Saturday, February 16, 2013
జైలు నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విడుదల
ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం సాయంత్రం 5.11 గంటలకు బెయిల్‌పై బయటకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ ఓవైసీ ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టులో ఏడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో శుక్రవారం 437 సెక్షన్ కింద ఆయన బెయిల్ పొందారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వెంకటేశ్వరరెడ్డి బెయిల్ మంజూరు చేశారు. ఎంఐఎం మద్దతుదారులు శనివారం జైలు ప్రాంతంలో స్వీట్లు పంచిపెట్టి టపాసులు కాల్చారు. ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, అక్బరుద్దీన్ వ్యక్తిగత వైద్యుడు మజారుద్దీన్ అలీఖాన్, ఎంఎల్‌సీ అల్తాప్ హైదర్ రజీ, ఎంఐఎం జిల్లా నాయకుడు సిరాజ్‌ఖాద్రీ, పట్టణా«ధ్యక్షుడు ఫారూఖ్ అక్బరుద్దీన్ విడుదలయ్యే వరకు జైలు వద్దే ఉన్నారు. అక్బరుద్దీన్ విడుదల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ కె.వి.కిషన్‌రావు ఆధ్వర్యంలో డీఎస్పీ కె.ఎం.మహేశ్వరరాజు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూఆర్‌టీ(క్విక్ రియాక్షన్ టీం) బృందాలను రంగంలోకి దింపారు. రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. అవసరమున్న చోట బారికేడ్లు పెట్టారు.
Monday, February 11, 2013
Saturday, February 9, 2013
14న ప్రేమికులు జంటగా కనిపిస్తే పెళ్లిళ్లే:వీహెచ్‌పీ
భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తున్న ఫిబ్రవరి 14 (ప్రేమికులరోజు)న
ప్రేమికులు పార్కులు, పబ్బులు, హోటల్స్, రిసార్ట్స్‌లో జంటగా కనిపిస్తే
వారికి పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్‌దళ్, విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించాయి.
విదేశీ సంస్కృతి అయిన వాలెంటైన్స్ డేను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్
చేశాయి.red more
Friday, February 8, 2013
Wednesday, February 6, 2013
రేపు ఓయూ బంద్
http://apvarthalu.com/
ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ రానున్న సందర్భంలో ఈ నెల 7న ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునిచ్చింది. తెలంగాణకు వ్యతిరేకంగా గవర్నర్ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారని పీడీఎస్‌యూ విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన రాకను నిరసిస్తున్నామని తెలిపారు. ఓయూ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపునివ్వడంతో వీసీ సత్యనారాయణ స్పందించారు. స్నాతకోత్సవం ఓయూ ప్రతిష్టకు సంబంధించిన విషయమని, ఎవరూ నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని కోరారు. స్నాతకోత్సవానికి వచ్చే అధికారుల భద్రతకు సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడామని వీసీ తెలిపారు.

జూ ఎన్టీఆర్‌కు పొగరెక్కువ...కాజల్ సంచలన ప్రకటన
http://apvarthalu.com/
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు పొగరు ఎక్కువే అంటూ సంచలన ప్రకటన చేసింది హీరోయిన్ కాజల్. ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... ‘నేను ఇష్టపడే తెలుగు హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. అతడు మంచి నటుడే కాదు నిజాయితీ పరుడు. అదే విధంగా అతనికి పొగరు కాస్త ఎక్కువే. అహం భావం అనేది నిజాయితీలో ఓ భాగం. అందుకే అతనంటే నాకు ఇప్పటికీ ఇష్టం' అని వ్యాఖ్యానించింది కాజల్. మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కాజల్ పై విధంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా తమిళంలో విజయ్ తన ఫేవరెట్‌గా పేర్కొంది. ఇంకా పలు విషయాలను వెల్లడిస్తూ తకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు పరిశ్రమ అంటేనే ఇష్టమని, ఇక్కడ హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ తమిళ పరిశ్రమలో హీరోకి ఉన్నంత రెస్పెక్ట్ హీరోయిన్‌కి ఉండదు అని చెప్పుకొచ్చింది కాజల్.

Subscribe to:
Posts (Atom)