Thursday, January 31, 2013
Sunday, January 27, 2013
తెలంగాణకు రంగం సిద్దం..నేడో రేపో ప్రకటన ?
- ఐదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ రాత్రికో..మరు నాడో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించనుందని విశ్వసనీయ సమాచారం. సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణ ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటించగానే ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించగానే ఆయన గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పాలన కోరతారని తెలుస్తోంది.red more
Friday, January 25, 2013
కాలు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు
టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో
శుక్రవారం నాటికి 116వరోజుకు చేరుకుంది. కాగా కృష్ణా జిల్లాలో ఐదో రోజు
కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నందిగామ శివారులోని అంబారిపేట నుంచి బాబు
పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,
అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను
తెలుసుకోవడానికి యాత్రను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదని ఆయన
పేర్కొన్నారు. కాలు నొప్పి బాగానే ఉందని, నడుము నొప్పికూడా వస్తుందని,
అయినా యాత్ర కొనసాగించాలని ఉందని అన్నారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబు యాత్రకు మహిళలు, నేతలు, కార్యకర్తలు,
చిన్నారులు స్వాగతం పలుకుతున్నారు. కాలి నొప్పితో బాధపడుతూనే తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఆయన ఎడమకాలు చిటికెన వేలుకి వాపు వచ్చింది. అయినా కుంటుతునే నెమ్మదిగా
పాదయాత్ర చేస్తున్నారు. బాబును కలిసిన టీడీపీ నేతలు జనవరి 26తో యాత్రను
ముగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర
ముగించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన బాబు యాత్ర ముగించేది లేదని
స్పష్టం చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
గురువారం కుంటుతూనే పాదయాత్ర పూర్తి చేశారు.
పద్మ అవార్డులు ప్రకటన
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సినీ నిర్మాత
డి.రామానాయుడుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి
పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి.
80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత
రామానాయుడు దేశంలోనే అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించారు. డి రామానాయుడు –
పద్మ భూషణ్, ఎస్ జానకి – పద్మ భూషణ్, మెరీకామ్ – పద్మ భూషణ్ , డా. రాధిక –
పద్మశ్రీ, సురభి బాబ్జి – పద్మశ్రీ, ఎం రామకృష్ణంరాజు – పద్మశ్రీ, జి
అంజయ్య – పద్మశ్రీ, జయరామన్ గౌరిశంకర్ – పద్మశ్రీ, డా. చిట్టా వెంకటసుందరం –
పద్మశ్రీ, శ్రీదేవి – పద్మశ్రీ, బాపు – పద్మశ్రీ, రాహుల్ ద్రవిడ్‌లకు
పద్మశ్రీ, షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు
పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి.red more
Thursday, January 24, 2013
Subscribe to:
Posts (Atom)