http://apvarthalu.com/

Monday, December 2, 2013

సోనియాకు చంద్రబాబు శుభాకాంక్షలు

బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 (18వ స్థానం)ను వెనకేసి మరీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 12వ స్థానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇరవైమందితో ‘హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్’ వెబ్ సైట్ ధనవంతుల జాబితా రూపొందించింది. ఈ సర్వే ప్రకారం సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ (16) కూడా సోనియా కన్నా వెనకబడ్డారు. 12వేల కోట్ల రూపాయల సంపద (2 బిలియన్ల అమెరికన్ డాలర్లు) సోనియాగాంధీ వద్ద ఉందట.read more

Sunday, December 1, 2013

పురంధరేశ్వరి...అన్న బిడ్డవేనా...?

మీరు బాగానే ఉంటార్లెండి. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి. అంతకన్నా ముందు మీరు దేశంలోనే చాలా గుర్తింపు పొందిన మహిళా నేత. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆజ్ఞానుసారం నడుచుకునే క్రమశిక్షణ కలిగిన నేత. ఇక మీకేం సమస్యలుంటాయి. సమస్యలనేవి ఉంటే మాలాంటి వాళ్లకి ఉంటాయిగానీ... అయినా మీరు పెద్ద పెద్ద వేదికలెక్కి, అంతర్జాతీయ సదస్సులకు హాజరై, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేసి ప్రపంచం దృష్టిలో మీరేదో పెద్ద మేధావి కింద లెక్కించబడేసి, గుర్తింపు పొందుతున్నారు. కానీ వీటన్నింటికన్నా ముందు మీకు అతిముఖ్యమైన, గొప్పదైన, మీజీవితానికి చిరస్థాయిగా మీతో ఉండే గుర్తింపు ఒకటుంది. అదేమిటో తెలుసా... స్వర్గీయ ఎన్టీరామారావు కుమార్తె. ఆయన కుమార్తెగానే ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని గుర్తిస్తున్నారు. ఆ ఒక్క ‘డిగ్రీ’ తీసి పక్కనపెడితే ప్రజల దృష్టిలో మీవిలువ పూచికపుల్ల కంటె ఎక్కువ ఎంతమాత్రమూ కాదనే సత్యం తమకు బాగా తెలుసు. రామారావులాంటి గొప్ప వ్యక్తి... తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించి పార్టీపెట్టి అప్పట్లో దేశం మొత్తాన్ని శాసించే కాంగ్రెస్‌ పార్టీ వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టించాడు. పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీని ఢీకొనగలిగే సత్తావున్న తొలి ప్రాంతీయ పార్టీగా ఆయన పెట్టిన పార్టీ నిలిచింది. ఇలా తెలుగువారికోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. కానీ మీరు ఏం చేస్తున్నారు...? రామారావు తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని మనసారా కోరుకున్నారు. ఆయన ఏది చెప్పినా ఒకే మాటగా ఉండేది. కానీ మీరు మాత్రం తెలుగువారిని ముక్కలు చేయడానికి మీ శాయశక్తులా కృషి చేస్తున్నారు. మీవంతు చేయగలిగినంతా చేస్తున్నారు. పైగా ప్రతిసారీ ఒకదానికి ఒకటి పొంతనలేకుండా స్టేట్‌మెంట్లు ఇస్తూ, మీ వాదనకు ‘సమైక్య’వాదం మసిపూసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తమరు తండ్రిగారు అనగా, తెలుగుజాతికి అన్న అయిన తారకరాముని జీవితంలో ఎన్నడూ జనాన్ని వంచించడం అనే పనిచేసి ఎరగరు. అయితే మీకు ఆ బుద్ధి అంత సునాయాసంగా ఎలా అబ్బినదో మాత్రం అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయండి, అప్పుడు రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంటుందని ప్రజలు మిమ్మల్ని కోరినప్పుడు మీరేమన్నారు... ‘మేం పదవుల్లో ఉంటేనే అప్రోచ్‌ ఉంటుంది. అప్రోచ్‌ ఉంటేనే మన డిమాండ్లను సాధించుకోవచ్చు’ అన్నావు. కానీ ఇప్పటిదాకా మీరు పదవిలో ఉండి ఏం అప్రోచ్‌ సాధించారో ప్రజలకు అర్ధం కావడంలేదు. మళ్లీ మరోసారి రాష్ట్రం ముక్కలు కావడం ఇక ఆగదు, అలాంటప్పుడు మనకు కావాల్సిన వాటిని డిమాండ్‌ చేసి రాబట్టుకుందాం... అంటూ మాట్లాడారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన వ్యాఖ్యలను చేస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. పైకి మాత్రం మేమంతా కూడా సమైక్యంగా ఉండాలనే మనసులో కోరుకుంటున్నాం... కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడచుకోవాలి, కాబట్టి ఏం చేయలేకున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా కేవలం మీ మంత్రి పదవిని కాపాడుకోవడానికి, మీ రాజకీయ లబ్దికోసమే చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కటిమాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇప్పుడు మీ స్వార్థం కోసం మీ చిత్తం వచ్చినట్టుగా ప్రవర్తించినా, తర్వాత కాలంలో మీకున్న ఆ ‘గొప్ప డిగ్రీ’ని కూడా పక్కనపెట్టి ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు. ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడుతూ ప్రజల్ని మోసం చేస్తున్న విషయాన్ని వారుకూడా గమనిస్తున్నారు. దీనికి బదులు చేయాలని కూడా ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఏ అధిష్టానం మీమ్మల్ని కాపాడదనే విషయాన్ని మీరు గుర్తిస్తే మంచిది.






























































Thursday, November 28, 2013

ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న న్యూస్ ఛాన‌ళ్లు….!



ఇప్పటికే రెండు ప‌దుల సంఖ్య దాటిపోయింది తెలుగులో ఛాన‌ళ్ల నెంబ‌ర్‌. ఇంకా మ‌రిన్ని ఛాన‌ళ్లు రానున్నాయ‌నే ప్రచారం గుబులు పుట్టిస్తోంది. అతి స‌ర్వత్ర వ‌ర్జయేత్ అంటారు. ఇప్పుడు ఈ సూక్తి న్యూస్ ఛాన‌ళ్ల విష‌యంలో నిరూపిత‌మైంది.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన న్యూస్ ఛాన‌ళ్లు, ఇప్పుడు మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తున్నాయి. టీవీ9, టీవీ5, ఈటీవీ2,ఎన్ టీవీ, పాక్షికంగా సాక్షి త‌ప్ప మిగ‌తావ‌న్నీ న‌ష్టాల బాట‌లో ఉన్నాయ‌నే మాటే వినిపిస్తోంది. ఉన్న మార్కెట్ ప‌ల్చబ‌డిపోవ‌డంతో, ఆదాయం బాగా త‌గ్గింది. ఇప్పుడు మ‌రిన్ని ఛాన‌ళ్లు వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.
ఉన్నవి కాక తుల‌సి ఛాన‌ల్ పైప్‌లైన్‌లో ఉంది. అటు ఎక్స్‌ప్రెస్ న్యూస్ దూసుకొచ్చేందుకు సిద్ధమౌతోంది. రాజ్ న్యూస్ వేగం పెంచేందుకు రెడీ అవుతోంది. దీనికితోడు ఒక ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఒక మ్యూజిక్ ఛాన‌ళ్ని కూడా రాజ్ లాంచ్ చేయాల‌నుకుంటోంది. అటు 6టీవీ డిసెంబ‌ర్లో పూర్తి స్థాయి ప్రసారాల‌కు సిద్ధమౌతోంది. ఆర్వీఎస్, ఏపీ 9 లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.
స్టార్ 9 టీవీ పేరుతో సెటిలైట్ చ్యానెల్ మరోటి రాబోతుంది. దీని లోగో మంగళవారం లాంచ్ చేశారు. ఇకపోతే బీసీ పేపర్గా ముద్రవేసుకున్నసూర్య పత్రిక కూడా సెటిలైట్ టీవీ రంగంలోకి సూర్య9 పేరుతో భారీ లాంచింగ్ కి ఏర్పాటులు చేసుకుంటుంది. విశ్రాంత ఐజీ నేతృత్వంలో మరో సెటిలైట్ చ్యానెల్ తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతునాయని సమాచారం. ఇవన్ని 2014 ఎన్నికలను తమ లాంచింగ్ ప్యాడ్గా వాడుకోవాలని చూస్తున్నవే. ఇప్పటికే మార్కెట్లోకి రావలసిన టీవీ99 సన్నాహా కార్యక్రమాలు ముగించికుని ఎన్నికలముందే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా స్వాతి న్యూస్ పేరుతో వ్యాన్లు తిరుగుతున్నాయి. రిక్రూట్‌మెంట్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అటు బ్రేకింగ్ న్యూస్ అనే ఛాన‌ల్ కూడా మొద‌లౌతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జీ 24 గంట‌లు మూసుకోగా, మ‌హా న్యూస్, హెచ్ఎంటీవీలు ముక్కుతూ మూల్గుతూ న‌డుస్తున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ఛాన‌ళ్లు వ‌స్తే ప‌రిస్థితేంట‌నేది ఊహించుకోవ‌డానికి భ‌య‌మేస్తోంది.
పుట్టగొడుగుల్లా ఛాన‌ళ్లు పుట్టుకొస్తుంటే, జ‌ర్నలిస్టుల జీవితాలు బాగుప‌డ‌తాయ‌నుకోవాలా లేక మ‌రింత సంక్షోభంలో ప‌డ‌తాయ‌ని బాధ‌ప‌డాలో అర్ధంకాని ప‌రిస్థితి.

Wednesday, November 27, 2013

ప్రేమికుల్లారా జాగ్రత్త!

ఒంటరిగా ఉన్న ప్రేమికులపై సైనికుల దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచార యత్నం

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై  కానిస్టేబుల్ దాడి ... యువకుడిని తరిమివేసి , యువతిపై అత్యాచారం

ఒక ఘటన హైదరాబాద్ లో జరగగా, మరొకటి ఒంగోలులో జరిగింది .
ఈ రెండు ఘటనల నుంచి ప్రేమికులు నేర్చుకోవాల్సిన పాటాలు ఉన్నాయి . తీసుకోవాల్సిన  జాగ్రత్తలు ఉన్నాయి.



1. నిర్జన ప్రేదేశాలకు వెళ్ళకుండా ఉండాలి .

2. ఒకవేళ వెళితే ఫ్రిండ్స్ కు చెప్పాలి . ఎక్కడికి వెళుతున్నది ?   ఎప్పుడు వెళ్ళేది? తిరిగి వచ్చే సమయం తెలియజేయాలి .

3. ఈ మధ్య కాలంలో వారిని ఫోన్ కాని, మెసేజ్ చేస్తుండ మనాలి .

4. ఎవరు(పోలీసులు) వచ్చినా భయపడకూడదు.  ఎవరిని నమ్మకూడదు .

5. విపత్కర పరిస్థితి  ఎదురైనప్పుడు  స్నేహితులకు ఫోన్ చేయాలి .

6. ఒకరిని విడిచి, ఒకరు వెళ్ళకూడదు .

7. ఏ సమస్య అయినా కలిసి ఎదుర్కోవాలి .

8. అమ్మాయిలు ముఖ్యంగా  స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి . కారం పొడి, మిరియాల పొడి, చిన్న కత్తి దగ్గర ఉంచుకోవాలి .

9. ప్రేమించు కోవడం తప్పుకాదు ... భయపడొద్దు. ఎవరైనా బెదిరిస్తే 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

10. ఈ ఘటనలే కాదు చాలా చోట్ల రాత్రిపూట నే అఘాయిత్యాలు జరిగాయి . అందుకే ప్రేమికులారా రాత్రి పుట కలవక పోవడమే మంచిది. read more

Friday, November 22, 2013

శింబు గురించి హన్సికకూ తెలిసిపోయింది.

హీరోయిన్లను లైన్లో పెట్టడం.. కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాక వారికి చుక్కలు చూపించడం.. ఆపై విడిపోవడం.. ఇదీ తమిళ హీరో శింబుకు అలవాటైన వ్యవహారం. నయనతారతో అతని ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఐతే ఓ దశలో శింబుతో చెడి.. అతనికి దూరమైంది నయన్. ఈ కథ ముగిసిన చాలా రోజులకు మరో హాట్ హీరోయిన్ ను లైన్లో పెట్టాడు శింబు. read more

Sunday, November 10, 2013

రాయల తెలంగాణ బిల్లు… సమైక్యానికి సాకు

రాయల తెలంగాణ బిల్లు కనుక ప్రవేశపెడితే… సీమాంధ్రలో తెలంగాణ బిల్లుకు మద్దతు పెరిగి ఎక్కడ అసెంబ్లీ ఆమోదం పొందుతుందో అని కొందరు సీమాంధ్రులు భయపడుతున్నారు. వారికి ఆ భయం అవసరం లేదు. రాయలసీమ విడిపోదు, మజ్లిస్ పాతుకుపోతు. దీనికి ప్రధాన కారణాలు రెండు. రాయల తెలంగాణ బిల్లుకు అనంతపురం నేతలు మద్దతు పలుకుతారేమో గానీ, తెలంగాణ కావాలన్న టీఆర్ఎస్ మాత్రం మద్దతు పలకదు. ఒకవేళ ఆ పార్టీ కనుక దీనికి మద్దతు పలికితే…READ MORE