http://apvarthalu.com/

Monday, September 30, 2013

అడిగింది ఏ రాష్ట్రం? ఇస్తున్నది ఏ రాష్ట్రం?

ఇస్తామంటున్న 29 వ రాష్ట్రం ఏది? సీమసర్కార్ ప్రాంతమా? తెలంగాణానా?

రాష్ట్ర విభజన చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అవకాశం కల్పిస్తోందని అంటున్నారు. ఆర్టికల్ 3లో నాలుగు పద్ధతులలో రాష్ట్ర విభజన చేయవచ్చు. కానీ అందులోని ఏ పద్ధతిలోనూ రాష్ట్ర విభజన సాధ్యం కాదని నా అభిప్రాయం:

ఆర్టికల్ 3 ఏమంటోంది?
1. రెండు లేదా అనేక రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చెయ్యవచ్చు.(3b ) – మన ముందున్నసమస్య ఇది కాదు.
2. వేర్వేరు రాష్ట్రాల భాగాలను చేర్చి సరి కొత్త రాష్ట్రం ఏర్పాటు చెయ్యవచ్చు.(3c) – ఇదీ కాదు.
3. ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని వేరు చేసి, అప్పటికే ఉన్నమరో రాష్ట్రంలో కలిపి కొత్త రాష్ట్రంగా రూపొందించవచ్చు (3d) – ఇదీ కాదు.
4. ఒక రాష్ట్రంలోని ఒక భాగాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రంగా ఏర్పరచవచ్చు. (3a) – ఇది సరిపోతుందా? చూద్దాం!

ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణాను వేరు చేయాలనే కదా ఉద్యమం నడుస్తోంది. ఈ 3a క్లాజ్ ‘రాష్ట్ర విభజన’ కు సరిపోతున్నట్లే ఉంది కదూ – కానీ ఇది కూడా అందుకు పనికి రాదు! ఎలాగో చూద్దాం:

3 a క్లాజు ప్రకారం ఒక ఉనికిలో ఉన్న రాష్ట్రం నుంచి కొంత భాగం చీల్చి ఇంకో రాష్ట్రం ఏర్పరిస్తే …. ఒక కొత్త రాష్ట్రం , ఒక కొనసాగే రాష్ట్రం ఏర్పడతాయి.read more

No comments: