http://apvarthalu.com/

Wednesday, February 27, 2013

సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారింది: కోదండరాం

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్న కోదండరాం.. తాజాగా ఓ సమావేశంలో బుధవారం పాల్గొన్న కొదండరాం సమైక్య రాష్ట్రమే ఉగ్రవాదులకు అడ్డాగా మారిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినందున ఉమ్మడి పాలన విఫలమైనట్లుందన్నారు. 60 ఏండ్లపాటు ఉమ్మడిపాలనలతో కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువగా అధికారంలో ఉందని, వీటిని ఆపలేకపోయిన ముఖ్యమంత్రి కిరణ్, మంత్రివర్గ సభ్యుడైన టీజీ వెంకటేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.red more

Thursday, February 21, 2013

హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు: 20 మంది మృతి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.red more

హైదరాబాద్ బాంబు పేలుళ్లు ఫోటోలు







Sunday, February 17, 2013

దేశంలో అవినీతిపై నా పోరాటం:అన్నా హజారే

హైదరాబాద్ లో బహిరంగ సభలో అన్నా హజారే మాట్లాడుతూ.. దేశం కోసం నా జీవితం అంకితం చేస్తానని అన్నారు. ప్రాణమున్నంత వరకూ జన్‌లోక్‌పాల్ కోసం పోరాడుతూనే ఉంటానని సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సృష్టం చేశారు. సికింద్రాబాద్ వెస్లీ కళాశాల మైదానంలో జనతంత్రమోర్చా ఆధ్వర్యలంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హజారే పాల్గొని ప్రసంగించారు. కోటీశ్వరులు కూడా పొందలేని ఆనందాన్ని ప్రజా సేవద్వారా పొందుతున్నానని, ప్రజా సేవలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరుకదన్నారు. గ్రామాల్లో సాగు నీరు కనీస అవసరాలేవి అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.red more

హరిప్రియ ఫొటోస్