http://apvarthalu.com/

Friday, January 25, 2013

దీక్ష సెత్ ఫోటోలు








పద్మ అవార్డులు ప్రకటన

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా నలుగురికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కగా, 24 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. 80 మందికి పద్మశ్రీ అవార్డుల దక్కాయి.రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు దేశంలోనే అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించారు. డి రామానాయుడు – పద్మ భూషణ్, ఎస్ జానకి – పద్మ భూషణ్, మెరీకామ్ – పద్మ భూషణ్ , డా. రాధిక – పద్మశ్రీ, సురభి బాబ్జి – పద్మశ్రీ, ఎం రామకృష్ణంరాజు – పద్మశ్రీ, జి అంజయ్య – పద్మశ్రీ, జయరామన్ గౌరిశంకర్ – పద్మశ్రీ, డా. చిట్టా వెంకటసుందరం – పద్మశ్రీ, శ్రీదేవి – పద్మశ్రీ, బాపు – పద్మశ్రీ, రాహుల్ ద్రవిడ్‌లకు పద్మశ్రీ, షర్మిలా ఠాగూర్, రాజేష్ ఖన్నా, జస్పాల్‌బట్టీ, ఆది గోద్రెజ్‌లకు పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి.red more

Thursday, January 24, 2013

శ్రియ హాట్ ఫొటోస్





మమత మోహన్ దాస్ ,కాజల్ హాట్ ఫొటోస్












తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు:బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎక్కువగా నష్టపోయిన వాళ్లం రాయలసీమ వాళ్లం’ అని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసలు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే మీకేమి నొప్పి’ అని ఆయన ఆంధ్రా పెట్టుబడిదారులను ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇవాళ కాకుంటే రేపొస్తది. రెండో గంటకు కాకపోతే మూడో గంటకు వస్తది’ అని అన్నారు. సమైక్య వాదం అన్నవాళ్లు మైదానం పెద్దగా ఉంటే మేపు ఎక్కువగా దొరుకుతదని కోరుకునే వాళ్లే. మాకంటే చిన్న రాష్ట్రం హర్యానా అభివృద్ధి చెందలేదా’ అని నిలదీశారు.

త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాని

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల, కార్యకర్తల ఆకాంక్షలు, వారి కోరిక మేరకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానినైన తాను ఆయన కుటుంబంపై జరుగుతున్న వేధింపులకు కలత చెందానని అన్నారు. గురువారం నాని చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని పార్టీలో చేరడానికి తన సంసిద్ధతను తెలిపారు. జగన్‌తో ములాఖత్ అనంతరం జైలు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి జగన్‌ను జైల్లో పెట్టడం బాధాకరమని, తమపై జరుగుతున్న వేధింపులను చాటి చెప్పడానికి ఏనాడూ బయటకు రాని వైఎస్ సతీమణి, ఆయన కుమార్తె రోడ్లెక్కడం తనకు ఆవేదన కలిగించిందని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న తరుణంలో ఇంకా జగన్ వైపు నిలబడక పోవడం ఏ మాత్రం ధర్మం కాదని నియోజకవర్గ ప్రజలు తనకు చెప్పారని దాని దరిమిలా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

రాహుల్‌తో సీమాంధ్ర నేతల భేటీ వాయిదా

ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీమాంధ్ర నేతల భేటీ గురువారం సాయంత్రం వాయిదా పడింది. సమైక్యవాదాన్ని వినిపించడానికి కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్న సీమాంధ్ర నాయకులు గురువారం సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే రాహుల్ గురువారంనాడు సోనియాతో కలిసి పార్టీ సీనియర్ నాయకులతో తెలంగాణ అంశంపై చర్చలలో పాల్గొనవలసి ఉండడంతో ఈ భేటీ వాయిదా పడింది. రాహుల్ గాంధీతో సమావేశాన్ని సీమాంధ్ర నేతలు కీలకంగా భావించారు. దీంతో రాహుల్‌తో సమావేశానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పుడే బాధ్యతలు స్వీకరించడంతో చాలా విషయాలపై దృష్టి పెట్టవలసి ఉండడంతో రాహుల్ వారికి ఇంకా అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. కాగా, సీనియర్ నేతలపై తెలంగాణపై సోనియా గాంధీ గురువారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ పాల్గొన్నారు.