ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికకావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సరికొత్త సవాల్‌ను తాను సమర్థవంతంగా నిభాయించగలనన్న నమ్మకం ఉందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన క్లైవ్ లాయిడ్ బాటలోనే ముందుకు సాగుతానన్నారు. క్రికెట్‌లో మరింతగా పాదర్శకతను సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు సంత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్న కుంబ్లే ఐసీసీ ఈ ఏడాది నిర్వహించే రెండో సభకు వచ్చే నెల హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుంబ్లేను ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌తో పాటు పలువురు అభినందించారు.
No comments:
Post a Comment