Friday, February 1, 2013
మధ్యంతర ఎన్నికలకు దమ్ముందా : అంబటి రాంబాబు
సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్నవారికి వైఎస్ఆర్
సీపీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు
రావాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.
మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుస్తామని అంబటి వ్యాఖ్యానించారు.red more
Thursday, January 31, 2013
రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం...టి.కాంగ్రెస్ ఎంపీలు
తెలంగాణకు మద్దతుగా టి.కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం ఉదయం కాంగ్రెస్ మాజీ ఎంపీ కే.కేశవరావు నివాసంలో టి.కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నామా లేఖలను ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చామని కేకే తెలిపారు. ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను కేకే ఖండించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. రాజీనామాలపై ఎంపీ మధుయాష్కి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. చాకో ప్రకటన సంతోషకరమే కానీ రాజీనామాలను ఎంపీలు ఉపసంహరించుకోరని ఆయన తెలిపారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని కేకే తెలిపారు. తమ వెనుక కేవీపీ ఉన్నారనడం పిచ్చిమాటలే అని కేకే కొట్టిపారేశారు.
గతంలో స్పీకర్‌కు రాజీనామాలు అందజేస్తే తిరస్కరించినందువల్లే సోనియాకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజీనామాలపై మధుయాష్కి తమతో విభేదించారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. రాజీనామాలు ఆమోదింకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
గతంలో స్పీకర్‌కు రాజీనామాలు అందజేస్తే తిరస్కరించినందువల్లే సోనియాకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజీనామాలపై మధుయాష్కి తమతో విభేదించారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. రాజీనామాలు ఆమోదింకపోతే బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.
Sunday, January 27, 2013
తెలంగాణకు రంగం సిద్దం..నేడో రేపో ప్రకటన ?
- ఐదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ రాత్రికో..మరు నాడో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించనుందని విశ్వసనీయ సమాచారం. సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటించగానే ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించగానే ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పాలన కోరతారని తెలుస్తోంది.red more
Friday, January 25, 2013
కాలు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు
టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో
శుక్రవారం నాటికి 116వరోజుకు చేరుకుంది. కాగా కృష్ణా జిల్లాలో ఐదో రోజు
కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నందిగామ శివారులోని అంబారిపేట నుంచి బాబు
పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,
అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను
తెలుసుకోవడానికి యాత్రను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదని ఆయన
పేర్కొన్నారు. కాలు నొప్పి బాగానే ఉందని, నడుము నొప్పికూడా వస్తుందని,
అయినా యాత్ర కొనసాగించాలని ఉందని అన్నారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబు యాత్రకు మహిళలు, నేతలు, కార్యకర్తలు,
చిన్నారులు స్వాగతం పలుకుతున్నారు. కాలి నొప్పితో బాధపడుతూనే తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఆయన ఎడమకాలు చిటికెన వేలుకి వాపు వచ్చింది. అయినా కుంటుతునే నెమ్మదిగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబును కలిసిన టీడీపీ నేతలు జనవరి 26తో యాత్రను
ముగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర
ముగించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన బాబు యాత్ర ముగించేది లేదని
స్పష్టం చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
Subscribe to:
Posts (Atom)