Monday, December 3, 2012
Saturday, December 1, 2012
నిజంగా ప్రేమించడం అంటే ఏంటో!
ప్రియమైన సాటి ప్రేమికులందరికీ ప్రేమపూర్వక సుస్వాగతం... ఈ రోజుల్లో చాల మంది ప్రేమికులు తాము ప్రేమిస్తున్నామనే భావనలో ఉంటున్నారేకానీ నిజంగా ప్రేమించడం లేదు దాని చాల కారణాలు ఉన్నాయి..
వారికి నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలియకపోవడం, ఎలా ప్రేమించాలో తెలియకపోవడం, ప్రేమిస్తే ఎం చేయాలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం. ప్రేమలో ఎదుటి వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తారో తెలియకపోవడం
ఇలా చాల కారణాలు ఉండొచ్చు...అలా అని వారి ప్రేమ స్వచ్చమైనది కాదు అని నేను అనను.. కానీ ప్రేమంటే పూర్తిగా తెలియకపోవడం వల్లనే వారి మద్య గొడవలు, అలకలు, విడిపోవడాలు జరుగుతున్నాయి.. ప్రేమలో ఎంత ఆనందం ఉంటుందో దానిలో తేడాలు వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ నరకం కనిపిస్తుంది..ఆలాంటి బాధని ఏ ప్రేమికులు అనుభవించకూడదు అన్న చిన్ని సంకల్పంతో ఒక చిన్ని ప్రయత్నాన్ని ఆరంబించబోతున్నాను..
ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి నేను సరిపోను కానీ నాకు తెలిసిన కాస్త ప్రేమ జ్ఞానాన్ని మీకు అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం అంతే...
నా ఈ చిన్ని ప్రయత్నం వల్ల ఒక్క జంటలో మార్పు వచ్చిన సరే నా ఏ ప్రయత్నం సఫలం అయినట్టే.. అందరికి మహోన్నతమైన ప్రేమదొరకాలని ఆకాంక్షిస్తూ...........ప్రేమతో మీ..
జగన్ గెలిచినా కష్టాలు: జెసి దివాకర్ రెడ్డి
కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలతో శనివారం అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో వారిని మీడియా చూసి జెసి కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు చేరిందా? లేక వైయస్సార్ కాంగ్రెసులో జెసి కాంగ్రెసు చేరిందా? అని ప్రశ్నించారు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు జెసి పేరులోనే జగన్ కాంగ్రెసు ఉందని చెప్పారు.
ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.
Wednesday, November 28, 2012
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
సినీ పరిశ్రమలోకి డైలాగ్ రైటర్ గా తన ప్రస్తానం ప్రారంభించిన త్రివిక్రమ్ తన పదునైన రచనా నైపుణ్యంతో అనతి కాలంలోనే పాపులర్ డైలాగ్ రైటర్‌గా ఎదిగారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కేవలం 5 మాత్రమే. అయినా అతని సినిమాలంటే జనాల్లో మహా క్రేజ్ ఏర్పడిందంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు.red more
చెయ్యెత్తితే బస్పు ఆగదు..బొత్స నిర్వాకం !
వెనకటికి ఓ కథ ఉంది. ఆ కథలో కుక్క, గాడిద ఉంటాయి. ఓ రోజు కుక్క చేయాల్సిన పని అత్యుత్సాహంతో గాడిద చేస్తుంది. దాని పర్యావసానం గాడిద నడ్డి విరుగుతుంది. కాకాలు పట్టి, అడుగులకు మడుగులొత్తి రాజకీయాల్లో చేరి అమాత్యులైనవారు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో తాజాగా ఆర్టీసీ లో తీసుకుంటున్న నిర్ణయాలు తేల్చిచెబుతున్నాయి. మందు దందా చేసే వారు మంత్రులయితే ఎలా ఉంటుందో తాజాగా బొత్స నిర్ణయం అలాగే ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ఇటీవలె ఛార్జీలు పెంచారు. అయినా ఆర్టీసి రూ.4200 కోట్లు అప్పులు ఉంది. నెలకు రూ.100 కోట్లు వడ్డీ చెల్లిస్తుంది. అయినా కార్మికుల జీతాల కోసం ప్రతి నెలా రుణాలు తేవాల్సి వస్తోందట. అందుకే ఈ నష్టాల భర్తీకి మరోసారి ప్రయాణీకుల మీద భారం మోపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రయాణికుడి నుండి అర్ధ రూపాయి నుండి రూపాయి దాకా సర్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి ఆ శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సంతకం కూడా చేసేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది అది ఏంటంటే ఆర్టీసీలో ఫ్లాట్ ఫాం టికెట్ ప్రవేశ పెడతారట. అంటే రైల్వేస్టేషన్లలో మాదిరిగా అన్నమాట. బస్టాండుకు వచ్చిన ప్రతి ప్రయాణికుడి ఈ డబ్బులు వసూలు చేసి ఆయా బస్ స్టేషన్ల నిర్వహణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారట.red more
పార్టీ - పార్టీ నడుమ కోదండరామ్
నారీ నారీ నడుమ మురారి అన్నట్లు రెండు తెలంగాణ పార్టీల మధ్య తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిల మధ్య విభేదాలు కోదండరామ్‌కు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. రెండు తెలంగాణ పార్టీల మధ్య వైరాన్ని నివారించేందుకు తెలంగాణ రాజకీయ జెఎసి నడుం బిగించింది.
మంగళవారం సమావేశమైన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆవశ్యకతను గుర్తించింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తెలంగాణవాదానికి నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీన తలపెట్టిన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి జెఎసి రెండు పార్టీలను కూడా ఆహ్వానించింది.red more
Tuesday, November 27, 2012
మన రాష్ట్రంలో దేవుడు తలలు పగులగొట్టుకోమన్నాడా?
మొహరం సందర్భంగా షియా భక్తులు తలలు పగులకొట్టుకోవడం, గుండెలపై బాదుకోవడం...
కర్నూలుజిల్లా దేవరగట్టులో భక్తులు దేవుడ్ని దక్కించుకోవడానికి కర్రల సమరం. పగిలే తలలు..
గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ వేయించుకోవడం, ముళ్ళ కిరీటాలు ధరించడం...
కాళీమాతకు తన నాలుక కోసి అర్పించిన భక్తుడు...
దేవుడ్ని చూడాలనే తపనతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు....red more
కర్నూలుజిల్లా దేవరగట్టులో భక్తులు దేవుడ్ని దక్కించుకోవడానికి కర్రల సమరం. పగిలే తలలు..
గుడ్ ఫ్రైడే సందర్భంగా శిలువ వేయించుకోవడం, ముళ్ళ కిరీటాలు ధరించడం...
కాళీమాతకు తన నాలుక కోసి అర్పించిన భక్తుడు...
దేవుడ్ని చూడాలనే తపనతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు....red more
Subscribe to:
Posts (Atom)