ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం.. నేడు మాదకవూదవ్యాలకు అడ్డాగా మారింది. రోజు ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస వివాదాలతో సతమవుతున్న సినిమా పరిశ్రమ డ్రగ్స్ కలకలంతో తలెత్తుకోలేకపోతోంది. యువత శక్తిని నిర్వీరం చేస్తున్న మాదక ద్రవ్యాలు సినిమా పరిశ్రమను వదల్లేదు. గ్లామర్ రంగంలో ఉన్న యువత సులభంగా డ్రగ్స్ కు అలవాటవుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు, యువ హీరోలు, హీరోయిన్లు, శ్రీమంతుల బిడ్డలు ఈ విష కౌగిలిలో చిక్కి పతనమైపోతున్నారు. ఖరీదైన హోటళ్లు, పబ్ లు, రిస్టార్టులు కేంద్రాలుగా డ్రగ్స్ చెలామణి అవుతున్నాయి. యువత బలహీనతను ఆసరాగా చేసుకుని మాయా వలలు విసురుతున్నారు. పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న యువతను మత్తుకు ఈజీగా గులాములవుతున్నాయి. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడిన వారు బానిసలు మారుతున్నారు. red more
No comments:
Post a Comment