Sunday, January 20, 2013
గండి బాబ్జీకి వివి వినాయక్ సారీ చెప్పారు
మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీకి నాయక్ చిత్రం దర్శకుడు వివి వినాయక్ ఆదివారం క్షమాపణలు చెప్పారు. గండి బాబ్జీతో తనకు ఇది వరకు ఎలాంటి పరిచయం లేదని, అతనిని కించపర్చాలని చిత్రంలో ఆయన పేరు పెట్టలేదని, ఆయనతో టచ్ కూడా లేదని, ప్రతి నాయకుడి పాత్రధారికి కాకతాళీయంగానే ఆ పేరు పెట్టామని, ఇందుకు ఆయన బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్‌లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.
Wednesday, December 12, 2012
యువరాజ్ ఓ ప్రత్యేకమైన పుట్టిన రోజు 12-12-12
క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఈరోజు ఓ ప్రత్యేకమైనది. ఆయన పుట్టిన రోజు డిసెంబరు 12 కావడం, మూడు పన్నెండులు రావడం, క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో ఈరోజు యువీకి ప్రత్యేకమైన పుట్టిన రోజుగానే చెప్పవచ్చు. ఈరోజుతో యువీకి 31 ఏళ్లు నిండుతాయి. క్యాన్సర్ నంచి కోలుకున్న తరువాత ఆయన జరపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆయన కుటుంబసభ్యులే కాదు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వ్యక్తిగా యువరాజ్ ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన పెంచడానికి తన పుట్టిన రోజును కేటాయిస్తున్నాడు. యూ వుయ్ కెన్ పేరుతో తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. స్నేహితులు తనకు మద్దతు ఇవావ్లని యువరాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Saturday, December 8, 2012
టాలీవుడ్ పై డ్రగ్స్ మత్తు!
ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం.. నేడు మాదకవూదవ్యాలకు అడ్డాగా మారింది. రోజు ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలతో సతమవుతున్న సినిమా పరిశ్రమ డ్రగ్స్ కలకలంతో తలెత్తుకోలేకపోతోంది. యువత శక్తిని నిర్వీరం చేస్తున్న మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమను వదల్లేదు. గ్లామర్ రంగంలో ఉన్న యువత సులభంగా డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు, యువ హీరోలు, హీరోయిన్లు, శ్రీమంతుల బిడ్డలు ఈ విష కౌగిలిలో చిక్కి పతనమైపోతున్నారు. ఖరీదైన హోటళ్లు, పబ్ లు, రిస్టార్టులు కేంద్రాలుగా డ్రగ్స్ చెలామణి అవుతున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని మాయా వలలు విసురుతున్నారు. పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న యువతను మత్తుకు ఈజీగా గులాములవుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడిన వారు బానిసలు మారుతున్నారు. red more
సాక్షికి మేత..సంబరాల్లో జగన్ పార్టీ
చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రజా బలం లేక చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అని విలీనం కావడం ఖాయం అని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఎఫ్ డీ ఐలకు సంబంధించి ఓటింగ్ లో పాల్గొనాల్సిన టీడీపీ ఎంపీలు దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.red more
Subscribe to:
Posts (Atom)