http://apvarthalu.com/

Sunday, November 4, 2012

పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలిపివేత


భారీ వర్షాల ప్రభావం రైలుమార్గాలపై తీవ్రంగా పడింది. పలు రైళ్ల రాకపోకలు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. విజయవాడ సమీపంలోని కొండపల్ల్లి- మధిర మధ్య రైల్వేట్రాక్‌పై నీరు నిలవడంతో పలు ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యం కాగా, ప్యాసింజర్ రైళ్లను శనివారం రద్దు చేశారు. గూడూరు-విజయవాడ, కాజీపేట- సికింద్రాబాద్ మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 12296 పాట్నా - బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, కర్నూలు, డోన్, గుత్తి, ద్రోణాచలం మీదుగా దారి మళ్లించారు.
తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్‌లను తెనాలి- గుంటూరు- నడికుడి- బీబీనగర్ మార్గంలో మళ్లించారు. 57237 కాజీపేట- విజయవాడ , 57238 విజయవాడ-కాజీపేట, 57254 విజయవాడ - భద్రాచలం, 57253 భద్రాచలం- విజయవాడ, 67269 కాజీపేట- దోర్నకల్, 67271 డోర్నకల్- విజయవాడ, 67273 విజయవాడ- గుంటూరు, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.

ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా రాజీనామా

'పదహారేళ్లపా టు ఎన్టీఆర్ పెట్టి న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నా.. ఎన్నో అవమానాలు భరించా.. ఆర్థ్ధిక ఇబ్బందులకు గురయ్యా.. నేను పోరాటం చేసేందుకు తగిన వేదిక కూడా దొరకలేదు.. ఎటూ పాలుపోలేక కొన్నిసార్లు నిస్తేజంగా ఉండిపోయాను.. వీటన్నింటితో వేగలేకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తు న్నా..' అని లక్ష్మీపార్వతి ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె శనివా రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను సమర్పిస్తున్నానని, లేఖ ప్రతిని పార్టీ ప్ర ధాన కార్యదర్శికి పంపానని, అలాగే న్యాయవాది సలహా తీసుకుని ర్రాష్ట ఎన్నికల సంఘానికి కూడా పంపనున్న ట్లు ఆమె వెల్లడించారు. 1996లో ఎన్టీఆర్‌కు అన్యాయంచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడున్న టీడీ పీ ఎన్టీఆర్ స్థాపించింది కాదని, చంద్రబాబు టీడీపీ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌పై నేరుగా పోరాటానికే వైసీపీని స్థాపించారని, తన ఉద్దేశం కూడా అదేనని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు. ఆ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానన్నా రు. ఎన్టీఆర్ పార్టీకి రాజీనామా చేయడం ద్వా రా మీరు కూడా ఎన్టీఆర్‌కు నమ్మకద్రో హం చేసినట్టు కాదా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానాన్ని దాటవేశారు.

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడి మృతి పట్ల జూ ఎన్టీఆర్ సంతాపం

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడి మృతి పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్ ఎంపీలు దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, సిఎం రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎర్రన్నాయుడు మృతి పార్టీకే కాక దేశానికి, రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, రోషన్‌బేగ్, బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అభిషేక్, తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు, కార్యవర్గ సభ్యుడు కే గంగరాజు, కర్ణాటక తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసయ్య, కర్ణాటక తెలుగు సమాఖ్య కార్యదర్శి బెల్లం రమణ చౌదరి తదితరులు ఎర్రన్నాయుడుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే...

ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లే... మీరు (ప్రజలు) కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసినా పంట చేతికి రావడం లేదు. నిత్యావసర ధరలు పెరిగి మధ తరగతి ప్రజలు నిరుపేదలవుతున్నారు. పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 'వస్తున్నా మీ కోసం పాదయాత్ర' బుధవారం జిల్లాలోని చిన్నచింతకుంట మండలం మద్దూర్, ఏదులాపూర్, వడ్డెమాన్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళా కూలీలు, రైతులు, వడ్రంగులను కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు రావడం లేదని కొందరు.. ఇంటి బిల్లులు ఇవ్వడం లేదని మరికొందరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆవేదనపై స్పందించిన చంద్రబాబు, జిల్లా పేదరికాన్ని చూసే తాను సీఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకున్నట్లు ప్రకటించానని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

Thursday, November 1, 2012

ఆలయాలలో చోరీలన్నీ మాఫియా పనేనా..!

హైదరాబాద్ సిటీ బంగారం ధర చుక్కలనంటుతుండటంతో దొంగల దృష్టి ఆలయాలపై పడిందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే.. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. దొంగసొత్తును మార్కెట్లో విక్రయిస్తే అందులో సగం మాత్రమే వస్తోందన్న సంగతి తెలిసిందే. ఆలయాల్లో దొంగిలించిన సొత్తుకు మాత్రం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క పురాతన వస్తువు చేతిలో పడినా దొంగల పంట పండినట్టే. ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అమ్మవారి ఆభరణాలు, పురాతన పంచలోహ విగ్రహాల చోరీ వెనుక పెద్ద కథే దాగి ఉంది. ఈ మాఫియా చీకటి వ్యాపారంపై ప్రత్యేక కథనం.. పురాతన వస్తువులెన్నో..నగరంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. వీటిలో అమ్మవారి ఆలయాలే అధికంగా ఉన్నాయి. బంగారం, వజ్రకిరీటాలు, ఆభరణాలు, ముక్కుపుడకలు, గాజులు అమ్మవారి విగ్రహాలకు అలంకరిస్తున్నారు. కొందరు భక్తులు వేలు, లక్షల రూపాయలు ఖర్చు బెట్టి ఆభరణాలను తయారు చేయించి కానుకలుగా సమర్పిస్తున్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయంతో కమిటీ సభ్యులు కూడా అమ్మవారికి బంగారు వస్తువులు చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, క్రీస్తు పూర్వం, నిజాం నవాబుల కాలంలో వెలసిన గుళ్లలో ఎన్నో రకాల పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. పూజలకు వినియోగించే పంచలోహ పాత్రలూ ఉన్నాయి. వీటిలో అమ్మవారు, గణేశ్, రామలక్ష్మణులు, నటరాజు వంటి విగ్రహాలతో పాటు అరుదుగా కనిపించే శంఖాలు కూడా ఉంటున్నాయి. విలువ లక్షలు, కోట్లేనటఅమ్మవార్లు ధరించిన ఆభరణాలు, పురాతన విగ్రహాలతో సహా ఆలయాల్లోని ఇతర ఏ వస్తువుకైనా అతీతశక్తులు ఉంటాయని భక్తులు భావిస్తుంటారు. కానుకలుగా సమర్పించిన కొత్త వస్తువులైనా.. కొద్దిరోజులు పూజలందుకుంటే చాలు వాటికీ మహిమలు ఉంటాయని నమ్ముతుంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వీటికి గిరాకీ బాగా ఉంటోంది. శక్తులు ఉన్నాయన్న నమ్మకంతో వాటి విలువ లక్షలు, కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పురాతన విగ్రహాలంటూ విక్రయిస్తున్న 12 ముఠాలను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టార్గెట్ అందుకేనా.. నగరం, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలోని పురాతన ఆలయాలపై దొంగల ముఠాలు విరుచుకుపడుతున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ ఆలయాలలోని సొత్తును కొల్లగొడుతున్నాయి. జంట కమిషనరేట్లలోని చిన్నా,చితకా అన్నీ కలిపి ఈ ఏడాది అక్టోబర్ వరకు 27 ఆలయాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెలలో జరిగిన దొంగతనాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయమే. గోల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాలలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్వాన్‌లోని ఓ ఆలయంలో పురాతన విగ్రహాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా నేరాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలు ఈ సొత్తునంతా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్నో మాఫియా ముఠాలుదేశంలో ఎన్నో మాఫియా ముఠాలు చీకటి వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో కరుడుగట్టిన నేరస్తులు, దొంగలతో పాటు కొందరు వ్యాపారులు కూడా ఉంటున్నారని సమాచారం. ఇతర రాష్ట్రాలతో పాటు నగరంలో కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఉన్న చాలామంది ఇదే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ఇలాంటి వారు నలురైదుగురు కలిస్తే చాలు.. ప్రధానంగా ఇదే విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. అమ్మవారి అభరణాలు, పురాతన విగ్రహాలే కాకుండా నాణేలు, రెండు తలల పాములను కూడా విక్రయిస్తున్నారు. అంతెందుకు ఇటీవలికాలంలో అయిదు రూపాయల నోటుకు 50 రూపాయలు ఇచ్చి ఈ మాఫియా హల్‌చల్ చేసింది. సాధారణంగా పొలాలలో దొరికే రెండు తలల పాము, నక్షత్ర తాబేళ్లు, రంగురాళ్ల ధరను లక్షలు, కోట్లు పలికేలా చేశారు. మార్కెట్లో అమ్మవారి ఆభరణాలకు ఉన్న డిమాండ్‌తో లబ్దిపొందేందుకే ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసినా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దర్యాప్తు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మళ్లీ నరేంద్ర మోడిదే హవా!: పెరిగిన ముస్లింల మద్దతు !

వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలలు గుజరాత్ ఎన్నికలలో మళ్లీ భారతీయ జనతా పార్టీయే ఘన విజయం సాధించనుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు మరెంతో దూరం లేనందున సర్వే సంస్థలు గుజరాత్ ప్రజలు ఎవరి ఓటు వేస్తారో తెలుసుకునేందుకు పలు దఫాలుగా సర్వేలు చేస్తున్నాయి. ప్రారంభంలో బొటాబొటి మెజార్టీతో బిజెపియే మళ్లీ గుజరాత్‌ను దక్కించుకుంటుందని చెప్పిన సర్వేలు తాజాగా అద్భుత విజయం సాధిస్తాయని చెబుతున్నాయి. కేవలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనే పదం ఒక్కటే బిజెపి ఘన విజయానికి తోడ్పడుతుందని చెబుతున్నాయి. బిజెపిని పార్టీగా కంటే మోడిని వ్యక్తిగా గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కువగా ఆదరిస్తున్నారట. మోడికే ఓటు వేసేందుకు మెజార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారట. ఆయన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన తీరు, అభివృద్ధి, ఉద్యోగాలు తదితరాల కారణంగా ఆయనకే మళ్లీ పట్టం కడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారట. 2007 కంటే ఇప్పుడు బిజెపికి ఓటింగ్ శాతం రెండు వరకు పెరగవచ్చునని, ఈ ఓటింగ్ శాతమే బిజెపి గతంలో కంటే ఎక్కువ స్థానాలలో గెలుపొందేందుకు అవకాశముందని చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు మద్దతు కూడా మోడీకి క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. 2007లో 14 శాతం మంది ముస్లింలు మోడీకి మద్దతు పలకగా ఇప్పుడు అది 23 శాతానికి పెరిగింది. అయితే మోడీకి కేశూభాయ్ పటేల్ షాకిచ్చే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉన్నప్పటికి కేశూభాయ్ కారణంగా బిజెపి ఓట్లు కొద్దిగా చీలి నష్టపరుస్తుందని చెబుతున్నారు. మరో విషయమేమంటే గుజరాత్ ఎన్నికలే 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా లేదా అని తేల్చనున్నాయి.

'దేనికైనారెడీ' సినిమాపై బ్రాహ్మణుల ఆందోళన

'దేనికైనారెడీ' సినిమాపై జరుగుతున్న వివాదం చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. సినిమాల్లో తమ వర్గాన్ని హేళనచేసే దృశ్యాల గురించి ఇంతవరకూ పట్టించుకోని బ్రాహ్మణులు ఇకపై వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తమ వర్గం వారిని సమీకరించుకుంటున్నట్టు కనబడుతోంది. ఇందులో భాగంగా మొదటి టార్గెట్ ఇది. గతంలో 'అదుర్స్' సిన్మాలో బ్రాహ్మణుల్ని కించపరిచినంతగా ఇందులో 5 శాతం కూడా లేదని కొందరు మిత్రులు చెప్పారు. వాస్తవానికి సినిమాల్లో బ్రాహ్మణుల్ని హేళనచేయడం సాధారణమై పోయింది. ఒక కమ్యూనిటీని ఎగతాళి చేయకుండా సిన్మాలు తీయడం మనోళ్ళకి చేతకాదా అని నా అనుమానం.  నా చిన్నపుడు అనేకసార్లు చూసిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేసే కామెడీ చాలా నచ్చేది. కానీ ఇప్పుడు గనక చూస్తే వైశ్య కమ్యూనిటీని కించపరిచేవిధంగా వుందనిపిస్తుంది. సినిమాను సినిమాగానే చూడాలని కొందరంటున్నారు... కానీ సినిమా కూడా ఒక మీడియానే...అది కూడా ప్రజలముందే ప్రదర్శితమవుతోంది కదా? బ్రాహ్మణ సంఘాలు నిరసనలకు దిగడం మంచి పరిణామమే.ఇలా వర్గాలుగా విడిపోకుండా అందరూ సంఘటితమై పోరాడితేనే ఏదైనా సాధించగలరు. ఏదిఏమైనా ఒక కమ్యూనిటీని కించపరిచేవిధంగా ఎవరు ప్రవర్తించినా కులమతాల కతీతంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని నా కోరిక... If I am not wrong.