మాత్రం సరైన చర్యలు చేపట్టలేదు. చాలినన్ని నమోదు కేంద్రాల్లేవు, ఉన్న కేంద్రాలకు సరిపడా సిబ్బందీ లేరు. కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. దరఖాస్తులను అందుబాటులో ఉంచలేదు. కార్డుల జారీకి పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కార్డులు తీసుకోవడానికి వేల సంఖ్యలో జనం వస్తుండడంతో ఆధార్ వివరాల నమోదు కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. చివరికి జనం విసిగి వేసారి రోడ్డెక్కుతున్నారు.

No comments: