సీమాంధ్ర నేతలు పెత్తనాన్ని కొనసాగించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి తెలంగాణ రాకుండా అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది కేంద్ర అధిష్టానానికి, కాంగ్రెస్ కు పరీక్షా కాలమని కోదండరామ్ అన్నారు. ప్రలోభాలకు లొంగుతారో, ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం న్యాయసమ్మతంగా ఉంటే పోలీసు బలగాల అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే భారీ ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
Sunday, January 20, 2013
గండి బాబ్జీకి వివి వినాయక్ సారీ చెప్పారు
మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీకి నాయక్ చిత్రం దర్శకుడు వివి వినాయక్ ఆదివారం క్షమాపణలు చెప్పారు. గండి బాబ్జీతో తనకు ఇది వరకు ఎలాంటి పరిచయం లేదని, అతనిని కించపర్చాలని చిత్రంలో ఆయన పేరు పెట్టలేదని, ఆయనతో టచ్ కూడా లేదని, ప్రతి నాయకుడి పాత్రధారికి కాకతాళీయంగానే ఆ పేరు పెట్టామని, ఇందుకు ఆయన బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్, అమలపాల్ నాయకానాయికలుగా డివివి దానయ్య నిర్మాణంలో, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ చిత్రం విజయోత్సవ యాత్రను చిత్ర యూనిట్ చేపట్టింది. విశాఖపట్నంలోని వీమాక్స్‌లో రామ్ చరణ్ తేజ, వివి వినాయక్ తదితరులు ప్రేక్షకులతో చిత్రం విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి క్షమాపణలు చెప్పారు.
Subscribe to:
Posts (Atom)