ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కులుస్తూ బిజి బిజీగా ఉన్నప్పటికీ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ వంట గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ అనుసంధానం మరో రెండు నెలల వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియాలో చూశానని, ప్రజలు ఆధార్ కోసం ఇబ్బందులు పడవద్దని ఆయన కోరారు. త్వరలో హైదరాబాద్‌లో మరో రెండు వందల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు.ఫిబ్రవరి 15వ తేదీలోపు ఆధార్ కార్డును సమర్పించకపోతే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేది లేదంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేసిన ప్రభుత్వం.. ఆధార్ కార్డుల జారీకి మాత్రం సరైన చర్యలు చేపట్టలేదు. చాలినన్ని నమోదు కేంద్రాల్లేవు, ఉన్న కేంద్రాలకు సరిపడా సిబ్బందీ లేరు. కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. దరఖాస్తులను అందుబాటులో ఉంచలేదు. కార్డుల జారీకి పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కార్డులు తీసుకోవడానికి వేల సంఖ్యలో జనం వస్తుండడంతో ఆధార్ వివరాల నమోదు కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. చివరికి జనం విసిగి వేసారి రోడ్డెక్కుతున్నారు.
Tuesday, February 5, 2013
Monday, February 4, 2013
షర్మిల,ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్తులపై విచారణకు విహెచ్ డిమాండ్
http://apvarthalu.com/
జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల ఆస్తులపై విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నేతలు కనువిప్పు యాత్ర చేస్తే బాగుంటుందని హనుమంత రావు సోమవారం సూచించారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయ అభ్యర్థులను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఊగిసలాటలో ఉన్న అభ్యర్థుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని బతికించుకునే బాధ్యత కార్యకర్తల పైనే ఉందన్నారు. పార్టీ జెండాలను మోసేవాళ్లకు అందలం ఎక్కించాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వారిని తప్పించాలని విహెచ్ హితవు పలికారు.

Sunday, February 3, 2013
Saturday, February 2, 2013
కిరణ్‌ను దించేందుకు బొత్స టార్గెట్
ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌రెడ్డిని గద్దె దించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ కుట్ర పన్నారని కాంగ్రెస్ పెడన శాసనసభ్యుడు జోగి రమేష్
ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం బొత్స కాంగ్రెస్ పార్టీలో చిచ్చు
పెడుతున్నారని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆయన
మండిపడ్డారు. పార్టీ నుంచి 9 మంది శానససభ్యులను బహిష్కరించినట్లు బొత్స
చేసిన ప్రకటనపై జోగి రమేష్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా
ధ్వజమెత్తారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు
తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సృష్టించేలా బొత్స
వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంఖ్యా బలం లేకుండా
పరిపాలన ఎలా కొనసాగిస్తారని జోగి రమేష్ ప్రశ్నించారు. సీఎం కుర్చీ కోసమే
తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బొత్స బహిష్కరించారని, షోకాజ్ నోటీసులు
ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారని ఆయన నిలదీశారు.red more
Subscribe to:
Posts (Atom)